బాబు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి..!

() భూములు ఇచ్చే ముందు ఒక మాట

() ఇప్పుడు మాత్రం అన్నింటికీ సాకులు

() వంకలు చెప్పటంలో మంత్రులు, అధికారులు పోటీ

హైదరాబాద్) న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల ప‌రిస్థితి
దారుణంగా తయారైంది. మంత్రులు భూములు తీసుకునేట‌ప్పుడు చెప్పిన మాట‌కు..ఇప్పుడు
చేస్తున్న ప‌నుల‌కు పొంత‌న లేకుండా పోయింది. దీంతో రైతులు అల్లాడుతున్నారు.

 

మాటలు ఘనం.. ఆచరణ శూన్యం..!

 ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వం పెన్ష‌న్
ఇస్తుంద‌ని హామీ ఇచ్చి..ఇప్పుడు మ‌రో మెలిక పెట్టారు.   రైతుల‌కు ఏటా చెల్లించాల్సిన మొత్తాల‌, భూమి లేని వారికి ఇవ్వాల్సిన పెన్ష‌న్లు, వ్య‌వ‌సాయ రుణాల ర‌ద్దు, రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల క‌ల్ప‌న‌, ఉచితంగా విద్య‌, వైద్యం... ఇలా అన్నిర‌కాల ఖ‌ర్చుల‌కు ప్ర‌భుత్వం
ఖ‌జానా నుంచి పైసా ఇవ్వ‌కుండా రాజ‌ధాని భూముల వ్యాపారంలో వచ్చే డబ్బు నుంచే
చెల్లించ‌నుంది. ప్ర‌భుత్వం చేతిలో ఉన్న 10 వేల ఎక‌రాల‌తో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి
రంగం సిద్ధం చేసిన విషయం విధిత‌మే. భూమి క‌నీస ధ‌ర నిర్ణ‌యించ‌డంలో రాజ‌ధానిలో
రైతుల‌కు చెల్లించాల్సిన సొమ్ము, రైతు కూలీలు,
బ‌ల‌హీన వ‌ర్గాల
సంక్షేమం కోసం చేయ‌నున్న ఖ‌ర్చును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సీఆర్‌డీఏ
రూపొందించిన భూ కేటాయింపుల నిబంధ‌న‌లల్లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. 

క‌నీస ధ‌ర‌ లోనే మెలిక..!

రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వం చేసిన‌, చేయ‌నున్న మొత్తం వ్యయాన్ని, భూమి రిజిస్ట్రేష‌న్ విలువ‌ను క‌లిపి భూమికి
క‌నీస ధ‌ర నిర్ణ‌యించనున్నారు. జోన్లు, ప్రాంతాన్ని బ‌ట్టి ధ‌ర‌ల్లో హెచ్చు, త‌గ్గులు ఉంటాయి. వేలం, బిడ్స్ నిర్వ‌హించి భూములు అప్ప‌గించ‌నున్నారు.
భూమి అభివృద్ధి వ్య‌యాన్ని కూడా భూములు కొన్న‌వారే భ‌రించాలి. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న
కోసం చేసిన ఖ‌ర్చును వేరుగా చూపించి వ‌సూలు చేయ‌నున్నారు.

రియల్ మాయ..!

రియ‌ల్ ఎస్టేట్‌ను న‌మ్ముకొని   రాజ‌ధాని ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డం ప‌ట్ల
ప్ర‌జ‌ల్లో విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. భూముల‌కు విప‌రీత‌మైన గిరాకీ వ‌స్తే త‌ప్ప‌...
రైతులు,
నిర్వాసితుల‌కు
న్యాయం జ‌రిగే అవ‌కాశం లేదు. పోటీప‌డి భూములు కొన‌డానికి ముందుకు వ‌చ్చే ప‌రిస్థితులు
ప్ర‌స్తుతానికి క‌న‌ప‌డ‌టం లేదు. ఆశించిన ధ‌ర‌లు రాకుంటే... ప్ర‌భుత్వానికి ప్ర‌త్యామ్నాయ
ప్ర‌ణాళిక ఏది?
 ప్ర‌పంచ‌వ్యాప్తంగా
ఆర్థిక మాంద్యం నెల‌కొంటున్న త‌రుణంలో అటూ ఇటూ అయితే రైతుల పరిస్థితి దయనీయంగా
మారే అవకాశం ఉంది. ఈ సంగతి తెలిసినా ప్రభుత్వం పట్టించుకొనే పరిస్థితి కనిపించటం
లేదు.

 

Back to Top