జ‌గ‌న్‌కు తోడుగా.. రైత‌న్న‌లు న‌డ‌వ‌గా!


* వైయ‌స్ జ‌గ‌న్‌కు అన్న‌దాత‌ల మ‌ద్ద‌తు
* జ‌న‌నేత వెంట వేలాదిగా న‌డుస్తున్న రైత‌న్న‌లు
* వైయ‌స్ఆర్‌సీపీ ప‌థ‌కాల‌పై హ‌ర్షం
ఒంగోలు: రాజ‌న్న బిడ్డ జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అన్న‌దాత‌లు అండ‌గా నిలుస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ అడుగులోఅడుగేస్తున్నారు. తోడుగా న‌డుస్తున్నారు. ప్ర‌భుత్వంపై చేస్తున్న పోరులో మేము సైతం అంటూ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.      ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌తి గ్రామంలో అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, అన్ని వ‌ర్గాలకు, అన్ని కులాలు, మ‌తాల‌కు న్యాయం చేసేవిధంగా ఉన్నాయంటూ ప్ర‌జ‌లు కీర్తిస్తున్నారు. ముఖ్యంగా రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. అన్న‌దాత‌ల కోసం ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు రైతును రాజుగా నిల‌బెట్టేట‌ట్లు ఉన్నాయంటూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 
ఏటా రూ.12500లు
రైతులు పంట‌లు వేసుకునేందుకు అప్పులు చేయ‌కూడ‌దు అన్న ఉద్దేశ్యంతో ప్ర‌తి రైతుకూ ఏటా మే మాసంలో రూ.12500లు ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన దానిపై అన్న‌దాత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అప్పులు చేయాల్సిన బాధ త‌ప్పింద‌ని,  ముఖ్యంగా ఈ డ‌బ్బులు చిన్న‌..స‌న్న‌కారు రైతుల‌కు చాలా  ఉప‌యోగ‌ప‌డుతుందంటున్నారు. 
ఉద‌యం పూటే 9 గంట‌ల ఉచిత విద్యుత్‌
విద్యుత్ చార్జీలు క‌ట్ట‌లేద‌ని రైతుల‌ను జైల్లో పెట్టించి, పోలీసుల‌తో లాఠీల‌తో కొట్టించిన చంద్ర‌బాబు పాల‌న‌ను త‌ల‌చుకుంటే భ‌య‌మేస్తోంద‌ని, ఇలాంటి పాల‌న పోయి రాజ‌న్న రాజ్యం రావాల‌ని ప్ర‌తి రైతూ కోరుకుంటున్నార‌ని, అందుకే వైయ‌స్ జ‌గ‌న్‌కు రైతులు అండ‌గా నిలుస్తున్నార‌ని అన్న‌దాత‌లు అంటున్నారు. ఎప్పుడు క‌రెంటు వ‌స్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో రైతులు ఇబ్బందులు ప‌డేవార‌ని, రాత్రిపూట పొలాల‌కు పోయి చాలా మంది పాముకాటుకు మృత్యువాత ప‌డిన సంద‌ర్భాలున్నాయ‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఇలాంటి బాధ‌ల‌న్నీ త‌ప్పుతాయ‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే రైతుల‌కు ఉద‌యం పూటే 9 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించి రాజ‌న్న బిడ్డ అనిపించుకున్నార‌న్నారు. నిజంగా ఇది ప్ర‌తి రైతూ ఆనందించే విష‌య‌మ‌న్నారు. 
ఏటా రూ. 3వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి
పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేదు అన్న బాధ‌లు లేకుండా చేయ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్ ఏటా రూ.3వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన దానిపై రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పంట‌లు వేసే ముందే ధ‌ర ప్ర‌క‌టిస్తామ‌ని, ఆ ధ‌ర‌కే పంట‌ను కొంటామ‌ని చెప్ప‌డం నిజంగా ఆహ్వానించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ఇలా చేస్తే ఏ ఒక్క రైతు అప్పుల‌పాలు కార‌ని, వైయ‌స్ జ‌గ‌న్ మంచి నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని రైతులు జ‌న‌నేత‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురిస్తున్నారు. 
ప్ర‌కృతి వైప‌రీత్యాల కింద ఏటా రూ.4వేల కోట్లు
అనుకోకుండా ఏదైనా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించి రైతులు న‌ష్ట‌పోకుండా ఉండేందుకు ఏటా రూ.4వేల కోట్ల‌తో నిధిని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి జ‌గ‌న్ అన్న‌దాత‌ల‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్నార‌ని రాష్ట్ర రైతులు అంటున్నారు.  ఒక్క‌మాట‌లో చెప్పాలంటే  అన్న‌దాత‌లు పంటలు వేసే ద‌గ్గ‌రి నుంచి ఆ పంట‌ను అమ్ముకుని డ‌బ్బులు చేతికి వ‌చ్చే వ‌ర‌కు అన్ని ర‌కాలుగా తోడుగా ఉంటామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారంటున్నారు.  ఏది ఏమైనా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అన్న‌దాత‌లు అండ‌గా నిలుస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 
Back to Top