పార్టీకి పెద్ద‌మ్మ మ‌న విజ‌య‌మ్మ‌


* మ‌హానేత స్ఫూర్తితో ముందుకు
* వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌర‌వ అధ్య‌క్షురాలిగా సేవ‌లు
* నేడు విజ‌య‌మ్మగారి పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌త్యేక క‌థ‌నం

సువ‌ర్ణ పాల‌న అందించి ప్రజలచే దేవుడిలా కీర్తింప‌బ‌డిన వ్య‌క్తి దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.  ఆ మ‌హానేత ధ‌ర్మ‌ప‌త్నిగా , పోరాట యోధుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లిగా.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా వైయ‌స్ విజ‌య‌మ్మగారు ప్ర‌జా సేవ‌లో ముందుకు సాగుతూనే ఉన్నారు. నేడు విజ‌య‌మ్మగారి పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం. 

ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక ఓ మ‌హిళ ఉంటుంది. ఇది వైయ‌స్ విజ‌య‌మ్మ‌గారి విష‌యంలో అక్ష‌ర స‌త్యం. మ‌హానేత‌ జీవితంలో వైయ‌స్ విజయమ్మ ఎలాంటి ముఖ్య పాత్ర పోషించారో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డే ఓ సందర్భంలో చెబుతూ  “ న‌ల‌భై ఏళ్ల‌ ఈ నా వివాహ జీవితంలో క్షణం తీరిక లేకుండా నేను తిరుగుతుంటే తను విసుక్కున్న సంద‌ర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు`` అని చెప్పారు. 2003 లో వైయ‌స్ఆర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు విజయమ్మ స్థానంలో ఇంకొకరు ఉండుంటే ఆ మండుటెండలో ఆయన చేయబోతున్న పాదయాత్రకు అడ్డు చెప్పే వాళ్లేమో. కానీ విజ‌య‌మ్మగారు  వైయ‌స్ఆర్ మ‌న‌సు తెలుసుకున్న ఆవిడ కాబ‌ట్టి ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు వెళ్తున్న ఆ మ‌హానేత‌కు తిల‌కం దిద్ది పంపారు. 

త‌ల్లిగా పిల్ల‌ల‌కు ధైర్యం చెప్పారు
దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అకాల మ‌ర‌ణం త‌ర్వాత విజ‌య‌మ్మగారు కుంగిపోయారు. మ‌ళ్లీ కొద్ది రోజుల‌కే తేరుకుని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి, వైయ‌స్ ష‌ర్మిల‌కు ధైర్యం చెప్పారు. మ‌న‌ల్ని న‌మ్ముకుని ఉన్న ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాలి.. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌ని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజ‌కీయాలను భ‌రించ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వైయ‌స్ జ‌గ‌న్‌కు విజ‌య‌మ్మ‌గారు అండ‌గా నిలిచారు.

గౌర‌వ అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు
మొద‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన వైయ‌స్ విజ‌య‌మ్మ మ‌హానేత మ‌ర‌ణం త‌ర్వాత ప్ర‌త్యేక్ష రాజ‌కీయాల్లోకి రావాల్సి వ‌చ్చింది. నాటి నుంచి  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషిస్తున్నారు.  నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అలుపెర‌గ‌ని పోరాటం కూడా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, రైతులకు మద్దతు ధర కోసం, విద్యుత్ చార్జీల పెంపును నిర‌సిస్తూ ఎన్నో ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.  ప్ర‌స్తుతం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. నేడు విజ‌య‌మ్మ‌గారి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. 

Back to Top