వెండితెరకెక్కిన ఉపాధి హామీ నిధులు


ప్రభుత్వ పథకాలకు చెందిన ప్రతి ఒక్క రూపాయి లబ్దిదారులకు చేరాలి అనే గొప్ప లక్ష్యంతో పనిచేశారు దివంగత నేత డా.వైయస్ రాజశేఖరరెడ్డి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. సహజవనరుల్ని దోచుకోవడంతో పాటు, ప్రజాధనాన్ని దుబారా చేయడంతో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది చంద్రబాబు సర్కారు. అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టి తెలుగునేల పరువును దేశ పటంపై దిగజార్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ఇవేవీ చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా పల్లెల్లో నిరుపేద ప్రజల జీవనభృతికోసం ఉపయోగించాల్సిన ఉపాధి హామీ నిధుల్ని కూడా అడ్డదారిలో కొల్లగొట్టేందుకు తెగించేశాడు నిప్పు బాబు. ప్రజల ఉపాధికి హామీ లేదు సరే... కేంద్రం కేటాయించిన ఆ నిధుల్నితమ పార్టీ ప్రచారంకోసం వాడుకోవడానికి సిద్ధమైపోయారు అయ్యా కొడుకులు. ఈ నాలుగున్నరేళ్లలో తాము చేసిన అవినీతిని, అక్రమాలను, అన్యాయాలను కప్పి పుచ్చుకుంటూ... ప్రజల్ని మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి లఘు చిత్రాలను సిద్ధం చేశారట. రాష్ట్రంకోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా మళ్లీ బాబుని ఆకాశానికెత్తే పనిలో పూర్తిగా బిజీ అయిపోయిన పప్పుగారు దీనికి సూత్రధారిగా ఉన్నారట. ఈ చిన్న చిన్న చిత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో వేసి జనానికి అబద్ధాల బాకా ఊదాలని నిర్ణయించారట. ఎంత దారుణం. ప్రజలసొమ్మును అడ్డంగా కమీషన్ల రూపంలో దోచేస్తున్నారు సరే. ఇప్పుడు ఏకంగా తమ దిక్కుమాలిన అబద్ధపు ప్రచారానికి కూడా పల్లెప్రజల కడుపునింపే ఉపాధి హామీ నిధులు స్వాహా చేస్తున్నారంటే... అవినీతిలో వీళ్లెంత ఆరితేరి సిగ్గువిడిచేశారో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ఎలాగైనా ప్రజల్ని వంచించి ఐదేళ్లపాటు దోపిడీకి అధికారఉపాధి సంపాదించుకోవాలనే తాపత్రయమే ఇదంతా. ఇప్పటివరకు పేపర్లు, టివీల్లో ఆ నోటా ఈనోటా ఈ ప్రభుత్వం అవినీతి గురించి విని, చూసిన ప్రజలు ఇప్పుడు ఏకంగా వెండితెరపైనే చూసి ఛీదరించుకోవడం ఖాయం.


Back to Top