చంద్రబాబు కొత్త కుట్ర



ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు నమ్మబలికారు. లేదంటే
నిరుద్యోగ భ్రతి కింద రూ. 2వేల రూపాయిలు ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ పదవిలోకి
వచ్చాక మాత్రం  ఆ హామీని గాలికి వదిలేశారు.
అంతటితో మోసాల చిట్టా ఆగిపోలేదు.

ఒక్కటంటే ఒక్క ప్రభుత్వోద్యోగం బాబు ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి
మేరకు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షలు
నిర్వహించారు. కానీ దాన్ని కూడా వివాదాస్పదం చేసి పోస్టింగ్ లు ఇవ్వకుండా
తొక్కిపెట్టారు. ఈ లోగా స్కూళ్ల రేషనలైజేషన్ పేరుతో ఉన్న బడుల్ని మూసేసేందుకు
కుట్ర చేస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారన్న నెపంతో పాఠశాలల్ని
మూసేస్తున్నారు. పక్క గ్రామాల్లోని బడుల్లో వీటిని కలిపేస్తున్నారు. ఇదంతా చేసి
క్లస్టర్ స్కూల్స్ పేరుతో ఏడు వేల మంది టీచర్లు ఎక్కువగా ఉన్నారని లెక్క తేల్చారు.
తద్వారా కొత్తగా టీచర్ ఉద్యోగాలు తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు. ఈ విషయం
తెలియని విద్యార్థులు, నిరుద్యోగులు తమకు భవిష్యత్ లో అయినా ఉద్యోగం రాకుండా
ఉంటుందా అని అదే పనిగా చదువుకొంటున్నారు.

బయట పడకుండా కొత్త కుట్రలు చేస్తూ చంద్రబాబు నిరుద్యోగుల్ని మోసం
చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top