'ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర‌'

హైదరాబాద్: అసెంబ్లీ వేదిక గా ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర వేశారు. సంవత్స‌రానికి స‌రిప‌డా బ‌డ్జెట్ లెక్క‌ల్ని శాస‌న‌స‌భ కు ప్ర‌భుత్వం స‌మ‌ర్పించాక‌, వాటిపై ప్ర‌తిప‌క్షం అభిప్రాయం తెలుసుకోవ‌టం ధ‌ర్మం. అందుకు అనుగుణంగా మార్పులు చేయాలా, లేక స‌వ‌ర‌ణ‌లు చేసుకోవాలా అనే విష‌యాల‌పై చ‌ర్చించి, దానికి ప్ర‌భుత్వం త‌ర‌పున స‌మాధానం ఇచ్చాక ముందుకు వెళ్ల‌టం ఆన‌వాయితీ. కానీ ఈ సారి శాస‌న‌స‌భ‌లో ఈ ఆన‌వాయితీల‌కు పాత‌ర వేసేశారు.

బ‌డ్జెట్ లో అంకెల గార‌డీ ఏ ర‌కంగా జ‌రిగింది అనేది ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టమైన వివ‌ర‌ణ‌ల‌తో విశ్లేషించ‌టానికి పూనుకొన్నారు. ఒక్కో రంగానికి నిధులు అవ‌స‌రం , కేటాయింపులు, ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయం ఏమిటి స్పష్టంగా స‌భ‌కు వివ‌రించారు. ఒక్కో అంశాన్ని మాట్లాడుతూ వ‌స్తూ.. రైతుల‌కు ఏర‌కంగా అన్యాయం జ‌రుగుతోందో తెలియ‌చెప్పే ఆధారాల్ని స‌భ ముందుకు తీసుకొని వ‌చ్చారు. బ్యాంక‌ర్ల స‌మావేశంలో స‌మ‌ర్పించిన రికార్డుల్ని బ‌య‌ట‌కు తీసి ఒక్కోపాయింట్ వివ‌రిస్తుండ‌గా స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ రావు అడ్డు త‌గిలారు. వైఎస్ జ‌గ‌న్ ను మాట్లాడ నిచ్చేది లేద‌ని అడ్డు చెప్పారు.  మైక్ ను క‌ట్ చేశారు. 

ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేని విధంగా స్వ‌యంగా స్పీక‌ర్ క‌ల్పించుకొని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఫ‌లానా అంశాలు మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్ప‌డం, అంతే కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప్ర‌స్తావిస్తున్న విప‌క్ష నేత మైక్ క‌ట్ చేయ‌టంపై ప్ర‌జాస్వామ్య వాదులు ఆవేద‌న చెందుతున్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్పి స్పీక‌ర్ నిర్ద్వంద్శంగా మైక్ క‌ట్ చేయ‌టంపై వెస్సార్ సీపీ నిర‌స‌న తెలిపింది. స్పీక‌ర్ వైఖ‌రికి నిర‌స‌న‌గా ప్ర‌జాస్వామ్య యుతంగా దండం పెట్టి వైఎస్ జగ‌న్ నాయ‌క‌త్వంలోని ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత స‌భ‌లో జ‌రిగిన విష‌యాల్ని గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి విన్నవించారు.

ఏడాదికి స‌రిప‌డ జ‌మా ఖ‌ర్చుల్ని లెక్క తేల్చే బ‌డ్జెట్ మీద ప్ర‌తిప‌క్షాన్ని మాట్లాడ‌నివ్వ‌కుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గొంతు నొక్కేసింది. స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ రావు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఆయ‌న వైఖ‌రి పక్ష‌పాత పూరితంగా ఉంద‌ని వైఎస్సార్‌సీపీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. స్పీక‌ర్ పై అవిశ్వాసం వ్య‌క్తం చేస్తూ తీర్మానం చేయాల‌ని నోటీసు ఇచ్చింది. శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ కు   వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యేలు నోటీసును అంద‌చేశారు. ఈ నోటీసుపై చ‌ర్చ చేప‌ట్టేవ‌ర‌కు అసెంబ్లీ కి వెళ్ల కూడ‌ద‌ని తీర్మానించుకొన్నారు.

మీడియానే స్పీక‌ర్లు..!
అసెంబ్లీ వేదిక‌గా  బ‌డ్జెట్ లోని లోటుపాట్ల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పూనుకొన్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఎలా గాలికి వ‌దిలేసింది, ప్ర‌జ‌ల్ని ఏ ర‌కంగా ముంచుతున్న‌దీ స‌వివరంగా తెలియ చేసేందుకు పూనుకొన్నారు. ప్ర‌తీ అంశాన్నీ స్పృశిస్తూ విశ్లేష‌ణ సాగిస్తుండ‌గా అప్ర‌జాస్వామికంగా స్పీక‌ర్ ప్ర‌సంగాన్ని నిలిపివేశారు. దీంతో ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాల్ని తెలియ చేయాల్సిన బాధ్య‌త ఉండ‌టంతో వైఎస్ జ‌గ‌న్ మీడియా ను ఎంచుకొన్నారు. విభిన్న ప‌త్రిక‌లు, టీవీ చానెళ్ల ప్ర‌తినిధుల‌తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బ‌డ్జెల్ లోని లోటుపాట్లు, అసెంబ్లీ న‌డుస్తున్న తీరుని వివ‌రించారు. అస‌లు స్పీక‌ర్ కు కోపం ఎందుకు వ‌చ్చింది, ఆయ‌న ఈ ప్ర‌సంగాన్ని అడ్డుకోవ‌టానికి ముందుగా ఏం మాట్లాడిందీ, అంటే  చివ‌రి 7 నిముషాల ప్ర‌సంగాన్ని మీడియా ప్ర‌తినిధుల‌కు ప్లే చేసి చూపించారు. 

 ఆ త‌ర్వాత బ‌డ్జెట్ లోని లోటు పాట్లు ఏమిటి అనేది వైఎస్ జ‌గ‌న్ చాలా స్ప‌ష్టంగా మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు  వివ‌రించారు. వ్య‌వ‌సాయ దారులు, డ్వాక్రా మ‌హిళ‌లు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఇలా ఒక్కో వర్గానికీ ఏ ర‌కంగా అన్యాయం జ‌రుగుతోందో విడ‌మ‌రిచి చెప్పారు. ఇందుకు సంబందించిన గ‌ణాంకాల్ని స్ప‌ష్టంగా వివ‌రించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల్ని న‌మ్మి రైత‌న్న ఏర‌కంగా మోసపోయాడో, కొన్ని చోట్ల అమాయ‌క జ‌నం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్న వైనాన్ని వివ‌రించి చెప్పారు. మొత్తం మీద బ‌డ్జెట్ అన్న‌ది కాకి లెక్క‌ల స‌మాహారంగా ఉంద‌ని స్ప‌ష్టంగా నిర్ధారించి చూపించారు…

నిర‌స‌న గ‌ళం
ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షం పాత్ర ఎంతో  ముఖ్య‌మైన‌ది. ప్ర‌భుత్వం చేసే త‌ప్పిదాల్ని విప‌క్షం ఎత్తి చూపుతుంది, ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఒకే ఒక్క ప్ర‌తిప‌క్షం ఉంది. కానీ ఆ ప్ర‌తిప‌క్షం గొంతుకూడా నొక్కేసి స‌భ ను న‌డిపించుకొనేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఒక వైపు స్పీక‌ర్ వైఖ‌రికి నిర‌స‌న‌గా విప‌క్షం బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టం, స్పీక‌ర్ పై అవిశ్వాసం నోటీసు ఇవ్వ‌టం జ‌రిగాయి. అయినా స‌రే అవేమి ప‌ట్ట‌న‌ట్లుగా స‌భ ను ప్ర‌భుత్వం న‌డిపించుకొనేందుకు ప్ర‌య‌త్నించింది. ఉన్న ఒక్క ప్రతిప‌క్షాన్ని బ‌య‌ట‌కు పంపేసి, అసెంబ్లీ స‌మావేశాల్ని నిర్వ‌హించుకొంటున్న తీరుని ప్ర‌జాస్వామ్య వాదులు ఖండిస్తున్నారు. 
Back to Top