ప్రతి ఒక్కరిలోనూ సంతోషం నింపే నవరత్నాలు





సరిగ్గా
ఏడాది కిందట నవరత్నాలను ప్రకటించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ప్లీనరీ వేదికపై ప్రజా సంక్షేమమే లక్ష్యంగా
ఈ నవరత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి బహిరంగ సభలోనూ నవరత్నాల గురించి సవివరంగా చెబుతున్నారు.
అలా చెప్పిన ప్రతిసారీ ప్రజల స్పందన అపూర్వంగా ఉంటోంది. తమ రాతలు మార్చే రత్నాల్లాంటి పథకాలు రాజన్న బిడ్డతోనే సాధ్యం అంటూ ఆనందిస్తున్నారు
రాష్ట్ర ప్రజలు. ప్రతినోటా నవరత్నాల చర్చే వినిపిస్తోంది.
గత దశాబ్ద కాలంగా నిర్లిప్తమైపోయిన ప్రజల గుండెల్లో ఆశలను నింపాయి నవరత్నాలు.
అంతేకాదు ప్రజలతో కలిసి సాగుతూ వారి సాధకబాధకాలు వింటూ, ప్రజల అవసరాలనే మేనిఫెస్టోగా మారుస్తాను అని ఆనాడు జగన్ చెప్పిన మాట అక్షర
సత్యమైంది. ప్రజా సంకల్పంలో ప్రజల మధ్యే ప్రజా మేనిఫెస్టో రూపుదిద్దుకుంటోంది.
ఇది ఓ ప్రజాస్వామ్య పాలకుడి లక్షణం. ఇదీ ప్రజాస్వామ్యాన్ని
నమ్మి నడిచే నాయకుడి వ్యక్తిత్వం.

నవరత్నాలకు
సాటిలేదు

నవరత్నాలంటే
మేలైన రత్నాలని అర్థం. జాతి రాళ్లని అర్థం. గులకరాళ్లకూ జాతిరాళ్లకూ చాలా బేధం ఉంటుంది.
విలువలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. టీడీపీ ఇచ్చిన హామీలు గులకరాళ్లై గలగల మంటూంటే...వైయస్ఆర్   కాంగ్రెస్
పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల్లాంటి పథకాలను ప్రజలముందుంచారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాలను అక్షరాలా అమలు చేసి చూపించనున్నారు. ఇది సంక్షేమ
స్వాప్నికుడి హామీ. మాటతప్పని ఓ మహానేత వారసుడు ఇస్తున్న హామీ. నమ్మకానికి అన్న అని
తెలుగు  ప్రజలంతా భావిస్తున్న  నాయకుడు జననేత నవ్యాంధ్రకు ఇస్తున్న హామీ.

అన్ని
వర్గాలకూ నవరత్నాలు

అన్ని
వర్గాల ప్రజలకూ నవరత్నాల ఫలితాలు అందేలా రూపకల్పన చేసారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.
పేద రైతులు, మధ్యతరగతి
కుటుంబాలు, పొదుపు సంఘాల మహిళలు, చిన్నారులు,
విద్యార్థులు, ఆసరాలేని వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, ఉన్నత
చదువులు చదవాలని కోరుకునే వారు, ఇలా ప్రతి ఒక్క వర్గానికీ ఉపయోగపడేలా
నవరత్నాలను తీర్చిదిద్దారు వైయస్ జగన్.  ప్రజా
సంకల్ప యాత్రలో అడుగడుగునా నవరత్నాలకు విశేష స్పందన లభిస్తోంది.  ప్రజా మేనిఫెస్టో ప్రజాభీష్టం మేరకు రూపుదిద్దుకుంటోంది.
చెప్పినవే కాదు, చెప్పనవీ అమలు చేసి చూపిస్తానన్నారు వైయస్ జగన్.
ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారో పాదాయత్ర సమయంలో తనకొచ్చి చెప్పాలని కూడా విజ్ఞప్తి చేసారు.
మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని ధీమాగా మాట ఇస్తూ ముందుకు
సాగుతున్నారు జననేత

 నవవిధాల నవరత్నాలు

 వైయస్‌ఆర్‌ రైతు భరోసా

            వ్యవసాయానికి పగటిపూటే
9 గంటల పాటు ఉచిత విద్యుత్‌.

            రైతన్నలకు వడ్డీలేని రుణాలు
అందిస్తాం.

            రైతులకు ప్రతి ఏటా మే నెలలో
పెట్టుబడి కోసం రూ.12500 ఇస్తాం.

            రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.

            ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు
యూనిట్‌కు రూ.1.50కి తగ్గింపు.

            రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.

            ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ
గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్‌ ఏర్పాటు.

            సహకార డెయిరీకి పాలుపోసే
ప్రతి పాడిరైతుకూ లీటర్‌కు రూ.4లు బోనస్‌.

            వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌
ట్యాక్స్‌ రద్దు చేస్తాం.

            రూ. 4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు.

             ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య
చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి
రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.

 అమ్మ ఒడి

            పేదింటి పిల్లల చదువులకు
ఏ తల్లి భయపడొద్దు

            పిల్లలని బడికి పంపితే చాలు
ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తాం.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

            పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును
పూర్తిగా భరిస్తాం.

            పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి భోజనం కోసం అదనంగా రూ.20వేలు ప్రతీ విద్యార్థికి ఇస్తాం.

మద్యపాన నిషేధం

            కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతూ
మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.

            అందుకే అధికారంలోకి వచ్చిన
వెంటనే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.

ఆరోగ్యశ్రీ

            వైద్యం ఖర్చు రూ.1000లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

            ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ
ద్వారా ఉచిత వైద్యం

            ఎక్కడ చికిత్స చేయించుకున్నా
(హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై
మొదలగునవి) ఆరోగ్యశ్రీ వర్తింపు

            అన్ని రకాల వ్యాధులు,
ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి

            ఆపరేషన్‌ లేదా, జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంత
సమయంలో ఆ కుటుంబం బతకడానికి అండగా ఆర్థిక సహాయం

            కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇంకా ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా రూ.10,000
పింఛన్‌ నెల నెల ఇస్తాం.

 వైయస్‌ఆర్‌ ఆసరా

            ఎన్నికల రోజు వరకు ఆక్క చెల్లెమ్మలకు
ఉన్న పొదుపు సంఘాల రుణాలను 4 దఫాలుగా నేరుగా మీ చేతికే అందిస్తాం.

            అంతేకాదు మళ్లీ సున్నా వడ్డీకే
రుణాల విప్లవం తెస్తాం, ఆ వడ్డీ డబ్బును మేమే బ్యాంక్‌లకు అక్క చెల్లెమ్మల తరపున కడతాం.

 పేదలందరికీ ఇల్లు

            ఇల్లు లేని పేదలందరికీ పక్కా
ఇళ్లు

            ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని
అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌

            అంతేకాదు డబ్బు అవసరమైతే
అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంక్‌లతో మాట్లాడతాం.

 పింఛన్ల పెంపు

            ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు
65 నుంచి 60కి తగ్గిస్తాం.

            అవ్వాతాలకు పింఛన్‌
రూ.2000లు ఇస్తాం.

            ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు
45 ఏళ్లకే రూ. 2000 పింఛన్‌ ఇస్తాం. అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాం.

            వికలాంగులకు పింఛన్‌
రూ.3000 ఇస్తాం.

జలయజ్ఞం

            దివంగత మహానేత వైయస్‌ఆర్‌ కలలుకన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం.

            పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.

 

రాష్ట్రంలో
నవరత్నాల పేరు చెబితేనే ఆనందంతో ఆశీస్సులు ఇస్తున్నారు తెలుగు ప్రజలు. వైయస్ ఆర్ వారసుడిగా, ప్రజల కష్టాన్ని తెలుసుకుని
మసిలే  నాయకుడిని చూసి గర్వపడుతున్నారు. రాజన్న
రాజ్యాన్ని తిరిగి తెచ్చే సత్తా ఉన్న ఒకే ఒక్కడు వైయస్ జగన్ అని నినదిస్తున్నారు. 

Back to Top