రాజకీయాల్లో కొత్త ఒరవడి

() వైయస్సార్సీపీ విస్త్రత స్థాయి సమావేశంపై సర్వత్రా చర్చ

() కొత్త ఒరవడికి నాంది పలికిన వైయస్ జగన్

() ప్రజలతో మమేకం కావటమే తారకమంత్రం అని నూరిపోసిన జన నేత

హైదరాబాద్) విజయవాడలో జరిగిన వైయస్సార్సీపీ విస్త్రతస్థాయి సమావేశం మీద రాజకీయ
వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జన నేత వైయస్ జగన్ చేసిన ప్రసంగం
మీద లోతుగా విశ్లేషిస్తున్నారు.

వైయస్ జగన్ కొత్త పంథా

        విస్త్రత స్థాయి సమావేశంలో
ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఉత్తేజభరితంగా ప్రసంగించారు.
మండల స్థాయి నాయకుల్ని పిలిపించి సభలో మాట్లాడారు. నియోజక వర్గాల సమన్వయకర్తలు
బాగా పనిచేయాలని సూచిస్తూ .. గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమ వివరాల్ని బయట
పెట్టారు. దీన్ని అనుసరిస్తే రాజకీయాల్లో సక్సెస్ కావచ్చని వివరించారు. ఇందుకు
సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఉదాహరణ గా చూపించారు. ఆయన
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఓడిపోలేదని గుర్తు చేశారు. ఎందుకంటే
ఎన్నికైన తర్వాత కూడా నిరంతరం ప్రజల్లో ఉంటారని విశ్లేషించారు. తాజాగా ఎన్నికలు
అయి రెండేళ్లు అవుతుంటే ఇప్పటికే రెండు సార్లు నియోజక వర్గాన్ని చుట్టి వచ్చారని
పేర్కొన్నారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, పేర్లు
చెప్పలేకపోతున్నానని వివరించారు.

నాయకులకు దిశా నిర్దేశం

        రాజకీయాల్లో రాణించేందుకు
నిరంతరం ప్రజల్లో ఉండాలన్న తారక మంత్రాన్ని వైయస్ జగన్ నిర్దేశించారు. అంతే
కాకుండా గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమాన్ని తీసుకెళ్లటం వల్ల కలిగే ప్రయోజనాలన్ని
వివరించారు.

1.     ప్రతీ ఇంట్లో ఉండే ప్రజల
అభిప్రాయం తెలుసుకోవటం. దీని ద్వారా అంతిమంగా ప్రజల అభిప్రాయలు తెలుసుకొని,
మనసెరిగి ప్రవర్తించటానికి వీలవుతుంది.

2.     ఆయా గ్రామాల్లో పార్టీ పట్ల
ఉత్సాహంగా, చైతన్యవంతంగా పనిచేసే నాయకత్వాన్ని గుర్తించటం

3.      అక్కడికక్కడే బూత్ కమిటీల
ఏర్పాటు ద్వారా పనిచేసేవారికి, సమర్థులకు బాధ్యతలు అప్పగించటం

4.     అభిప్రాయ కరపత్రాల చివరలో
రిమార్కులు రాయటం ద్వారా గమనించిన అంశాల్ని పార్టీ ద్రష్టికి తీసుకొని రావటం

5.     పార్టీ కి ప్రజలకు మధ్య
సమర్థవంతమైన వారధిగా పనిచేయటం

ఇన్ని అంశాలు మిళితమై ఉన్నందున గడప గడపకూ
వైయస్సార్ కార్యక్రమాన్ని చైతన్యవంతంగా నిర్వహించాలని వైయస్ జగన్ ఆదేశించారు.
దీంతో పార్టీ శ్రేణులు నడవాల్సిన బాటను ఆయన సమర్థంగా నిర్మించి ఇచ్చినట్లయింది.

విమర్శలకు కళ్లెం

        ఇటీవల కాలంలో కొన్ని నియోజక
వర్గాల్లో నాయకులు, ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోనై వెళ్లిపోతున్న తరుణంలో వైయస్ జగన్
విమర్శకుల నోళ్లకు తాళం వేసినట్లయింది. ముఖ్యంగా నాయకులు వెళ్లిపోయినప్పటికీ ఆ యా
ప్రాంతాల్లో సమర్థులైన నాయకుల్ని తయారుచేసుకోగల సత్తా తమకు ఉందని చెప్పకనే
చెప్పారు. ఆయా నియోజక వర్గాల్లో గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమాన్ని శక్తి వంతమైన
మెట్లుగా మలచుకోవాలని ఉద్భోదించారు. అప్పుడు తాత తండ్రులు నాయకులు కావాల్సిన పని
లేదని, భారీ వారసత్వాల అవసరం అంతకన్నా లేదని వైయస్ జగన్ సూచన ప్రాయంగా చెప్పారు.
తద్వారా ప్రజల్లో మమేకం కావటం ద్వారా ప్రజల బలంతో ఎదగవచ్చని నొక్కి చెప్పారు. రాజకీయాల్లో
రాణించాలంటే ఇదే తారకమంత్రం అని సక్సెస్ సీక్రెట్ 
ను సోదాహరణంగా వివరించారు. 

Back to Top