అన్న వస్తున్నాడు.. నవరత్నాలు తెస్తున్నాడు


– ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ స్పందిస్తున్న జననేత
– సమస్యల నిశిత పరిశీలన.. ప్రజల సాక్షిగా హామీలు

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. నిన్ననే నెల్లూరు జిల్లా వెంకటగిరి సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ విజయమ్మ చెప్పిన మాటలు జగన్‌ను ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయడం కంటే లక్షల మందిని కలిసి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాడనే నాకు సంతృప్తిగా ఉందని చెప్పడం. పాదయాత్రపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచింది. ఇప్పటికే రాయలసీమ నాలుగు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జననేత స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుని అప్పటికప్పుడే నిర్ణయాలను ప్రకటిస్తూ ప్రజా సమస్యలపై పరిష్కారంపై తానెంత స్పష్టతతో ఉన్నారో తెలియజెబుతున్నారు. పాదయాత్ర సందర్భంగా తన దృష్టికొచ్చిన సమస్యలను అధ్యయనం చేసి ఆయా సందర్భాల్లో ఇచ్చిన హామీలు చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. 

అనంతపురం నియోజకవర్గంలో మొత్తం 8 బహిరంగ సభలు, 4 సదస్సులు జరిగాయి. కర్నూలు జిల్లాలో నవంబర్‌ 14న చాగలమ్రరిలోని ముత్యాలపాడు బస్టాండ్‌లో, 15న ఆళ్లగడ్డలో జరిగిన సభకు జనం పోటెత్తారు. 19న బనగానపల్లెలో, 21న బేతంచెర్ల బస్టాండ్‌ సర్కిల్‌లో సభలో జరిగితే ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. 28వ తేదీన గోనెంగడ్లలో, 30న ఆస్పరి మండంలోని బిల్లేకల్‌లో, డిసెంబర్‌ 1న పత్తికొండలో నిర్వహించిన సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లోని 18 మండలాల్లో 256 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. సీటీఎంలో బీసీల సదస్సు, కల్లూరులో మైనారిటీల సదస్సు, దామలచెరువులో రచ్చబండ, అనుప్పల్లిలో రైతుసదస్సు, పాపానాయుడుపేటలో బీసీల సదస్సు, పల్లమాలలో ఎస్సీల సదస్సులు నిర్వహించి ఆయా వర్గాల వారికి నవరత్నాల గురించి వివరిస్తూనే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైతే నెరవేర్చబోయే హామీలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. 

పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలు

– ప్రతి మండలానికి కోల్డ్‌ స్టోరేజీ 
– 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
– 1000 రూపాయలు దాటిన ప్రతి చికిత్స ఆరోగ్య శ్రీ పరిధిలోకి
– అనంతపూర్, కర్నూలు జిల్లాల నుంచి బోయ, వాల్మీకి కులాల నుంచి ఒకరికి ఎంపీ సీటు 
– బీసీ డిక్లరేషన్‌ – బీసీ సబ్‌ ప్లాన్‌ తీసుకొచ్చేందుకు ప్రణాళిక 
– మైనారిటీలకు సబ్‌ ప్లాన్‌ 
– ఇమామ్‌ల జీతాలు 5 వేల నుంచి 10 వేలకు పెంపు, మోజన్‌లకు 3 వేల నుంచి 5 వేలకు పెంపు
– రాష్ట్రంలో ఉన్న అన్ని మసీదులు, చర్చిలు, ఆలయాలకు ప్రతినెలా నిర్వహణ ఖర్చులు.  
– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం 
– ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించడం 
– చిత్తూరు, కర్నూలు జిల్లా ఆర్మూరులో టమోట జ్యూస్‌ ఫ్యాక్టరీ 
– పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు లీటరు పాలకు రూ. 4 మద్ధతు ధర 
– పింఛన్‌ వయసు 45 ఏళ్లకు కుదింపు
– పింఛను వెయ్యి నుంచి రెండు వేలకు పెంపు 
– రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ
– ఉద్యోగ విప్లవం తెచ్చేందుకు లక్షా 50 వేల ఉద్యోగాలు 
– ఏటా డీఎస్సీ ప్రకటన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
– ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగభృతి వంటి అన్ని సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం
– అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతి ఎంపీ నియోజకవర్గం  ప్రాతిపదికగా ఒక కొత్త జిల్లాలు 
– అధికారంలోకి రాగానే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
– మూసేసిన చక్కెర ఫ్యాక్టరీల పునఃప్రారంభం
– చేనేతలకు ఉపాధి కల్పించేలా ఆర్థిక చేయూత 
– ఎస్సీల సమస్యలపై అధ్యయన కమిటీ. పాదయాత్ర ముగిసిన వెంటనే ఎస్సీ గర్జన. అధ్యయన కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం. 
– నాపరాయి పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలు తగ్గింపు
– డోన్‌ నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ చేసి ఉచితంగా బోర్ల ఏర్పాటు.
Back to Top