నేతన్నను ముంచిన చంద్రన్న

– రాష్ట్రంలో మగ్గాల మౌన వేదన
– చంద్రబాబు పాలనలో చేనేతలకు నిత్యం కష్టాలే
– ఉపాధిలేక బలవన్మరణాలు
– అప్పులతో నూలుపోగుల చిక్కుముళ్లు
– ఆప్కో ఆదాయం పెంచిన వైయస్‌ఆర్‌

నేడంతా అచేతనం... బతుకంతా దుర్భరం. రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడ్డా పట్టెడన్నం దొరకని దైన్యం. రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి రేటు గిట్టని విషాదం. అప్పులతో నూలు పోగులు చిక్కుముళ్లు పడుతున్నాయి. సాంచాల సప్పుడు వినిపించే చోట చావుడప్పు మోగుతోంది. ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెల్లారుతోంది. చంద్రబాబు విస్మరించిన చేనేతల కన్నీళ్లను తుడిచేందుకు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఓ యజ్ఞమే చేశారు. బడ్జెట్‌ను పెంచారు..రుణమాఫీ చేశారు. స్పెషల్‌ ప్యాకేజీలతో వస్త్ర పరిశ్రమకు పునర్జన్మనిచ్చారు. ఉత్పత్తులకు గిరాకీ పెంచేలా చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు అండగా నిలిచారు. పింఛన్‌ పెంచి ఆపద్భాంధవుడయ్యారు.
చేనేతల ఆత్మహత్యలు నిత్యకృత్యాలు
ఏపీలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు నిత్యకృత్యాలైనాయి. అప్పులపాలై ఒకరు, బతుకు గడవక ఇంకొకరూ జీవితాలు అంతమొందించుకుంటున్నారు.  కరువు సీమగా రాయలసీమ పేరుబడగా అందులోనూ ఎడారి జిల్లాగా అనంతపురం ’కీర్తి’ గణించింది. పట్టు పరిశ్రమల నిలయంగా మారిన ధర్మవరం పట్టు పరిశ్రమ ముడి సరుకుల ధరలు పెరగడంతో తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా తయారవుతోంది. సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా మగ్గాలు మౌనంగా రోదిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చేనేత ఆరోగ్య బీమా పథకం అమలుకు మంగళం పాడింది. ఈ పథకాన్ని అటకెక్కించి ఇప్పటికే నాలుగేళ్లు దాటింది. 

చేనేతలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైయస్‌ఆర్‌..
చేనేతలకు అన్ని విధాలా న్యాయం జరిగింది ఒక్క వైయస్‌ఆర్‌ హయాంలోనే... తానూ ఎప్పుడూ చేనేతలు నేసిన బట్టలే వేసుకుని చేనేతలు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్నారు వైయస్‌ఆర్‌... అలానే ప్రభుత్వ ఉద్యోగులంతా కనీసం రెండురోజులు చేనేత వస్త్రాలు ధరించాలి అని జీవో జారీ చేసి, ప్రభుత్వ శాఖలన్నీ ఆప్కో ద్వారానే వస్త్రాల్ని కొనుగోలు చేయూలన్న వైఎస్‌ ప్రభుత్వ ఆదేశాల పుణ్యవూ అని ఆ ఏడాది రూ.47 కోట్ల విలువైన వస్త్రాల కొనుగోళ్లు జరిగారుు.. అలా చేనేతల కోసం అవసరమైనవి అన్నీ చేశాడు... కానీ చంద్రబాబు చేనేతలకి అన్ని విధాలుగా అన్యాయం చేశాడు... పరిహారం కోసమే ఆత్మహత్యలన్న చంద్రబాబు పాలనలో రుణవూఫీ గురించిగానీ, ఆత్మహత్యల నివారణకు చర్యలుగానీ తీసుకోకపోగా అధిక వడ్డీలకే రుణాలు వసూలు జరిగింది. ప్రభుత్వం నుంచి పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా ముుఖ్యవుంత్రి హోదాలోనే చంద్రబాబు చేశారు. బాబు పాలనలో నిండుగా వస్త్రాలు ధరించలేని దౌర్భాగ్యంలో నేతన్న 
నేతన్న నిండుగా దుస్తులు ధరించలేని దుస్థితి చంద్రబాబు జమానా. కడుపు నిండా ఒక్కపూటైనా ఇంటిల్లిపాదికి అన్నం పెట్టలేని దా‘రుణాలు’ ఎన్నో. ఏడాదికిపైగా వస్త్ర ఖరీదు సొమ్ము ప్రాథమిక చేనేత సంఘాలకు బాబు సర్కార్‌ చెల్లించనేలేదు. దాంతో 1994–95 కాలంలో రూ.126 కోట్ల ఆప్కో వ్యాపారం 1998–99 కాలానికి రూ.280 కోట్లకు పెరగకపోగా, రూ.60 కోట్లకు పడిపోయింది. పైగా, తాను కేంద్రంలో చక్రం తిప్పడం వల్లే బీజేపీ సర్కార్‌ ఏర్పడిందని గొప్పలు చెప్పుకున్న బాబు చేనేత వస్త్రాలపై 20 శాతం సబ్సిడీ కొనసాగింపులో ఘోర వైఫల్యం చెందారు. ఫలితంగా చేనేత వస్త్రాలు గుట్టలుగా పేరుకుపోయి.. పనులు లేక నేతన్నలు అల్లాడారు. ఎవరైనా ధైర్యం చేసి అప్పు చేసి వస్త్రాల్ని నేస్తే.. వాటి అమ్మకాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రోత్సాహం శూన్యమైంది. దాంతో చేనేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకు దారి తీసింది.
కనీస సానుభూతి లేదు
1. నేత కార్మికుల సంక్షేమం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పైపెచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు.
2. 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. అప్పటి చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు.
3. బాబు హయాంలో 1999–2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు.
4. నేత కార్మికులకు పింఛను ఇవ్వాలని బాబు ఏనాడూ ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు.
5. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలను వంద వరకు మూసేశారు.
6. ఎన్టీఆర్‌ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు.
7. బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్‌ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భీవండి, సూరత్‌ వలసపోయారు.
8. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలో రికార్డుస్థాయిలో నమోదయ్యాయన్నారు. 1998లో 57 మంది ఆత్మహత్య చేసుకోగా... బాబు నిర్వాకం వల్ల 2004 నాటికి 1700కు చే రాయని వివరించారు. వాటి తాలూకు వివరాలు బాబును అధికారంలోకి తెచ్చేందుకు తహతహలాడుతున్న ఆయన ‘ముద్దుల పత్రిక’ ప్రచురించింది. l
వైయస్‌ఆర్‌ పాలనలో సుఖసంతోషాలు
చంద్రబాబు సీఎంగా ఉండగా 2003–04లో ఆప్కో టర్నోవర్‌ రూ.85.85 కోట్లు వూత్రమే ఉంది. వైఎస్‌ సీఎంగా ఉండగా 2007–08 నాటికి ఆ మొత్తం 119.23 కోట్లకు పెరగడాన్ని బట్టే నేత కార్మికులు తయూరు చేసిన వస్త్రాలకు గిరాకీ పెరిగేలా చేశారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ శాఖలన్నీ ఆప్కో ద్వారానే వస్త్రాల్ని కొనుగోలు చేయాలన్న వైయస్‌ ప్రభుత్వ ఆదేశాల పుణ్యవూ అని ఆ ఏడాది రూ.47 కోట్ల విలువైన వస్త్రాల కొనుగోళ్లు జరిగాయి. ఆ తర్వాత ఏడాది రూ.92 కోట్ల మేరకు పెరిగింది. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రారంభమైన చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ చర్యలతోబాటు పలు పథకాల్ని వైఎస్‌ సర్కారే అమలు చేసింది.

1. 1997 ఏప్రిల్‌ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన 215 కుటుంబాలకు రూ.1.5 లక్షల చొప్పున వైయస్‌ ఉండగానే నష్టపరిహారం అందింది. వీరితోబాటు 114 కుటుంబాలను ప్రత్యేక కేసులుగా పరిగణించి సీఎం సహాయ నిధి నుంచి రూ. 25 వేలు చొప్పున సాయం అందించారు.
2. చేనేత కార్మికులకు ప్రత్యేకంగా వృద్ధాప్య పింఛన్‌ వయసు 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకే తగ్గించిందీ.. రూ.75 ఉన్న పింఛన్‌ రూ.200లకు పెంచిందీ వైఎస్‌ సర్కారే కావడం గమనార్హం.
3. వైఎస్‌ పాలనలో రెండు లక్షలకుపైగా కార్మికులకు ఉపయోగపడేలా పావలా వడ్డీకే చేనేత రుణాలు ఇచ్చేలా చేశారు.
4. దేశంలోనే తొలిసారిగా పోచంపల్లిలో హ్యాండ్‌లూం పార్కును ప్రారంభించారు. హ్యాండ్‌ లూం పార్కుల కోసం భూవుుల్ని కూడా కేటాయించారు.
5. చిలప నూలుపై 9.5 శాతవుున్న ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించేలా చేశారు. చేనేతకు అధిక ప్రాధాన్యతను ఆచరణలో చూపించారు.
6. చేనేత కార్మికుల సంక్షేవుం కోసం త్రిఫ్ట్‌ ఫండ్‌ స్కీంను అవులు చేశారు.
Back to Top