వైఎస్ జగన్ చెప్పినదే అయింది

() ప్రివిలేజ్ కమిటీ వ్యవహారం ఏకపక్ష ధోరణి

() పూర్తిగా టీడీపీ పక్షంతో నిండిపోయిన కమిటీ

() కమిటీ వ్యవహార శైలి ని సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్

హైదరాబాద్) శాసనసభ హక్కుల కమిటీ సమావేశం ఏకపక్షంగానే సాగింది. కేవలం ప్రతిపక్ష
సభ్యుల్ని పిలిపించి నింద మోపేందుకే పరిమితం అయింది. పూర్తిగా టీడీపీ సభ్యులతో
నిండిపోయిన కమిటీ సమావేశం పక్కా స్క్రిప్ట్ ప్రకారం  పూర్తయింది అనిపించింది.

రోజా మీద ముద్ర వేసేందుకు ఆరాటం

      శాసనసభ లో అకస్మాత్తుగా హక్కుల
కమిటీ సమావేశం తెర మీదకు వచ్చింది. ఒక వైపు ఎమ్మెల్యే రోజా మీద ఏడాది పాటు
సస్పెన్షన్ అంశం మీద హైకోర్టులో విచారణ నడుస్తోంది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు
ఉన్నప్పటికీ సభలోకి రానీయకుండా పచ్చ ప్రభుత్వం అడ్డుకొంది. అందుచేత హడావుడిగా ఆమె
మీద నింద మోపేందుకు కమిటీ ద్వారా రంగం సిద్ధం చేశారన్న మాట వినిపిస్తోంది.

అధికార పక్షం అంతా వెరీ గుడ్    

ఊహించనట్లుగానే కేవలం ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని మాత్రమే విచారణకు
పిలిపించారు. పాతేస్తా..ఖబడ్దార్..కొవ్వు పట్టిందా..అసలు మగాడివేనా..వంటి తిట్లు
తిట్టిన టీడీపీ నాయకులు ఎవరినీ విచారణకు పిలవలేదు. వాళ్లంతా వెరీ గుడ్ అని
సర్టిఫికేట్ ఇచ్చేసుకొని ప్రతిపక్ష సభ్యుల్ని విచారణ కు పిలిచారు. ఒక్కరంటే ఒక్క
టీడీపీ సభ్యుడ్ని విచారించకుండా తంతు నడిపించేశారు.

ముందే చెప్పిన జన నేత వైఎస్ జగన్

      ప్రివిలేజ్ కమిటీ పని తీరుని
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముందే చెప్పారు. ఛైర్మన్ సహా అధికశాతం మంది టీడీపీ
సభ్యులున్న కమిటీలో న్యాయం ఎక్కడ దొరకుతుంది అని సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు
సభలో రక రకాల తిట్లు తిట్టిన నాయకులు ఎవరినీ కమిటీ ముందుకు పిలవరు అని కూడా తేల్చి
చెప్పారు. పైగా ముఖ్యమంత్రే స్వయంగా దూషించినా ఈ కమిటీలకు పట్టదా అని స్పష్టంగా
నిలదీశారు. చివరకు ఆయన చెప్పినట్లుగానే టీడీపీ సభ్యుల్ని ఏమీ టచ్ చేయకుండానే
హక్కుల కమిటీ సమావేశాన్ని ముగించేసింది.  

 

Back to Top