పట్టిసీమలో కొత్త మతలబు

కమీషన్ల కోసం కొత్త కొత్త నాటకాలు ఆడటంలో చంద్రబాబుని మించిన వారు  ఉండరు. పనికిమాలిన పథకం గా పేరు తెచ్చుకొన్న పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో దాదాపు 300 కోట్ల దాకా కమీషన్ల కింద నొక్కేశారు. అందుచేత ఈ పథకాన్న సూపర్ డూపర్ హిట్ చేసేందుకు నానా అవకతవకలకు పాల్పడుతున్నారు.

పట్టిసీమ పథకం పూర్తి అయింది అనిపించుకొనేందుకు చంద్రబాబు అండ్ కో పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఆగస్టు 15 ముహుర్తం కుదరకపోయినా జాతికి సిమెంటుఫలకను అంకితం చేసి మమ అనిపించేశారు. తర్వాత శుభముహుర్తంలో నదుల అనుసంధానం చేద్దామనుకొంటే నీళ్లు రాలేదు. అయినా సరే, చెంబుడు నీళ్లు పోసి నదుల అనుసంధానం అయిపోయిందన్నారు. దీన్ని చూసుకొనేందుకు ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి రైతులతో విహార యాత్రలు చేయించారు. ఇన్ని చేయించినా కానీ నీళ్లు తోడటం మాత్రం జరగటం లేదు.

దీంతో చంద్రబాబు దళానికి కోపం ముంచుకొచ్చింది. గోదావరి నుంచి అదే పనిగా నీళ్లు తోడేసేందుకు కొత్త కుట్రకు తెర దీశారు. పట్టిసం దగ్గర నీటిని తోడటం బలంగా జరగాలంటే బురద తగలకూడదు. గోదావరి డెల్టా ఎండిపోకుండా ఉండాలంటే 14 అడుగుల కిందకు పోనీయరాదు. అప్పట్లో  12న్నర అడుగుల దగ్గర ఆపేస్తామని గోదావరి జిల్లా రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడ నీళ్లు 14 అడుగుల లోపే నీళ్లు ఉంటున్నాయి. దీంతో అక్కడ క్రత్రిమంగా చానెల్ ను బాగా లోతుగా చేసేస్తున్నారు. అప్పుడు నీటిని ఉధ్రతంగా తోడేసేందుకు వీలవుతుంది.  

ఎలాగైనా పట్టి సీమ నుంచి నీటిని తోడేసేం అనిపించుకొనేందుకు గోదావరి జిల్లాల్ని ఎండ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి లో వరద నీరు రావటం దాదాపుగా ఆగిపోయింది. అంటే అక్కడ స్వల్పమొత్తంలో నే నీరు ఉంది. ఈ నీటిని అడ్డగోలుగా తోడేస్తుండటంతో త్వరలోనే గోదావరి డెల్టా ఎండిపోవటం ఖాయం అన్న మాట వినిపిస్తోంది.  
Back to Top