పాలన లేదు... లాలన లేదు.. అవినీతి..అబ‌ద్ధాలు తప్ప

– చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా అవినీతిమయం
– హత్యలు, దోపిడీలు, అరాచకాలు అనంతం 
– దోచుకోవడం దాచుకోవడంపైనే బాబు ఆలోచన 
– దిగజారిపోతున్న సామాన్యుడి బతుకులు 


నాలుగేళ్లు ఆవిరైపోయాయి. అప్పుడే పుట్టిన నవ్యాంధ్ర నిర్మాణంలో అతిముఖ్యమైన కాలం చరిత్రకెక్కడానికి పనికిరాని చిత్తు కాగితాల్లో కలిసిపోయింది. ఈ 48 నెలలు చంద్రబాబు అవినీతికి పెట్టుబడిగా మారిపోయాయి. అనుభవజ్ఞుడి మీద పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. రూ. 150 ఉన్న హెరిటేజ్‌ షేర్‌ ధర రూ. 900లకు పెంచుకోవడంలోనే చంద్రబాబు అనుభవం ఉపయోగపడింది. నోట్ల రద్దు జనాన్ని రోడ్ల మీద ఎండల్లో నిలబెడితే.. చంద్రబాబును ప్రత్యేక విమానాల్లో దుబాయ్, సింగపూర్‌ ప్రయాణాలు చేయించింది. ఉగ్గుపాలు తాగే శైశవంలో ఉన్న నవ్యాంధ్రకు చంద్రబాబు పాలన ఆదిలోనే హంసపాదే అయ్యింది. ఐదున్నర కోట్ల ప్రజల కలలన్నీ కన్నీరయ్యాయి.

రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, స్వచ్ఛమైన తాగునీరు వంటి హామీల అమలు తీరు చూసి చంద్రబాబుది మాటల ప్రభుత్వం అనే నిర్ణయానికి రాక తప్పడం లేదు. అమరావతిని సింగపూర్‌ చేస్తా, అమెరికా, మలేసియా, దుబాయ్‌ చేస్తాం.., ఆఖరికి ఇస్తాంబుల్, కొలొంబో చేస్తామని చెబుతున్నబాబు ప్రకటనలు చూస్తే ఆయనకు క్లారిటీ లేదని తెలుస్తుంది. అమరావతిని అలాగే ఉండనిస్తే చాలనిపిస్తుంది. స్విస్‌ ఛాలెంజ్‌తో రైతుల భూములు కొల్లగొట్టే ప్రయత్నమే తప్ప చంద్రబాబు రాష్ట్ర నిర్మాణంలో చిత్తశుద్ది లేదనేది ఒప్పుకోక తప్పని వాస్తవం.


పోలవరం నిర్మాణం కాలేదు.. రాజధాని నిర్మాణం జరగలేదు.. ఉద్దానాన్ని ఉద్దరించలేదు.., పదిశాతం పెండింగ్‌లో ఉన్న ముచ్చుమ్రరి, పైడిపాలెం ప్రాజెక్టులను పూర్తి చేసి డబ్బాలు కొట్టుకోవడమే తప్ప మిగతా ప్రాజెక్టులు వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ఉద్దరించే వారు లేక కన్నీరు పెట్టుకుకుంటున్నాయి. ఏరులన్నీ ఎడారులవుతున్నాయి. నదుల్లో ఉండాల్సిన ఇసుక ట్రాక్టర్లు, లారీల్లో రోడ్డెక్కుతోంది. గుళ్లూ గోపురాలు, చర్చిలు మసీదులు కూల్చివేతలకు గురై దేవుళ్లు నిలువ నీడ లేని వాళ్లయ్యారు. రైతుల ఆత్మహత్యలతో దుక్కిదున్నే వాడు లేక హేమం పండిన నేల బంజరు భూమిగా మారిపోయింది. 

   ఆడవాళ్లకు రక్షణ లేదు, ఉద్యోగులకు భద్రత లేదు.., నిరుద్యోగులకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు.. రైతులకు ఆశ లేదు.. వ్యాపారులకు భరోసా లేదు.. విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ అమలు కాలేదు.. రోగమొస్తే బతుకామన్న నమ్మకం లేదు.. హత్యలు చేసినోళ్లకు శిక్షలు పడటం లేదు.. విచారణ జరగడం లేదు. సామాన్యుడి ముఖంలో సంతోషం లేదు. ఏమీ లేని ప్రభుత్వాన్ని చంద్రబాబుది. బాబు కారణంగానే 30 మంది అమాయకులు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో చనిపోతే విచారణ కమిటీ ఏం తేల్చిందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు.. కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో 23 మృతికి కారణమైన వారికి శిక్ష పడనేలేదు. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన లారీ ప్రమాదానికి కారణమైన టీడీపీ నాయకులకు ముఖ్యమంత్రి అండగా ఉంటారు. జేసీ బస్సు ప్రమాదంలో 9 మంది చనిపోయినా డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలన్న కనీసం జ్ఞానం లేదు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వారి లెక్కేలేదు... జన్మభూమి కమిటీలు చేస్తున్న వేధింపులకు అంతంలేదు. 
మొత్తనానికి ఈ నాలుగేళ్లలో దోచుకోవడం దాచుకోవడం తప్ప సామాన్యులకు చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. 
 


 
Back to Top