భయపెట్టి లాక్కున్న భూములతో శంకుస్థాపనా..!

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం..!
మాయమాటలతో మోసం చేసిన చంద్రబాబు..!
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారథి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆయన తాపేదారుల స్వార్థం కోసం భ్రమరావతి నిర్మిస్తూ భ్రమలు కల్పిస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. రాజధాని ఏర్పాటు, రాజధాని ఏర్పాటులో ప్రభుత్వం అనుసరించిన విధానాలపై ....ప్రతపక్షాలు లేవనెత్తిన ఏఅంశాలపైనా సమాధానం ఇవ్వకుండా అదొక కుటుంబ వ్యవహారంలా చేస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణితోనే ఇదంతా జరుగుతుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. 

నిన్ను నమ్మి ఎందరో మోసపోయారు..!
రైతులందరూ తనపై నమ్మకంతో స్వచ్ఛందంగా భూములిచ్చారని చంద్రబాబు చెప్పడం బూటకమన్నారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30,144లు పెట్టి ...కేసులు పెడతామని భయపెట్టి, బెదిరించి భూములు లాక్కున్న సంగతి వాస్తవం కాదా అని నిలదీశారు. రైతులందరూ వాళ్ల సమస్యలు తెలియజేసేందుకు మీదగ్గరకు వస్తే మీరు బెదిరించలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.  చంద్రబాబు విధానాల మీద స్టడీ చేసిన ఫారెనర్స్ కూడా ....ఆయన రాజధాని పేరుతో  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న సంగతి చెప్పారని ఈసందర్భంగా గుర్తు చేశారు. 
నిన్నునమ్మి లక్షలాది మంది రైతులు, మహిళలు ఎలా మునిగిపోయారో అర్థం కావడం లేదా చంద్రబాబు అని పార్థసారథి ధ్వజమెత్తారు.

అవినీతికి వ్యతిరేకం..!
రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతంగా భూములు లాక్కునే విధానానికి తాము వ్యతిరేకమన్నారు. మీరు సంపద సృష్టించేది రాష్ట్రానికా, మీ బినామీదార్లకా అని చంద్రబాబుపై పార్థసారథి విరుచుకుపడ్డారు. శంకుస్థాపనకు రూ. 9 కోట్లే ఖర్చపెడుతున్నామని మంత్రులు ప్రకటించడాన్ని పార్థసారథి తప్పుబట్టారు. అదనంగా ఖర్చుపెట్టకుండా కార్యక్రమం చేయగలరా అని సవాల్ విసిరారు. శంకుస్థాపన ఖర్చు స్పాన్సర్స్ ఇచ్చారని చెబుతున్నారు, వాళ్లు ఏం ఆశించి ఖర్చు చేస్తున్నారో బయటపెట్టాలన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను కూలివేయమన్న చంద్రబాబు... తన గెస్ట్ హౌస్ కోసం రూ. 70 కోట్లతో రోడ్డు నిర్మించారని తూర్పారబట్టారు.
Back to Top