క‌సి తీర్చుకొంటున్న ప్ర‌భుత్వం..!

భూ స‌మీక‌ర‌ణ నోటిఫికేష‌న్ విడుద‌ల‌
రైతుల నుంచి భూములు లాక్కోవ‌ట‌మే ల‌క్ష్యం
పంతం ప‌డుతున్న ప‌చ్చ చొక్కాలు

విజ‌య‌వాడ‌: రాజ‌దాని పేరుతో ప‌చ్చ‌నిపంట పొలాలు లాక్కొని సింగ‌పూర్‌. ప్రైవేటు సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌న్న ల‌క్ష్యంతో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ప‌రితపిస్తోంది. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా ఆగ‌కుండా భూ స‌మీక‌ర‌ణ కు ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది. ఇక చంద్ర‌బాబు రాక్ష‌స రూపం మ‌రోసారి బ‌య‌ట ప‌డింది.

భూ స‌మీక‌ర‌ణ నోటిఫికేష‌న్ విడుద‌ల‌
రాజ‌ధాని ప్రాంతంలో బ‌లవంతంగా భూముల్ని లాక్కొనేందుకు ప్ర‌భుత్వం మ‌రిన్ని కుట్ర‌ల‌కు తెర‌దీసింది. 10 గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణ కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ కాంతీలాల్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. రేపు మ‌రో 19 గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణ నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. భూ సేక‌ర‌ణ కు అంగీక‌రించక పోతే, భూ  స‌మీక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌భుత్వం కొంత కాలంగా బెదిరిస్తూ వ‌స్తోంది. అన్న‌ట్లుగానే భూముల్ని లాక్కొనేందుకు ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

రైతుల నుంచి భూములు లాక్కోవ‌ట‌మే ల‌క్ష్యం
రాజ‌ధాని కావాలంటే 2,3 వంద‌ల ఎక‌రాల్లో క‌ట్టుకోవ‌చ్చ‌ని అంతా చెబుతున్నారు. మ‌రీ కావాలంటే వెయ్యి ఎక‌రాల‌తో అన్నీ నిర్మించుకోవ‌చ్చు. సాక్షాత్తూ సింగ‌పూర్‌మాస్ట‌ర్ ప్లాన్ లోనే 2,300 ఎక‌రాలు స‌రిపోతుంద‌ని తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే 33,400 ఎక‌రాల భూమిని స‌మీక‌రించిన‌ట్లు ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ పచ్చ చొక్కాల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మ‌రింత భూమిని లాక్కొంటున్నారు.

క‌సి తీర్చుకోవ‌ట‌మే ల‌క్ష్య‌మా..!
భూ సేక‌ర‌ణ ను వ్య‌తిరేకిస్తున్న వారి మీద క‌క్ష సాధించ‌ట‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వం క‌ద‌లుతోంది. సుమారు 1,600 మంది అభ్యంత‌ర ప‌త్రాలు ఇచ్చారు. వీరి నుంచి భూముల్ని లాక్కోవ‌టమే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. ఒక వైపున ఎంత మేర‌కు భూములు కావాల‌నే దానిపై స్ప‌ష్ట‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ విడ‌త‌ల వారీగా నోటిపికేష‌న్లు వేస్తూ వెళ్ల‌బోతున్నారు. అస‌లు దీనికి ఆస్కారం క‌ల్పించే చ‌ట్టం కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిక పోయినా స‌ర్కారు ముందుకే వెళ్ల బోతోంది. 

తాజా ఫోటోలు

Back to Top