నిజాయితీకి అవకాశవాదానికి ఉన్న తేడాను గమనించండి..!

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో నిజాయతీ, నైతికత మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజధాని శంకుస్దాపనకు రాలేను పిలవకండని చంద్రబాబు సర్కార్‌కు బహిరంగ లేఖ రాయడం ద్వారా వైఎస్‌ జగన్ మరోసారి తనవి ముక్కుసూటి రాజకీయాలని రుజువు చేసుకున్నారు.  వైఎస్‌ జగన్‌ చర్యల్లో  రాజకీయం కంటే స్వచ్చత, నిజాయితీ ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ.  గతంలో కూడా జగన్ ఇదే ఒరవడి ప్రదర్శించారు. చంద్రబాబు మాత్రం స్పష్టత లేకుండా విధానాలు ప్రకటిస్తూ చాలా స్పష్టంగా చెప్పాను అని చెబుతుంటారు. కొన్ని ఉదాహరణలు
 
- రాష్ట్ర విభజన అంశంపై కూడా వైఎస్‌ జగన్ ఇలాగే తమ పార్టీది  సమైక్యవాదమని తెగేసి చెప్పారు. అదే చంద్రబాబు మాత్రం వాటయమ్‌ సేయింగ్‌ అంటూ దాటవేసారే తప్ప వైఖరి మాత్రం చెప్పలేదు. 
 
- 150 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌ను సిఎం చేయాలని సంతకాలు చేసినప్పటికీ... సిఎం పదవి కోసం ఆయన అడ్డదారి పట్టలేదు. కానీ చంద్రబాబు మాత్రం సిఎం పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచారు. 
 
-  కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులిస్తే కిరణ్‌ సర్కార్‌ను పడగొట్టొచ్చనే సలహాలు వచ్చినా వాటిని జగన్‌ పట్టించుకోలేదు. ప్రజాసమస్యలపై నిబంధనల ప్రకారం అవిశ్వాసం తీర్మాణం పెట్టారే తప్ప సర్కార్‌ను కూలగొట్టలేదు. ఇది జగన్‌ చాతకానితనమని కామెంట్స్‌ చేసిన వారున్నారు కానీ ఆయన మాత్రం తాను చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు  రాజకీయాలు చేయలేనని తేల్చి చెప్పారు. 
 
-సొంత వారినైనా అవసరానికి వాడుకుని వదిలేయడం చంద్రబాబు సొంతమైతే... ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం .. అధికారం దక్కకపోయినా ఫర్వాలేదనే తత్వం జగన్‌ది. 
 
- 2014 ఎన్నికలకు ముందు కొందరు నాయకులు (ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు)  టీమ్‌తో సహా వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతానని.. అందరికీ టికెట్లు ఇవ్వాలన్నారు. టికెట్లు ఇస్తానని ముందే ఇతర నేతలకు మాటిచ్చాను. వారికి మోసం చేయలేనంటూ  చాలా మంది సీనియర్లను జగన్‌ తీసుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి వారందరినీ తీసుకుని ... ముందు టికెట్లు ఇస్తానన్న వారందరినీ మోసం చేశారు. 
 
- రైతులకు రుణ మాఫీ చేసేంత ఆర్ధిక స్ధాయి రాష్ట్రానికి లేదని... అమలు చేయలేని హామీని ఎలా ఇస్తామని నిజాయితీగా వ్యవహరించిన నేత వైఎస్‌ జగన్‌. కానీ చంద్రబాబు మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. 
 
- రాజకీయాల్లో స్వచ్చత, ముక్కుసూటిదనం, మాట నిలబెట్టుకోవడం, హుందాగా వ్యవహరించడం వంటివి అంతరిస్తున్నాయనే వారు వైఎస్‌ జగన్‌ శైలిని పరిశీలించాలి. 
 
- వెన్నుపోటు, కుటిలత్వం, మోసం చేయడం, నమ్మిన వారినే నట్టేట ముంచడం, ఇచ్చిన మాట తప్పడం వంటి లక్షణాలున్న చంద్రబాబుది రాజకీయ దివాళాకోరుతనమో..చతరుతో విజ్ఞులైన వారే ఆలోచించాలి.
Back to Top