ఢిల్లీ పోరాటానికి ఏడాది

() ప్రత్యేక హోదా కోసం
ఢిల్లీ వీధుల్లో నినదించిన వైయస్ జగన్

() ప్రజల తరపున ఉద్యమించిన
వైయస్సార్సీపీ

() ఇప్పటికీ అదే తరహాలో
పోరు సాగిస్తున్న పార్టీ

() రెండు రోజులుగా హస్తిన
పెద్దల్ని కలిసి వినతిపత్రం అందించిన జననేత


న్యూఢిల్లీ)) ఆగస్టు 10. గత
ఏడాది సరిగ్గా ఇదే రోజున జన నేత వైయస్ జగన్ న్యూఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా మీద
దీక్ష చేశారు. ఢిల్లీ పెద్దలకు ప్రజల ఘోష తెలిసే విధంగా ఉద్యమించారు. ఏపీ నుంచి తరలి
వెళ్లిన వేలాదిమందితో కలిసి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేపట్టారు.


ఉద్యమానికి నేపథ్యం

ఏపీ విభజన సమయంలో
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం పార్లమెంటు
వేదికగా హామీ ఇచ్చాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే విషయాన్ని ఊదర గొట్టారు. పదేళ్లు
కాదు పదిహేనేళ్ల పాటు హోదా ఇప్పిస్తామని పదే పదే చెప్పారు. కానీ అధికారంలోకి
వచ్చాక చంద్రబాబు మనస్సు నిండా ప్యాకేజీలు నిండిపోయాయి. దీంతో హోదా విషయం
పట్టించుకోకుండా ప్యాకేజీలు ఇస్తే చాలన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో కేంద్రం కూడా
ఈ విషయాన్ని లైట్ గా తీసుకొంది. కానీ బాధ్యత గల ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ దీని
మీద ఉద్యమ బాట పట్టింది. విభజన ప్రక్రియ పూర్తయి, ఎన్నికలైన వెంటనే ఢిల్లీ వచ్చి
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పెద్దలందరినీ కలిసి ప్రత్యేక హోదా ఇప్పించాలని వినతి
పత్రాలు అందించారు. తర్వాత నుంచి దశ దశలుగా ఉద్యమిస్తూ వచ్చారు. కానీ కేంద్రం
నుంచి సరైన స్పందన లేకపోవటం, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరు గార్చటంతో
ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.

ఆరోజు ఏమైందంటే

ఆగస్టు 10వ తేదీన ఢిల్లీ
వేదికగా మహా ధర్నా చేపట్టాలని వైయస్ జగన్ నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుల పిలుపు
మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక
రైళ్లలో ఢిల్లీకి బయలు దేరారు. ముఖ్య నాయకులు నేరుగా హస్తినకు చేరుకొన్నారు. వేల
సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులతో ఢిల్లీ వీధులు నిండిపోయాయి. ప్రత్యేక హోదా ఏపీ
హక్కు అని నినాదాలు మిన్నంటాయి. అదే సమయంలో తిరుపతిలో హోదా కోసం ఆత్మాహత్యాయత్నం
చేసిన మునికోటి మరణించాడని తెలియటంతో మొదటగా ఆయనకు నివాళులు అర్పించారు. దివంగత
మహానేత వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంతర్
మంతర్ దగ్గర రోజంతా వైయస్ జగన్ దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీల
నాయకులు వచ్చి సంఘీభావం  తెలిపారు.  అనంతరం పార్టీ నాయకులతో వైయస్ జగన్ పార్లమెంటు
వైపునకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. దీన్ని అడ్డుకొన్న పోలీసులు వైయస్ జగన్ సహా
పార్టీ నాయకుల్ని అరెస్టు చేశారు.

అదే స్ఫూర్తితో ఉద్యమం
తీవ్రతరం

రాష్ట్రం విడిపోయి
రెండున్నరేళ్లు అవుతున్నా చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా మీద స్పష్టంగా మాట్లాడటం
లేదు. ఢిల్లీ వెళ్లినప్పుడు గట్టిగా పట్టు పట్టడం లేదు. కానీ ప్రతిపక్ష నేత వైయస్
జగన్ మాత్రం స్పష్టంగా ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేపట్టారు. అంతే గాకుండా ఏపీ
వ్యాప్తంగా బంద్ చేసి, ఆందోళనలు చేసి ప్రజల గొంతుక వినిపించారు. తిరిగి రెండు
రోజులుగా ఢిల్లీలో మకాం వేసి పోరాటం చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ని  కలిసి ప్రత్యేక హోదా ఇప్పించాలని వినతి
పత్రం అందించారు. జాతీయ పార్టీ నాయకుల్ని కలిసి హోదా కోసం సంఘీభావం తెలపాలని
విన్నవించారు. 

Back to Top