బాబుది యూట‌ర్న్‌..ప్ర‌జ‌లు చెబుతారు అబౌట్‌-టర్న్‌




- గూగుల్‌లో ‘యూటర్న్‌ అంకుల్‌’ అంటే బాబు ఫొటోలు ప్రత్యక్షం
-  యూట‌ర్న్ అంటేనే ఉలిక్కిపడుతున్న టీడీపీ నాయకులు
- సోషల్‌ మీడియాలో, బయటా బాబుపై సెటైర్లు, విమర్శలు


అమ‌రావ‌తి: ‘యూటర్న్‌..’ ఈ పేరు వింటేనే గుర్తుకు వ‌చ్చే పేరు చంద్ర‌బాబు. అందుకేనేమో ఆ మాట వింటేనే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పది రోజులుగా ఆ పదం వాడకుండా ఏ సమావేశాన్ని ముగించడం లేదు. తాను యూటర్న్‌ తీసుకోలేదంటూ పార్టీ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్‌ల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీన్నిబట్టే ‘యూటర్న్‌’ టీడీపీని ఎంత కలవరపాటుకు గురి చేస్తోందో తెలిసిపోతోంది.

ఎప్ప‌టిక‌ప్పుడు రంగులు ..యూట‌ర్న్‌లు
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు  పూట‌కో మాట మాట్లాడుతూ..రోజుకో రంగు మార్చుతున్నారు.  ఆయన ‘యూటర్న్‌’ల గురించి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. గత ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని 15 ఏళ్లు కావాలని మోదీ సమక్షంలో కోరారు. తర్వాత బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకుని హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ అత్యుత్తమమని మాట మార్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి హోదానే కావాలంటూ మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. హోదా కోసం పోరాడుతున్న యువతను బెదిరించిన నోటితోనే ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ కొత్త పాట పాడుతున్నారు.  


సోష‌ల్ మీడియాలో బాబుపై సెటైర్లు
‘ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇతర మాధ్యమాల్లో బాబు యూటర్న్‌పై అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. గూగుల్‌లో ‘యూటర్న్‌ అంకుల్‌’ అంటే చంద్రబాబు ఫొటోలు, యూటర్న్‌ సింబల్‌తో ఉన్న ఫొటోలు దర్శనమిస్తుండడం విశేషం. ఇటీవల ప్రధాని మోదీ సైతం లోక్‌సభలో మాట్లాడుతూ చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు.


40 ఏళ్లుగా బాబు పొలిటిక‌ల్ యూటర్న్‌లు 
1978  - కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
1983  - కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిన తరువాత ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చి టీడీపీలోకి జంప్‌
1995  - సొంత మామ ఎన్డీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు
1998  - యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉండగానే యూటర్న్‌తో ఎన్డీఏలో చేరిక
1999  - బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ  
2004 - ఎన్నికల తర్వాత ఎన్డీఏకు హ్యాండ్‌ ఇచ్చి బయటకు వచ్చిన బాబు
2009 - టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కలిసి పోటీ, ఎన్నికలయ్యాక ఆ పార్టీలకు ఝలక్‌
2014 - మళ్లీ ఎన్డీఏలో చేరిక  
2018 -మరోసారి ఎన్డీఏకు ఝలక్‌ ఇచ్చి బయటకు వచ్చారు

ప్రత్యేక హోదాపై అదే తీరు..అవే యూట‌ర్న్‌లు
2014  ఏప్రిల్‌ 29  -   మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇస్తామంటున్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని మోదీ గారిని కోరుతున్నా (తిరుపతి సభలో)  
2015 ఆగస్టు 25  -  ప్రత్యేక హోదా సంజీవని కాదు.  (ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలో)
2016 మే 17      -  హోదాతో ఏమొస్తుంది? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
2016 సెప్టెంబర్‌ 15 -     హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు.
2017 ఫిబ్రవరి 3    -  హోదా వేస్ట్‌. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు.
2018 మార్చి 2    -  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ అనలేదు.
2018 మార్చి 10  -    కేంద్రంపై వైయ‌స్ఆర్‌సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం.
2018 మార్చి 15  -    వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాసానికి మద్దతిస్తాం.
2018 మార్చి 16 -    వైయ‌స్ఆర్‌సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం. మేమే అవిశ్వాసం పెడతాం.
2018 మే       -     రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
2018 జూలై 25  -   ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.


త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం యూట‌ర్న్‌లు తీసుకోవ‌డం చంద్ర‌బాబుకు స‌హ‌జ నైజం. బాబు యూట‌ర్న్‌ల‌ను ప్ర‌జ‌లు ఇప్పుడిప్పుడే  ప‌సిగ‌డుతున్నారు. ఇక ఆయ‌న‌కు  అబౌట్ ట‌ర్న్ త‌ప్ప‌దు.

Back to Top