పరకాలా ఇంతటి పథకాలా?

పరకాల ప్రభాకర్ గారి మహోత్తరమైన పథకం గురించి మనం మట్లాడుకునే తీరాలి. ఎందుకంటే అటు స్వప్రయోజనం, ఇటు పార్టీ యోజనం రెంటినీ తీర్చేలా ఆయన పథకం, అదేనండీ రాజీనామా ప్లానింగ్ జరిగింది కదా! ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లాగా విమర్శకలు ఓ చెక్ చెట్టి, పన్లో పనిగా ప్రతిపక్ష నేతపైకి నెపం నెట్టి పబ్బం గడుపుకున్నారు. 
టిడిపి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ గారి గురించి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేసారాని అందుకే ఆయన మనస్తాపంతో తన పదవికి రాజీనామా చేసారని చెబుతోంది తెలుగుదేశం పార్టీ. ఇంతకీ ప్రతిపక్ష నేత పరకాల గురించి ఏమన్నారు? ప్రతిపక్షం లో ఉన్న నాయకుడు అన్నమాటకు ప్రభుత్వ సలహాదారు తన పదవిని వదిలేయడం ఏమిటి? ఎందుకంటే ఇది స్టేటజీలో ఒక భాగం. 

నిజాలు బైటపెట్టినందుకే

బీజేపితో పైకి తెగతెంపులు లోన పలకరింపులులాగే ఉందని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పటినుంచో చెబుతోంది. అందుకే చంద్రబాబు బిజేపిని ఏదో మాట అంటున్నా, మోదీతో యుద్ధం అంటూ ప్రచారం చేసుకుంటున్నా ఆ పార్టీనేతలు కిమ్మనడం లేదు. ఇదంతా ఇంటర్నల్ వ్యవహారం అని దీనిబట్టే తేలుతోంది. దీనికి ఊతమిచ్చే మరికొన్ని అంశాల గురించే ప్రతిపక్ష నేత తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రస్తావించారు. బీజేపీ నేతలకు టీడీపీలో, వారి బంధువులకు టీటీడిలో పదవులు ఇచ్చి, కేంద్రంతో అంతర్గత సంబంధాలు కొనసాగించుకుంటున్నారని విమర్శించారు వైఎస్ జగన్. బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ భర్త అయిన పరకాల టిడిపిలో కీలక బాధ్యతలు నిర్వహించడం, మహారాష్ట్రకు చెందిన మరో బీజేపీ నేత భార్యకు టిటిడిలో సభ్యురాలిగా పదవి ఇవ్వడం చూస్తే ఆ రెండు పార్టీలు తెగతెంపులు చేసుకున్నట్టు ఎవ్వరూ అనుకోరు. ఎన్డీఎలోంచి బైటకు వచ్చామని చెబుతూ ఆ పార్టీతో రహస్యంగా స్నేహం చేస్తున్నారనే విషయాన్ని బహిరంగంగా బయటపెట్టారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. అంతేతప్ప పరకాల ప్రభాకర్ ను వ్యక్తిగతంగానో, వృత్తిగతంగానో అన్నమాట ఒక్కటీ ఇందులో లేదు. ఇందులో ఆయన మనస్తాపం చెందేంత విషయం లేదన్నది ఎవ్వరికైనా తెలుస్తుంది. ప్రతిపక్ష నేత విమర్శలకు సమాధానం చెప్పుకోలేక పరకాలతో రాజీనామా చేయించి, వైఎస్ జగన్ విమర్శలవల్లే పదవిని వదులు కుంటున్నానని చెప్పించడం టిడిపి మార్కు రాజకీయానికి ఉదాహరణ. 

ఎంతటి నిబద్ధతో

ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసికట్టుగా తమ పదవులకు రాజీనామాలు చేసారు. ఏడాది పదవీకాలం ఉన్నా తృణప్రాయంగా ఆ పదవులను వదులుకున్నారు. టిడిపి ఎంపిలు కనీసం రాజీనామా పేరు ఎత్తడానికి కూడా సాహసించలేకపోయారు. కానీ రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి హోదా కోసం ఉద్యమం చేస్తున్న ప్రతిపక్ష నాయకుల నిజాయితీపైనే నిందలు వేసారు తెలుగు తమ్ముళ్లు. ఉప ఎన్నికలు రావు కనుకనే వారు రాజీనామాలు చేసి, ఆమెదింప చేసుకున్నారు అంటూ విచిత్రమైన వాదనలు తెరపైకి తెచ్చారు. ఏడాది పదవీకాలం వదులుకుని, సామాన్యులుగా బయటకు వచ్చిన వారిపై చౌకబారు ఆరోపణలు చేసిన తెలుగు తమ్ముళ్లు, పరకాల కేవలం 15 రోజుల పదవీ కాలం ఉండగా చేసిన రాజీనామా , వారి దృష్టిలో అవకాశ వాదం కాదు. 

ఇదీ టీడీపీ వ్యూహం

బీజేపీతో మాకు సంబంధాలు లేవు అని గట్టిగా చెప్పుకునే అవకాశం ఉండటం లేదు టిడిపికి. ఎప్పుడు నోటితో ఆ మాట చెప్పినా పరిస్థితులు అది నిజం కాదనే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. నీతి ఆయోగ్ లో చంద్రబాబు మోదీల తీరు అందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత లేవనెత్తిన పాయింట్ పై సమాధానం లేకే 15 రోజుల గడువున్న పదవి నుంచి పరకాలను తప్పించారు. దీనికి ప్రతిపక్ష నేతను కారణం చేసారు. 

చంద్రబాబు ఇలాంటి దొడ్డదారి వ్యూహాలు ఎన్ని పన్నినా జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. టిడిపి బీజేపీ మైత్రి ఏ స్థాయిలో ఉందో జాతీయ స్థాయిలో అర్థం అయ్యింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కు అంటూ దొంగ ప్రచారం చేయాలనుకున్నా అది కలిసి రాలేదు. ఎవరు ఎవరికి స్నేహ హస్తం చాచారో ప్రజలు లైవ్ లో చూడనే చూసారు. టిడిపి అవసరం కోసం పరకాల పథకం అనే అంకం ఇలా పూర్తైంది. 

Back to Top