సేవ మార్గంలో వైయ‌స్సార్సీపీ శ్రేణులు


ఘ‌నంగా డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి వేడుక‌లు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సంద‌ర్భంగా రాష్ట్రంలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌లుచోట్ల వైయ‌స్సార్ విగ్ర‌హాల‌కు పాలాభిషేకం చేసి, ర‌క్త‌దాన శిభిరాల‌తో పాటు, అన్నధాన కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. పేద‌ల‌కు బ‌ట్ట‌లు, పండ్ల‌ను పంపిణీ చేశారు. అనేక చోట్ల స్వ‌చ్ఛందంగా సేవ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.  హైద‌రాబాద్‌లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఘనంగా జరిగాయి. పేద‌ల‌కు చీర‌లు, దుస్తులు పంచి పెట్టారు. పార్టీ ఐటీ విభాగం ఆధ్వ‌ర్యంలో ర‌క్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ర‌క్త దానం చేశారు. 

రాయ‌చోటి బ‌స్టాండ్‌లో ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాలాభిషేకం  చేశారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లు ఆర్పించారు. మ‌ద్దికెర‌లో ఎంపీ బుట్టా రేణుక ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ జ‌యంతి వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. జ‌గిత్యాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైయ‌స్సార్‌సీపీ నేత జీవ‌న్ రెడ్డి రోగుల‌కు పండ్లు, పాలు పంపిణీ చేశారు. మంధ‌నిలో వైయ‌స్సార్ అభిమానులు మొక్క‌లను నాటారు. నిజామాబాద్ జిల్లా వైయ‌స్సార్‌సీపీ కార్యాల‌యంలో వైయ‌స్ చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి ఘ‌నంగా నివాళ్లు ఆర్పించారు. 

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 67 జ‌యంతి సంద‌ర్భంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు దేవ‌గుడిలో ఎమ్మెల్సీ నారాయ‌ణ వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళు ఆర్పించారు. గోల‌కొండ‌లో ఎమ్మెల్యే రాజ‌న్న దొర, వైయ‌స్సార్ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాల‌భిషేకం చేశారు. వైయ‌స్సార్‌సీపీ అమ‌లాపురం కోఆర్డినేట‌ర్ విశ్వ‌రూప్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. త‌ణుకు, న‌ర్సాపురం సింగాపురంలో వైయ‌స్సార్ చిత్రాప‌టానికి పూల‌మాల వేసి నివాళ్లు ఆర్పించారు. తాడేప‌ల్లిగూడెంలో తోట‌గోపి ఆధ్వ‌ర్యంలో జ‌యంతి వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. కొందూరు మండ‌లం చిన నందిగామ‌, విజ‌య‌వాడ 59వ డివిజ‌న్ కండ్రిక‌లో వైయస్సార్ అభిమానులు జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. వైయ‌స్సార్‌సీపీ జ‌యంతి వేడుక‌లో వంగ‌వీటి రాధా పాల్గొని నివాళ్లు ఆర్పించారు. 

కృష్ణా జిల్లా గుడివాడ‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గిద్ద‌లూరు స‌మ‌న్వ‌య క‌ర్త బ‌వీరెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ భైక్‌ర్యాలీ నిర్వ‌హించారు. వేదాయ‌పాలెం, ఆత్మ‌కూరు, సూళ్ళూరుపేట‌ల్లో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు మేక‌పాటి గౌతంరెడ్డి, కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, సంజీవ‌య్య‌ల ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలో వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే దేశాయితిప్పారెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్సార్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళ్లు ఆర్పించారు. అన్చుప‌ల్లి, అర‌గొండ‌, క‌దిరి, కుప్పంలో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుడు చంద్ర‌మౌళి ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో రాజేశ్వ‌రీ, రామ‌చంద్రారెడ్డిలు పాల్గొన్నారు. రాయ‌దుర్గంలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పాల‌భిషేకం నిర్వ‌హించారు. 

అనంత‌పురం ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీ‌నివాసులు, కోట‌గ‌ట్ల, బొబ్బిలిలో మాజీ మున్సిప‌ల్ చైర్‌పర్స‌న్ గోపాల‌రావు, పార్వ‌తీ పురంస‌మ‌న్వ‌య క‌ర్త ప్ర‌స‌న్న‌కుమార్‌, న‌ర్సీప‌ట్నంలో డి.ఉమాశంక‌ర్‌, అన‌కాప‌ల్లిలో జాన‌కిరామ్‌ల ఆధ్వ‌ర్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లు ఆర్పించారు. అమ‌లాపురం కోఆర్డినేట‌ర్ విశ్వరూప్ ఆధ్వ‌ర్యంలో జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఏలూరు గుంటూరు జ‌యంతి వేడుక‌లు జ‌రిగాయి. న‌ర్సారావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని రోగుల‌కు పాలు, పండ్లను పంపిణీ చేశారు. తెనాలిలో అన్నా బ‌త్తుని శివ‌కుమార్ స్కూల్ పిల్ల‌ల‌కు యూనిఫాంల‌ను పంపిణీ చేశారు. 

క‌నిగిరి, ఒంగోలు, వైయ‌స్సార్ జ‌యంతి వేడుక‌లు బుర్రా మ‌ధుసూధ‌న్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైయ‌స్ జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు మ‌హిళ‌లు చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఐటీవింగ్ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. ప‌ల‌మ‌నేరులో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌యంతి వేడుక‌లు జ‌రిగాయి. పిఠాపురంలో వైయ‌స్సార్‌సీపీ కోఆర్ఢినేట‌ర్ దొర‌బాబు వైఎస్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించిరు. కాకినాడ‌లో ద్వారంపూడి ముత్తాశ‌శిధ‌ర్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. 

తాజా వీడియోలు

Back to Top