పురువు తీసిన బరువు దీక్షలు

తెలుగుదేశం
పార్టీనేతలు పసుపు రంగు ముసుగు చాటున ఎంత రాష్ట్రద్రోహం చేస్తున్నారో ఓ వీడియో బైటపెట్టింది. పోరాటాలు, దీక్షలు అని చెప్పుకునే ఆ పార్టీ నేతలకు వాటిపై ఉన్న విలువెంతో ఈ వీడియో బట్టబయలు
చేసింది. ప్రజల్లో మైలేజీ కోసం తప్ప ఉక్కు పరిశ్రమ తెచ్చేందుకు
వారిలో ఏ ఒక్కరికీ చిత్తశుద్ధి లేదన్న వాస్తవం ప్రజలకు తెలిసిపోయింది. వంటి బరువు తగ్గడం కోసం, ప్రజల్లో సింపతీ బరువు పెరగడం
కోసం తప్ప రాష్ట్రం కోసం టిడిపి నాయకులు దీక్షలు చేయడం లేదని రూఢీ అయిపోయింది.

ఉత్తుత్తి
దీక్షలు

కనీసం
ఓ 5కేజీల బరువు
తగ్గుతాం కదా నేను ఐదు రోజులు చేయగలుగుతా అన్నారు ఎంపీ మురళీ మోహన్. రైల్వే జోను గీను ఏమీ లేదు అని వేళాకోళం చేసారు అవంతి శ్రీనివాస్. మొదటి రోజే పడిపోయేవాళ్లను దీక్షలకెందుకు తీసుకెళ్లడం అంటూ జోక్ చేసారు మరో
ఎంపీ. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టిడిపి ఎంపిల తీరు ఇంత నిర్లక్ష్యపూరితంగా
ఉంది. ఏదో చేద్దాంలే, ఆ హామీలు నెరవేరేవి
ఎలాగూ కాదు, కనుక దీక్షలు చేసి ప్రజల్లో ఏదో చేసామన్న బిల్డప్
క్రియేట్ చేసుకోవచ్చు అన్నవిధంగా ఉంది వీరి తీరు. ఎంపీల వ్యవహార
శైలి చూసిన ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఒక్క రోజులోనే
వైరల్ అయిన ఈ వీడియో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. టిడిపి అనుకూల
మీడియాసైతం వేగంగా స్ప్రెడ్ అయిన ఈ వార్తను ప్రసారం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

విశ్వసించని
ప్రజలు

టిడిపి
దీక్షలపట్ల ప్రజల్లో మొదటినించీ నమ్మకం లేదు.
చంద్రబాబు ధర్మపోరాట దీక్షలకు బలవంతంగా తెప్పించిన వారు కూడా గేట్లు
దూకి పారిపోయారు. ఇలాంటి సమయంలో దీక్షల పట్ల ఎంపిల వ్యవహారశైలి
ప్రజల్లో మరింత వ్యతిరేకతకు కారణం అయ్యింది. దీన్ని కవర్ చేసుకునేందుకు
ఎంపీలంతా ఉన్నపళాన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ మాట్లాడుకున్న
మాటలు అవి కావని, ఎవరో మా గొంతులు మిమిక్రీలు చేసారని వివరణ ఇచ్చుకునే
ప్రయత్నం చేసారు. మీడియా కూడా ఇలాంటి వాటిని ప్రచారం ఎందుకు చేస్తోందని
ఆగ్రహించారు. ప్రతిపక్షం కేంద్రాన్ని కాకుండా మమ్మల్నే టార్గెట్
చేస్తోందని వాపోయారు. వీడియోలో ఎంపీలు మాట్లాడినవి నిజంగా అవి
వారి మాటలు కాకపోయినట్టైతే అక్కడే ఉన్న మీడియా వారు తీసిన వరిజనల్ ఫుటేజ్ ను ప్రదర్శనకు
ఉంచొచ్చు కదా!! అలా చేయలేదంటే అక్కడ జరిగింది వాస్తవమే నని క్లియర్
గా అర్థం అయిపోతోంది గదా! ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి
మందలింపు కూడా ఈ విషయమ్మీదనే అని తెలుస్తూనే ఉంది. టిడిపి నేతలు
ఎంతగా తిమ్మిని బమ్మిని చేయాలనుకున్నా ఆ కాకమ్మ కబుర్లు నమ్మేందుకు ఎపి ప్రజలు ఇప్పుడు
సిద్ధంగా లేరు.

వెంటాడే
చరిత్ర

వీడియో
ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం అనే చరిత్ర టిడిపిని వదులుతున్నట్టు లేదు. చంద్రబాబు ఓటుకు నోటు
కేసులో ఆడియో టేపుల్లో కంఠం ముఖ్యమంత్రిదే అని తేలింది. అయినా
సరే చంద్రబాబు బుకాయింపు మాటలతో ఆ విషయాన్ని దాటేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీలు సైతం తమ వాచాలతకు కప్పదాటు వాదనలేవో అడ్డు పెట్టుకుంటున్నారు.
వీరెన్ని ప్రయత్నాలు చేసినా అవ్వాల్సిన డామేజీ ఎప్పుడో అయిపోయింది.
నిన్నటి దాకా దొంగ దీక్షలు అనుకున్నవారు నేడు బరువు దీక్షలు అంటున్నారు.
ఇక కడపలో సిఎం రమేష్ నిరాహారదీక్ష కూడా డ్రామా అనే విషయం బయటపడింది.
పది రోజులుగా దీక్ష చేస్తున్నా, హై షుగర్ లెవెల్స్
ఉన్నా సిఎం రమేష్ బ్రహ్మాండంగా ఉండటంలో గల మతలబేమిటో వైద్యలు తేల్చి ఆ ఫలితాలను పరమ
రహస్యంగా ఉంచారు. తొలి రెండు మూడు రోజులూ దొంగ రిపోర్టులతో మేనేజ్
చేసినా, ఆ తర్వాత అలా కుదరదని ఆమరణ దీక్ష చేస్తున్న సిఎం రమేష్
హెల్త్ వివరాలను సీక్రెట్ గా మెయిన్ టెయిన్ చేస్తున్నారు. విభజన
హామీలు, ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ఎంపీలు చేసిన చౌకబారు నిరసనలు,
పసలేని పోరాటాల గురించి తెలుగు ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
నేడు కడప స్టీలు ఫ్యాక్టరీ విషయంలోనూ ఉత్తుత్తి దీక్షలతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్న
నాయకును చీదరించుకుంటున్నారు.

 

Back to Top