జగన్‌ వెనుకే పవన్‌

– ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షంపై విమర్శలు 
– వైయస్‌ జగన్‌కి పేరొస్తుందనే భయంతోనే 
పవన్‌తో చంద్రబాబు రహస్య మిత్రత్వం
– అనుమానాలను బలపరుస్తున్న ఘటనలు 


ముసుగు తొలగిపోయింది.  నాలుగేళ్ల నయవంచనకు తెరపడింది. అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రజల తరఫున ప్రశ్నిస్తానని.. కష్ట నష్టాల్లో అండగా ఉంటానని మాటిచ్చిన మనిషి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తేలడానికి  కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. ప్రజలకు కష్టం కలిగినప్పడు కాకుండా... ప్రభుత్వానికి నష్టం జరిగినప్పుడు ఎందుకొస్తున్నాడా? అని కలిగిన అనుమానాలకు  సమాధానాలు చెప్పకనే చెప్పాడు. షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పిన  ఖాళీలో మేకప్‌ తీసేసి ముసుగేసుకొచ్చిన మనిషి ఎవరు పంపితే వచ్చాడు.. ఎవరు చెప్పింది మాట్లాడుతున్నాడో సామాన్యుడికి కూడా స్పష్టంగా తెలిసొచ్చింది. సకల సమస్యలకు కారణమైన ప్రభుత్వాన్ని నిలదీయకుండా సంబంధం లేని విషయాల్లో ప్రతిపక్ష నాయకుడి పేరు ప్రస్తావించినప్పుడే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  అంతరంగం తెలిసిపోయింది.  

ప్రతిపక్ష నాయకుడిని పొగడకపోతే ఇగో అనుకున్నాం కానీ.. అసందర్భంగా, అనవసరంగా తిడుతుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి మాటలకే పరిమితం అయ్యింది ఎవరో.. ఓడిపోయినా నాలుగేళ్లుగా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతున్నది ఎవరనేది ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. పవన్‌ కల్యాణ్ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం సమంజసమో కాదో విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం ఇది. సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపొతే రాష్ట్రం ఎంత నష్టపొతుందొ  ప్రజలు తెలుగుదేశం పాలనతో  చవి చూసారు. ప్రజలకు అండగా, ప్రజా సమస్యల మీద అవగాహన గల నేత గా ఎవరు ప్రజలకి మేలు చేయగలరో బేరీజు వేసుకోవాల్సిన సమయం వచ్చింది.  
 పవన్‌ , చంద్రబాబు అనుకూలుడు అని వస్తున్న ఆరోపణలకు  కారణాలు, అలాగే పవన్‌ కల్యాణ్ కి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్త శుద్ది, ప్రతిపక్షంగా జగన్‌ విఫలం అని పదే పదే ప్రభుత్వం నుండి వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో చూద్దాం..  

పవన్‌ కల్యాణ్, చంద్రబాబు రహస్య మిత్రులు అనే అనుమానం ప్రజలకి రావటానికి ముఖ్య కారణాలు ?


1) జగన్‌ వెనకాలే పవన్‌ పర్యటన

2015 మార్చి 3 –– తాడేపల్లి , మంగళగిరి, తుల్లూరు మండలాలలొ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ పర్యటింటిన వెంటనే రెండు రోజులకు పవన్‌ కళ్యాణ్‌ 2015 మార్చి 5 న ఉండవల్లి, ఎరబ్రాలెం, బేతపుడి, తుల్లూరు లొ పర్యటించారు. (రాజధాని అవసరమే రైతులని ఒప్పించి తీసుకోండి అని సలహా ఇచ్చి వచ్చారు )

2) ధర్నా కి పిలుపిచ్చిన వైయస్ జగన్ , దానికన్నా ముందు పర్యటన పెట్టుకున్న పవన్‌

ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు భూసేకరణ పై ప్రజలు, రైతులు, రైతు కూలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘాలు ఆగస్టు 25–2015 న బంద్‌ కి పిలుపునిచ్చాయి.అంతకంటే ముందే  ప్రతిపక్ష నాయకులు జగన్‌ 26 న ధర్నాకి పిలుపునిచ్చి ఆయనే స్వయంగా వస్తా అన్నారు. ఇలా అన్నారో లేదో పవన్‌ కల్యాన్‌  అక్కడికి వచ్చి బలవంతంగా భూములు లాక్కోవద్దు. వాళ్ళకి నచ్చితే తీసుకోండి ∙అని ప్రభుత్వానికి చెప్పారు.
అక్కడ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరకతతో ప్రతిపక్ష నేతకు  ఎక్కడ మైలేజ్ వస్తుందో అని,  పవన్‌ ని అడ్డం పెట్టుకుని , ఆయన  చెప్పాడు కాబట్టి  భూసేకరణ తాత్కాలికంగా వాయిదా వేశామనే  అనే భావన కలిగే లా చెశారు. (అటు తరువాత గుట్టుచప్పుడు కాకుండా బెదిరించి భయపెట్టి భూసేకరణ చేశారు.  బయటకి రాజధాని రైతులు  ఇష్ట పూర్వకంగా 33వేల ఎకరాలు ఇచ్చారు అని ప్రచారం చేసుకున్నారు. )

3) ప్రత్యేక హోదా బంద్‌కి పిలుపు,  పవన్‌ దేశ సమగ్రత ట్వీట్‌ విన్నపం

2015 ఆగస్టు 10 న ఢిల్లీలో వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు  జగన్‌ ప్రత్యేక హోదా కోసం భారీ ధర్నా చేశారు. అటు తరువాత కొద్ది రోజులకే , అగస్టు 25న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి , ప్రత్యేక హోదా కన్నా  ప్యాకేజినే  బాగుంటది అని చెప్పారు.  ఈ ప్రకటనను నిరసిస్తూ , కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలురాష్ట్ర ప్రజల్ని మోసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 29 న రాష్ట్ర బంద్‌ కి పిలుపునిచ్చారు. కానీ పవన్‌ ఆగస్టు 28 న (బంద్‌ కి ఒక్కరొజు ముందు పవన్‌ ఇలా ట్విట్‌ చేశారు – నేను విభజన వలన జరిగిన నష్టాన్ని మోడీకి వివరించాను సానుకూలంగా స్పందించారు, వారు ఇచ్చిన హామిని నెరవేరుస్తారు అని భావిస్తున్నా, దేశ సమగ్రతను దష్టి లొ పెట్టుకుని భావోద్వేగాలకు పోకుండా కొంతకాలం వేచి చూాద్దాం అని ట్విట్‌ చేశారు )

4) జగన్‌తో పాటు విపక్షాలు బంద్‌ కి పిలుపు , ప్రజలెందుకు పొరాడాలి అని చెప్పిన పవన్‌

2016 సెప్టెంబర్‌ 8న అర్ధరాత్రి అరుణ్‌ జైట్లి ప్రెస్‌ మీట్‌ పెట్టి , హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పారు. దీనిని నిరసిస్తూ వైయస్ ఆర్ సీపీతో పాటు మిగిలిన విపక్షాలు 10వ తారీకున రాష్ట్ర బంద్‌ కి పిలుపుని ఇచ్చారు. పవన్‌ కల్యాణ్  అదే సెప్టెంబర్‌ 10న కాకినాడ లో సభ పెట్టి ,  ప్రజలు ఎందుకు పోరాడాలి.., బీజేపీ  పాచిపొయిన లడ్డులు ఇచ్చింది , పార్లమెంటు మెంబర్లు మాత్రమే పొరాడాలి అని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు (ఇలా ప్రత్యేక హోదా ఉద్యమంలో  ప్రజలు భాగస్వామ్యం వద్దు అన్నారు)

5) జగన్‌ జై ఆంధ్రప్రదేశ్‌,  పవన్‌ సీమాంధ్ర హక్కులు

2016 నవంబర్‌ 6 న విశాఖలో జై ఆంద్రప్రదేశ్‌ సభ పెట్టిప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అది ఎన్నికలలొ చంద్రబాబు, మోడీ కలిసి ఇచ్చిన హామీ అని, ప్రత్యేక హోదా తొనే మన మనుగడ అని సభలో  ప్రతిపక్ష నేత  ప్రసంగించారు. 2016 నవంబర్‌ 10 న ( నాలుగు రొజులకి) పవన్‌ అనంతపూర్‌ లో సీమాంధ్ర హక్కుల సభ అని పెట్టి బీజేపీని మీరు అర్ధరాత్రి ఎందుకు ప్యాకేజి ఇచ్చారు. నాకు మొక్కలంటే ఇష్టం, నేను కూలి పని చేస్తా , అని మాట్లాడారు.

6) అగ్రిగోల్డ్‌పై జగన్‌.. వెనకాలే పవన్‌

2017 మార్చి 23 న జగన్‌ దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితుల దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంటా.. మీరు అధైర్య పడొద్దు ఎవరూ ఆత్మహత్య చేసుకొవద్దు, న్యాయం జరిగేలా చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తా.  ఆయన స్పందించకపొతే తరువాత మీకు ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు 1,182 కోట్లు కేటాయించి 14 లక్షల మంది అగ్రిగొల్డ్‌ భాదితులని తాను ఆదుకుంటా , చనిపొయిన వారికి 3 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తామనీ, ఎవ్వరూ అధైర్య పడద్దు అని భరొసా ఇచ్చి దీక్షను విరమింప చేశారు. సరిగ్గా ఆరు రొజుల తరువాత మార్చి 30న పవన్‌ కళ్యాణ్‌ గారు అగ్రిగొల్డ్‌ భాదితులతొ ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేసి అగ్రిగొల్డ్‌ విషయం కొర్టు లొ ఉంది, ఏజెంట్ల తప్పులేదు, ముళ్ళ మీద గుడ్డ పడింది జాగ్రత్త గా తీసుకొవాలి ప్రభుత్వం దీనిని పరిష్కరించాలి అని చెప్పి వెళ్లారు. 

7) జగన్‌ రైతు దీక్ష విరమించిన 30 నిమిషాలకే పవన్‌ ప్రకటన

రాష్ట్రం లొ దళారీల వలన మిర్చి, పత్తి,కంది,పసుపు రైతులు మద్దతు దర లేక పండించిన పంట అమ్ముకొవటానికి అవస్థలు పడుతున్నా , ప్రభుత్వం నుంచి  చలనం లేకపొవటంతో జననేత  జగన్‌ గుంటూరు లొ 2017 మే 1, 2 తారీకులలొ దీక్ష చేపట్టారు. ఇలా చేపట్టిన దీక్షను  2వ తారీకున విరమించగానే, పవన్‌ రైతులకి మద్దతు ధర కల్పించాలి అని ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబుకి ఏవైతే అనుకూల పత్రికలు,  ఎలక్ట్రానిక్‌ మీడియా అండగా ఉంటున్నాయో అవన్నీ పవన్‌ కల్యాన్‌కి కూడా వత్తాసు పలుకుతున్నాయనేది బహిరంగ రహస్యం. పవన్‌ ప్రత్యక్షంగా బయటికి వచ్చింది , ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం, చేనేత సభ కొసం. ఇందులోనూ చేనేత సభ కి వాళ్ళు పిలిస్తే వెళ్ళారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ బాధితులను కూడా హైదరబాద్‌కి పిలిపించుకుని మాట్లాడారు. అదీ వారు అపాయింట్‌మెంట్‌ కోరితే. మిగతావన్నీ ఉత్తర భారత దక్షిణ భారత ట్వీట్లే. 


8) జగన్‌ పాదయాత్ర పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన

రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలొ అవినీతి, అకృత్యాలు పతాకస్థాయికి చేరి ప్రజలని గ్రామ గ్రామాన కమిటీలు వేసుకుని పీక్కుతింటుంటే, ప్రజలకు అండగా ఉండటానికి ఆంధ్ర ప్రదేశ్‌ లొని ప్రతి జిల్లాకి పాదయాత్రగా వస్తా అని ప్లీనరీ లో  వైయస్‌ జగన్‌  ప్రకటించారు

పవన్‌ కల్యాణ్‌ మాత్రం జులై 31 న ఉద్దానం అని చెప్పి చంద్రబాబుని కలిసి సుమారు గంట సేపు చర్చలు జరిపి బయటకి వచ్చి నేను అక్టొబర్‌ నుండి పూర్తి స్థాయి రాజకీయాలలోకి వస్తా అని ప్రకటించారు , పైగా నేను కమిట్‌ అయిన సినిమాలు ఉన్న డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లకి నచ్చ చెప్పుకుని వస్తా అని చెప్పారు.ముందు నుండి ప్లానింగ్‌ ఉంటే సినిమాలు ఎందుకు ఒప్పుకున్నారనేది  ఒక ప్రశ్న. 

9) వైయస్‌ఆర్‌సీపీ పోలవరం పర్యటన పెట్టుకున్న రోజే పవన్‌ కూడా 

పోలవరంలో జరుగుతున్న అవినీతి ని ప్రజలకి తెలియచేయటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిసెంబర్‌ 7 న పోలవరం పర్యటన చేస్తున్నామని డిసెంబర్‌ 2 న ప్రకటించగానే , పవన్‌ కల్యాణ్  కూడా అదే రోజున (డిసెంబర్‌ 7 నే) పోలవరం టూర్‌ చేస్తామని డిసెంబర్‌ 5న ప్రకటన విడుదల చేశారు


ఇలా జరిగిన వరుస సంఘటనలు చూస్తే జగన్‌ అనే శక్తి ని అడ్డుకోవటానికి చంద్రబాబే స్వయంగా పవన్‌ కళ్యాన్‌ని ప్రయోగిస్తున్నారనే అనుమానాలు నిజమేనని విశ్వసించక తప్పదు.
Back to Top