సాగునీటి మీద శ్ర‌ద్ధ క‌రువు

() రోజురోజుకు కుంచించుకుపోతున్న చెరువులు
()  చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటల్లో పేరుకుపోతున్న కంపచెట్లు
 () చెరువులు తెగిపోయినా ఇప్పటికీ నిర్మించని వైనం
 
విజ‌య‌వాడ‌ : చ‌ంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ప్ర‌చారం లో చూపుతున్న శ్ర‌ద్ధ లో కొంత మేర కూడా పాల‌న మీద చూప‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టం లేఉద‌. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయినా.. కేవలం 10 శాతం పనులు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్‌ఆర్ సంకల్పించిన ప్రాజెక్టులు, కాలువల పనులను పూర్తి చేసి ఉంటే అన్నదాతకు కష్టాలు ఉండేవి కావు.

చెరువుల ప్రాధాన్యం
 ప్రతి ఏడాది సాగునీటి కోసం రైతులు సమరం సాగిస్తూనే ఉన్నారు. న‌దులు, కాల‌వల నుంచి నీరు రాక రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. చివరకు చెరువుల ఆయకట్టు కూడా రోజు రోజుకు తీసికట్టుగా మారుతోంది. చెరువుల్లో కంపచెట్లతోపాటు పూడికలు పెరిగిపోవడంతో.. చెరువుల్లో సక్రమంగా నీరు నిలబడక ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ప్రధానంగా చెరువుల కింద కనీసం ఒక్క పంట పండించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది.

చెరువుల మీద అశ్ర‌ద్ధ‌
వ‌ర్షాల కార‌ణంగా  చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. కొన్నిచోట్ల చెరువులకు, కట్టలకు గండ్లు ఏర్పడి వరదనీరు వంక పాలైంది.  పూడిక పెరగడంతోపాటు కంపచెట్లు, ఇతర పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.  కొన్నిచోట్ల ఏకంగా చెరువులకు గండ్లు పడి, నెర్రెలు చీలి నీరు వృథా అవుతున్నా.. మరమ్మతులు చేపట్టలేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఈ చెరువుల నుంచి నీటి స‌ర‌ఫ‌రా అగ‌మ్య గోచ‌రంగా మారింది.

అంతా అవినీతి మ‌యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు - చెట్టు పథకంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. చాలా చోట్ల అవసరమైన చోట పనులు చేయకుండా.. అవసరంలేనిచోట పనులు చేపట్టి అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మంచి ఆయకట్టు ఉన్న చెరువుల్లో పూడికతీతతోపాటు కంపచెట్ల తొలగింపు చర్యలు చేపడితే ఉపయోగంగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెరువుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి పనులు చేస్తున్నా.. అవి రైతులకు ఉపయోగపడేలా కనిపించడంలేదు. 

జాగ్ర‌త్త ప‌డే స‌మ‌యం
వాస్త‌వానికి చెరువుల సంర‌క్ష‌ణ విష‌యంలో వేస‌వి కీల‌కం అని గుర్తించుకోవాలి. వ‌ర్షాకాలానిక‌న్నా ముందే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి. కానీ, ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌టం రైతుల్ని క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. 
Back to Top