ఒంటిగ నిలబడి పోరాటపు ఒరవడి


వైఎస్ జగన్ నూతన రాజకీయ ఒరవడి సృష్టిస్తున్నయువనేత. వైఎస్ జగన్ ఆదర్శ రాజకీయ నిర్మాత. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. తను నమ్మిన సిద్ధాంతాన్ని నూటికి నూరుపాళ్లూ నమ్మి, ఆచరిస్తున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్. విలువలున్నరాజకీయం చేయలబ్బా అంటూ ఓ యువకుడు పిలుపునిస్తుంటే అధికారం, అవినీతి, బంధుప్రీతి, అధర్మాలనే పొరలు మందమైన నేతలు స్పందించలేకపోతున్నారు. పర్వాలేదు..ఎలాంటి రాజకీయాలు కావాలో, ఎలాంటి నేతలు భవిష్యత్తులో అవసరమో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అందుకోసం నిరంతరం ఒంటరిగా పోరాడుతున్నారు వైఎస్ జగన్. ఓ జెండా తన మదినిండా ధైర్యాన్ని, దమ్ముని నిలుపుకుని ఎగురుతోందంటే అందుకు కారణం గాలి వాటు కానే కాదు, అది కట్టి ఉన్న కర్రకున్న ధృఢత్వం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాకు వెన్నుదన్నైన ఒకే ఒక్కడు  వైఎస్ జగన్. 
పోరాటంలో పుట్టి
అణిచివేతకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజానాయకుడిగా వైఎస్ జగన్ ఒకేసారి పుట్టారు. ప్రతికూలతలు, ప్రశ్నలు, కుట్రలు, అక్రమ కేసులు అన్నీ సమస్యల సుడిగుండమే.  ఒకవైపు పార్టీ, మరోవైపు వైఎస్ జగన్ వాటిని తట్టుకుని, ఎదుర్కొని నిబ్బరంగా నిలబడ్డారు. అందుకు మరో రాజకీయ పార్టీని అర్థించలేదు. మరే పార్టీతోనూ పొత్తుకు వెళ్లలేదు. చంద్రబాబులాగా మిత్రుడి శత్రువు మిత్రుడు ఫార్మలాను అనుసరించలేదు. చంద్రబాబులా అవకాశవాదిలా మారలేదు.  కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా ఒంటరిపోరునే సాగించారు. నేటికీ అదే మాట. అదేబాట. 
హోదా అయినా, ఎన్నికలైనా...
నాలుగేళ్లగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎడతెగని పోరాటం చేస్తోంది. విభజన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని అడుగడుగునా గర్హించింది. చంద్రబాబు కేంద్రంతో వ్యవహరించే తీరును దుయ్యబట్టింది. మిత్రధర్మంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని హెచ్చరించింది. కానీ చంద్రబాబు తన స్వార్థ రాజకీయ అవసారలు తప్ప ఏపీ ప్రయోజనాలకు ఏనాడూ కట్టుబడలేదు. చంద్రబాబు సర్కార్ చేతగాని తనాన్ని ప్రజల ముందుంచడంతో ఊరుకోలేదు వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజావసరాలకై పనిచేసే పార్టీగా హోదా కోసం ఆది నుంచీ యుద్ధం చేస్తూనే ఉంది. హోదా కంటే ప్యాకేజీ గొప్పదని రాష్ట్ర సర్కార్ మోసం చేయబోయినప్పుడు, ఏటా బడ్జెట్, నిధులు, కేటాయింపుల విషయాల్లో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నప్పుడు, రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలపై స్పందించన్పుడూ, ఇలా ప్రతిసందర్భంలోనూ ప్రశ్నించాల్సిన తన బాధ్యతను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్మరించలేదు. ప్రభుత్వాన్నీ, చంద్రబాబును నిలదీస్తూనే ఉంది. దున్నపోతుపై వర్షంలా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం శూన్యమని అర్థమైనప్పుడు నేరుగా కేంద్రంతోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకు ప్రజాబలాన్నే ఆయుధంగా చేసుకుంది. హోదా అవసరాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లింది. ప్యాకేజీ బూటకం గురించి అర్థమయ్యేలా వివరించింది. తగినంత బలం లేకున్నా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో ప్రవర్తిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పింది. అవిశ్వాసంతో మోదీ సర్కారును ఢీ కొట్టింది. దేశ వ్యాప్తంగా ఏపీ విభజన హామీలపై చర్చలేవనెత్తేలా చేయగలిగింది. ఇదంతా మరేపార్టీ అండదండా లేకుండా, మరే రాజకీయ శక్తుల సపోర్టు లేకుండా చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మహా మహా జాతీయ పార్టీలే ఖంగు తినేలా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది. ఎంపీల రాజీనామాలు, దేశ రాజధానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్షలకు పూనుకున్న స్థైర్యాన్ని చూసి దేశం యావత్తూ నివ్వెర పోయింది. ఒంటిగా ఇంత సాహసం చేసిన ఏకైక రాజకీయ పార్టీగా మన్ననలు పొందింది.
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇంత వరకూ పొత్తు లేకుండా ఒక్కసారి కూడా ఎన్నికల్లో పాల్గొన్నది లేదు. చివరకి నంద్యాల ఉప ఎన్నికల్లో అయినా, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకునిగానీ బరిలోకి దిగలేదు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ దమ్మున నాయకుడి నీడలో సాగుతున్న పార్టీ. ఇంత వరకూ ఏ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నది లేదు. సిద్ధాంతపరంగా సారుప్యత ఉన్న వామపక్షాలతో సైతం ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల పోరాటాల కోసం సంఘీభావం తెలిపడమే తప్ప ఏనాడు పొత్తు పెట్టుకోలేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే ఎన్నికల్లో సైతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకి మద్దతు ఇస్తామే కానీ, పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. 
బాబుదంతా పొత్తుల చరిత్రే
అనుక్షణం అభద్రతాభావంతో, అవసరానికి పనికొచ్చే పార్టీలతో రాసుకుపూసుకు తిరుగుతూ పబ్బం గడుపుకోవడమే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒంటరిగా ఎదొర్కొని ప్రజల వాడిగా ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు నిలబడటం వైఎస్ జగన్ వ్యక్తిత్వం. ఉన్నతమైన ఆ వ్యక్తిత్వమే రాజకీయ సమూహంలో వైఎస్ జగన్ ను  ప్రత్యేకంగా నిలబెడుతోంది. 






 
 
Back to Top