నిప్పు..కేసుల తుప్పు

  • ఏపీ సీఎం చంద్రబాబుపై 18 కేసులు
  • ఏ ఒక్క కేసుపై కూడా పూర్తి కాని విచారణ
  • స్టేలతో తప్పిచ్చుకుంటున్న బాబు
18 కేసులుండి కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం...ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కోకుండా స్టేలతో తప్పించుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లింది. అలాంటి మచ్చ ఉన్న చంద్రబాబు మాట్లాడితే నేను నిప్పు...నేను నిప్పు అనడం విడ్డూరం. వారంలో ఒక్కసారైనా నేను నిప్పు అననిదే బాబు నిద్రపట్టని పరిస్థితి. బాబు తప్పులు చేశారు గనుకే దాన్ని కప్పిపుచ్చేందుకు నిప్పు అనే పదం వాడుతుంటారని విమర్శలు ఉన్నాయి.  ఎవరైనా తనపై విమర్శలు చేస్తే చాలు ‘నిప్పులా బతికాను’ అంటుంటారు.  ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినా,  కాల్‌మనీ –సెక్స్‌ రాకెట్‌, అమరావతిలో భూ కుంభకోణం, చినబాబు లోకేష్ పై అవినీతి ఆరోపణలు వచ్చినా.. నేను నిప్పు అనడం బాబుకే సాధ్యమైంది.

బాబుపై 18 కేసులు నమోదు అయినా ఇంతవరకు ఏ ఒక్కదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగింది లేదు.   దేశంలో ఎక్కడైనా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిపై అవినీతి కేసులు పెట్టడం, జైళ్లకు వెళ్లి రావడం చూస్తూనే ఉంటాం.  ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎం లాంటి ఉన్నత పదవుల్లో పనిచేసి సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలపై ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఐతే, కేసుల్లో కొన్ని కుట్రపూరితంగా, రాజకీయ కారణాలతో పెట్టేవి ఉంటాయి.. కొన్ని నిజమైనవీ ఉంటాయి. సాధారణంగా తమపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవిగా న్యాయస్థానాల్లో నిరూపించి సచ్ఛీలురిగా బయటపడాలని కోరుకుంటారు. 

బాబు రూటే సెపరేటు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మాత్రం పూర్తి భిన్నం. తాను నిప్పునని తనకు తానే తీర్పిచ్చుకుంటాడు. నిజాయితీకి మారుపేరంటాడు.. కోర్టు కేసులంటే భయమే లేదంటాడు. కానీ, వాటిని నిరూపించుకోవడానికి మాత్రం జంకుతారు. విచారణ నిలిపివేయాలని కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటాడు. ఏ తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ, బాబు తప్పు చేశారు గనుకే స్టేలతో కాలం వెళ్లదీస్తుంటారు.  ఒకటా రెండా ఇప్పటికి అక్షరాలా 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని రికార్డు సృష్టించాడు. దేశంలో మరే నాయకుడూ ఇన్ని కేసుల్లో విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకున్నది లేదు. అయితే ఈ కేసులన్నీ బాబు గారిమీద రాజకీయకుట్రలతో పెట్టినవి ఏమాత్రం కాదు. పక్కా ఆధారాలతో పెట్టినవే. అలా అని కేసులు దాఖలు చేసిన వారైనా మామూల్లోళ్లూ కాదు. వారూ ప్రముఖులే. అయినా ఇన్ని కేసుల్లో పక్కా ఆధారాలుండీ స్టేలు తెచ్చుకోవడంమంటే మామూలు విషయం కాదు. ఇదంతా బాబు గారికే తెలిసిన చిదంబర రహస్యం.. 

బాబు స్టేలు తెచ్చుకున్న 17 కేసులు 

 1). చంద్రబాబుపై 1998 నుంచి కేసులు పర్వం మొదలైంది. చంద్రబాబు అక్రమంగా ఆస్తులు సంపాదించారని, దీనిపై ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతించలేదంటూ 1998లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మొదట కేసు పెట్టారు. అయితే, గవర్నర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించలేమంటూ సుప్రీంకోర్టు 2000లో ఈ కేసును కొట్టేసింది.

2). చంద్రబాబు కుటుంబ ఆస్తులపైనా, అక్రమాస్తులపైనా, ఆస్తుల బదిలీలపైనా సీబీఐ విచారణ కోరుతూ, 1999లో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, నంది ఎల్లయ్య, రహ్మత్‌ అలీ, పిట్ల కృష్ణ కేసు వేశారు. 

3). 1999లో వైయస్‌ రాజశేఖరరెడ్డి మరో 15 మందితో కలిసి చంద్రబాబుపై కేసు పెట్టారు. ఇది కూడా చంద్రబాబు కుటుంబ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు కోరారు. ఈ కేసు కూడా ముందుకు సాగలేదు..

4) 2000వ సంవత్సరంలో హెరిటేజ్‌ ఫుడ్స్, శ్రీ భువనేశ్వరీ కార్బైడ్స్‌ అండ్‌ ఎల్లాయ్స్, విష్ణు ప్రియా హార్టీకల్చర్ లిమిటెడ్‌ వ్యవహారాలపై సీబీఐ విచారణ కోరుతూ వైయస్‌ రాజశేఖరరెడ్డి కేసు వేశారు. అయితే, ప్రజాప్రయోజనాల ముసుగులో ఈకేసు మరుగున పడింది.  226 ఆర్టికల్‌ను అన్వయించలేమంటూ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

5)   2001లో చంద్రబాబునాయుడు ఆస్తులమీద, ఎన్టీఆర్‌ ట్రస్టుకు భూమి కేటాయింపు మీద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కేసు పెట్టారు. ఈ కేసు అంతే సంగతి.
 
6) చంద్రబాబు అక్రమాస్తులు సంపాదించారంటూ దానిపై సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించాలని కోరుతూ 2003లో హైకోర్టులో మరో కేసు దాఖలైంది. కన్నా లక్ష్మీనారాయణ ఈ కేసు పెట్టారు. 

7) చంద్రబాబు అక్రమాస్తులు, ఎన్టీఆర్‌ ట్రస్టుపై సీబీఐ విచారణ కోరుతూ కన్నా లక్ష్మీనారాయణ మరోసారి 2004 లో కేసు వేశారు. అయితే, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ దీనిమీద ఘాటైన తీర్పు ఇచ్చింది. పెట్టిన కేసే పెడుతూ, అదే లాయర్లు అవే వాదనలు చేస్తున్నారంటూ కేసును కొట్టేసింది.

8) 2005లో మరో కేసు. అదీ చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణ కోరుతూ. దీన్ని వేసింది ఎన్‌టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి. అయితే దీనిమీద హైకోర్టు స్టే ఇచ్చింది. 

9, 10) ఎన్టీఆర్‌ ట్రస్టుకు భూమి కేటాయింపుపై విచారణ కోరుతూ రెడ్యా నాయక్‌ 1997లో కేసు వేశారు. దీనిపై కూడా విచారణ జరగలేదు. 
 
11) మద్యం కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయంటూ కృష్ణకుమార్‌ గౌడ్‌ 2003 లో కేసు వేశారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రేట్లనే చంద్రబాబు ప్రభుత్వం కంటిన్యూ చేసిందని, కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం పిటిషన్‌ వేశారంటూ హైకోర్టు కేసును కొట్టేసింది. 

12) ఏలేరు భూ కుంభకోణంపై నియమించిన సోమశేఖర కమిషన్‌ను కంటిన్యూ చేయాలని కోరుతూ  పి.జనార్థనరెడ్డి(పీజేఆర్‌) 2001 లో కేసు పెట్టారు. ఈ కుంభకోణంలో దోషులపై చర్యలు తీసుకుంటున్నందువల్ల కమిషన్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. 

13) సోమశేఖర కమిషన్‌ కొనసాగింపు కోసం 2005లో కూడా కేసు దాఖలైంది. కె. శ్రీహరి, అశోక్‌ వేసిన ఈ కేసును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.

14) ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి 2004లో చంద్రబాబుపై కేసు వేశారు. ఈ కేటాయింపులో ‘నీకిదీ నాకదీ’ పద్దతిలో ‘క్విడ్‌ ప్రో కో’ చోటు చేసుకుందని పాల్వాయి ఈ పిటిషన్‌ లో ఆరోపించారు. అయితే, ‘క్విడ్‌ ప్రో కో’ జరిగినట్టు ఆధారాలు లేవంటూ ఏసీబీ కోర్టు కేసును కొట్టేసింది.

15) ఐఎంజీ భారత్‌ కు భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ అవే ఆరోపణలతో పాల్వాయి హైకోర్టుకు కూడా వెళ్లారు. 2020 ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం క్రీడల అభివృద్ధి కోసం ఈ కేటాయింపు జరిగిందని, దీనిలో ప్రజలకు నష్టం వచ్చే పనులేమీ జరగలేదంటూ హైకోర్టు కూడా కేసును కొట్టేసింది.

16) ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందంటూ 2011లో బి.ఎల్లారెడ్డి కేసు పెట్టారు. దీన్ని అదే ఏడాది హైకోర్టు కొట్టేసింది. 

17) 2011 లో దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్‌ విజయమ్మ బాబుపై అక్రమాస్తుల కేసు వేసింది. అయితే ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అప్పట్లో కేంద్ర మంత్రితో రహస్య ఒప్పందాలు చేసుకొని స్టే తెచ్చుకున్నారు.
 
18. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అయితే ఈ కేసులో కూడా విచారణ సాగకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ కేసులో వాయిస్‌ చంద్రబాబుదేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  తాజాగా ఈ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ నిమిత్తం ఏ1 ముద్దాయి అయిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును మాఫీ చేసుకునేందుకు చంద్రబాబు ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. 
Back to Top