ప‌చ్చ మీడియా పైత్యం..!

తొక్కిస‌లాట‌లో 30 మంది అమాయ‌కులు బ‌లై పోవ‌టానికి కార‌ణ‌మైన
ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడును కాపాడేందుకు ప‌చ్చ మీడియా చేయ‌ని
ప్ర‌య‌త్నం లేదు. త‌ప్పంతా చంద్ర‌బాబుదే అని లోక‌మంతా చెబుతున్నా, దానికి
మ‌సి పూసి మారేడు కాయ చేయ‌టానికి కొత్త వాద‌న్ని తెర మీద‌కు తెచ్చారు. 
ఒక
ప్ర‌వ‌చ‌న పండితుడు మొద‌టి రోజు పుష్క‌ర స్నానం చేస్తే మంచిద‌ని
చెప్పార‌ని, అందుకే ప్ర‌జ‌లు ల‌క్ష‌ల సంఖ్య‌లో అక్క‌డ‌కు వ‌చ్చేశార‌న్న
వాద‌న్ని వినిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పుష్క‌రాలకు విప‌రీత
ప్ర‌చారం చేయ‌టం ఇదే మొద‌టిసారి కానీ, ప్ర‌తీ ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి
గోదావ‌రికి పుష్క‌రాలు రావ‌టం, స్నానాలు చేయ‌టం జ‌రుగుతూనే ఉన్నాయి.
అందునా పుష్క‌రాల మొద‌టి రోజున ఎక్కువ మంది స్నానం చేయ‌టం జ‌రుగుతూనే
ఉంటుంది. అంతే గాకుండా పుష్క‌రాల‌కు రాజ‌మండ్రి కే వెళ్లాల‌ని, అక్క‌డే
అఖండ గోదావరి ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల‌కు ఉంది. అందుకే ప్ర‌జ‌లు పెద్ద
ఎత్తున మొద‌టి రోజున  అక్క‌డ‌కు చేరుకొన్నారు.
అస‌లు విష‌యం
ఏమిటంటే చంద్ర‌బాబు తీయించుకొంటున్న షార్ట్ ఫిల్మ్ లో బాగా షాట్స్ రావాలంటే
దీనికి ల‌క్ష‌ల మంది జ‌నం ఒక్క దారిలో వ‌స్తున్న‌ట్లుగా చూపించాల‌ని
తాప‌త్ర‌య ప‌డ్డారు. చంద్ర‌బాబు మీడియా పిచ్చితో ఒకే గేటు నుంచి వేలాది
మందిని  ఒక్క‌సారిగా వ‌ద‌ల‌టంతో అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. దీని
గురించి ఒక్క మాట మాట్లాడ‌కుండా అంతా ప్ర‌వ‌చ‌న పండితుల‌దే త‌ప్పు
అన్న‌ట్లుగా ప‌చ్చ మీడియా చ‌ర్చా గోష్టులు, వ్యాసాల ప‌రంప‌రను
కొన‌సాగిస్తోంది.
Back to Top