కొత్త నియోజక వర్గాల ఊసే లేదు

నియోజ‌క‌వ‌ర్గాల‌పై తేల్చిన ఎన్నిక‌ల సంఘం

కేంద్ర హోంశాఖ కూడా అదే చెప్పింద‌ని వివ‌ర‌ణ‌

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌నున్న‌దంటూ సాగుతున్న ఊహాగానాల‌కు కేంద్ర
ఎన్నిక‌ల సంఘం తెర‌దించింది. స‌మీప భ‌విష్య‌త్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో శాస‌న‌స‌భ‌, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగే
అవ‌కాశం లేద‌ని తేల్చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల
పునర్విభ‌జ‌న ప్ర‌క్రియ ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం నుంచి ఏదైనా ప్ర‌తిపాద‌న వ‌చ్చిందా?  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏదైనా  కేంద్ర ప్ర‌భుత్వం
నుంచి న్యాయ స‌ల‌హా కోరిందా?  భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ నుంచి ఏదైనా స‌ల‌హా కోరిందా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని
సెక్ష‌న్ 26 ప్ర‌కారం నియోజ‌క‌వ‌ర్గాల పెంపును చేప‌ట్టే
ప్ర‌తిపాద‌న ఏదైనా ఉందా?
అంటూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు
కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ స‌మాధానం ఇచ్చింది. 

       కొంత కాలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు
చేయటం మీద ద్రష్టి పెట్టినందున చంద్రబాబు ఒకటే ఊదర గొడుతున్నారు. త్వరలోనే కొత్త
నియోజక వర్గాలు ఏర్పడుతాయని, అప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్యే పదవులు
దొరకుతాయని ఆశ పెడుతున్నారు. కానీ ఇవన్నీ అబద్దాలే అని తేలిపోయింది.

ఈ అంశంపై
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణలో స్పష్టం అయ్యాయి.

 

నియోజ‌కవ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు వీలు క‌ల్పించే చ‌ట్టం ఏదీ లేనందున ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో నియోజ‌కవ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న
అంశానికి సంబంధించి ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌డం లేద‌ని వివ‌రించింది.
రాజ్యాంగంలోని 170(3)
అధిక‌ర‌ణ‌లోని
నిబంధ‌న‌లే అమలులో ఉంటాయంటూ కేంద్ర హోంశాఖ నుంచి త‌మ‌కు అందిన లేఖ ప్ర‌తిని కూడా ఈ
లేఖ‌తో పాటు అందించింది.

ఆ ప్ర‌క్రియ ఎప్పుడో ఆగిపోయింది...

నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ నిజానికి 2014 సెప్టెంబ‌ర్‌లోనే నిలిచిపోయింది. ఎన్నిక‌ల
సంఘం,
కేంద్ర హోంశాఖ
లేఖ‌ల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం తెలుస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ
చ‌ట్ం - 2014 ప్ర‌కారం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న
అంశాన్ని కేంద్ర హోంశాఖ చేప‌ట్టింది. పున‌ర్విభ‌జ‌న ప్రక్రియ‌కు సంబంధించి కొన్ని
వివ‌ర‌ణ‌లు కావాల‌ని అది భావించింది. దీనిపై కేంద్ర హోంశాఖ‌, లా అండ్ జస్టిస్ మంత్రిత్వశాఖ‌లో
లెజిస్టేటివ్ డిపార్ట్‌మెంట్ మ‌ధ్య ఉత్త‌ర‌ప్ర‌త్యుత్త‌రాలు న‌డిచాయి. ఆ త‌ర్వాత 2014 సెప్టెంబ‌ర్ 8న మాకు కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది. అని
ఎన్నిక‌ల సంఘం వివ‌రించింది. లెజిస్టేటివ్ డిపార్ట్‌మెంట్ సూచ‌న‌ల‌ను కేంద్ర
హోంశాఖ ఆ లేఖ‌లో ప్ర‌స్తావించింది. రాజ్యాంగంలోని 170(3) అధికార‌ణ‌ను బ‌ట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల పునఃపంపిణీకి అవ‌స‌ర‌మైన
స‌ర్దుబాటుకు త‌ప్ప పున‌ర్విభ‌జ‌న‌కు అవ‌కాశ‌మే లేదు. స‌మీప భ‌విష్య‌త్‌లో రెండు
రాష్ట్రాల‌లో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను పెంచేందుకు పూర్తిస్థాయి పున‌ర్విభ‌జ‌న
ప్రక్రియ అవ‌స‌ర‌మే లేద‌ని కేంద్ర హోంశాఖకు ఎన్నిక‌ల సంఘం తెలిపింది. 

ఈసీకి హోం శాఖ జవాబు ఇదీ...

కేంద్ర హోం శాఖ పంపిన ఆఫీస్ మెమోరాండంను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ స‌మాచార హ‌క్కు
కింద ఇచ్చిన జ‌వాబుతో జ‌త ప‌రిచింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి సురేష్‌కుమార్
కేంద్ర ఎన్నిక‌ల సంఘం కార్య‌ద‌ర్శి సుమిత్ ముఖ‌ర్జీకి లేఖ రాశారు. 

 

ఆర్టిక‌ల్ 170(3)
ఏం
చెబుతోందంటే...

ప్ర‌తి జ‌నాభా లెక్క‌ల త‌రువాత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను, అదేవిధంగా నియోజ‌క‌వ‌ర్గాల ప్రాదేశిక ప‌రిధుల‌ను
పార్ల‌మెంటులో చ‌ట్టం తెచ్చి, ఆ చ‌ట్టం పేర్కొన్నవిధంగా పున్ఃస‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. అయితే ఆ మార్పులు
అప్ప‌టికే ఉన్న అసెంబ్లీలోని ప్రాతినిధ్యాన్నిఆ అసెంబ్లీ ర‌ద్దు అయ్యేంత వ‌ర‌కూ ఏ
విధంగానూ ప్ర‌భావితం చెయ్య‌కూడ‌దు. అంతేకాక ఆ పునఃస‌ర్దుబాటు రాష్ట్ర‌ప‌తి జారీ
చేసిన ఆదేశాల‌లో పేర్కొన్న తేదీ నుంచే అమ‌లులోకి రావాలి. ఆ లోపు అసెంబ్లీలో జరిగే
అన్ని ఎన్నిక‌లూ పునఃస‌ర్దుబాటుకు ముందు ఉన్న నియోజ‌క వ‌ర్గాల‌కే జ‌ర‌గాలి.
అంతేకాక 2026 సంవ‌త్స‌రం త‌రువాతి మొద‌టి జ‌న‌గ‌ణ‌న‌కి
చెందిన గ‌ణాంకాల‌న్నీ ప్ర‌చురిత‌మ‌య్యేంత వ‌ర‌కూ, 1) 1971 జ‌న‌గ‌ణ‌న‌, ఆధారంగా ప్ర‌తి రాష్ట్ర అసెంబ్లీలో మార్పు
చేసిన నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను, 2). 2001 జ‌న‌గ‌ణ‌న ఆధారంగా ప్ర‌తి రాష్ట్ర అసెంబ్లీలో మార్పు జ‌ర‌గ‌బోయే నియోజ‌క వ‌ర్గాల
ప్రాదేశిత ప‌రిధుల‌ను పునఃస‌ర్దుబాటు చెయాల్సిన అవ‌స‌రం లేదు.

 

Back to Top