న్యూఢిల్లీ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన దృశ్యాలను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ మీడియా కూడా అమితాసక్తి కనబరిచింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ బిబిసి శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన వార్తను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. శ్రీ జగన్ విడుదల ఘట్టాలను రాష్ట్రంలోని తెలుగు వార్తా చానళ్లతో పాటు జాతీయ వార్తా చానళ్లు కూడా విస్తృతంగా ప్రసారం చేశాయి. హెడ్‌లైన్సు టుడే, టైమ్సు నౌ, ఎన్డీటీవీ, జీ న్యూస్, డిడి న్యూస్, ఆజ్‌తక్ చానళ్లు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి శ్రీ జగన్మోహన్‌రెడ్డి ర్యాలీగా ఇంటికి చేరే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. దీనికి రిపోర్టర్ల వ్యాఖ్యానాలను కూడా జత చేశాయి. హెడ్‌లైన్సు టుడే అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు... శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై రాజకీయ విశ్లేషకులతో అరగంట పాటు ప్రత్యేక చర్చ కూడా నిర్వహించింది.

కాగా.. పలు మరాఠీ, కన్నడ వార్తా చానళ్లు కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి ర్యాలీ దృశ్యాలను ప్రసారం చేశాయి. ద హిందూ, టైమ్సు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్సుప్రెస్, హిందుస్థాన్ టైమ్సు, బిజినెస్ స్టాండర్డు, లైవ్ మింట్, ఫస్టు పోస్టు వంటి జాతీయ ఆంగ్ల దినపత్రికలు, ద వీక్ వంటి వారపత్రికలు కూడా తమ వెబ్‌సైట్లలో శ్రీ జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రస్తావించాయి. ‘జగన్మోహన్‌రెడ్డి వాక్సు అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ 16 మంత్సు...’, ‘జగన్‌రెడ్డి వాక్సు అవుట్ ఆఫ్ జైల్ టు రైజింగ్ రిసెప్షన్...’ అంటూ శీర్షికలు పెట్టాయి. ఆయా వెబ్‌సైట్లలో ఈ వార్తను చదివిన నెటిజన్లు దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను పొందుపరిచారు. కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకొని శ్రీ జగన్ విడుదల కావడం సంతోషంగా ఉందంటూ ఎక్కువ మంది నెటిజన్లు పేర్కొన్నారు.

ద లయన్ ఈజ్ బ్యాక్ :
శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన వెంటనే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వేలకొద్దీ పోస్టులు, ట్వీట్లు దర్శనమిచ్చాయి. శ్రీ జగన్ ర్యాలీ దృశ్యాల షేరింగులు, లైకులు కూడా పెద్ద సంఖ్యలో కనిపించాయి. ‘హీ ఈజ్ ద రూలర్...’, ‘ద లయన్ ఈజ్ బ్యాక్...’, ‘ద కింగ్ ఆఫ్ ఆంధ్ర వైయస్ జగన్ ఈజ్ బ్యాక్...’, ‘జగన్ బెయిల్‌పై విడుదలైన కొద్దిసేపటికే ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పాలకులకు వెన్నులో వణుకు మొదలవుతుందనేందుకు ఇది సంకేతం’, ‘మైకేల్ జాక్సన్ తర్వాత ఈ రోజు జగన్‌ను చూసేందుకు వెల్లువలా వచ్చిన ప్రజాభిమానాన్ని చూశా...’, ‘భారీ జనసందోహం...ఎప్పుడూ అంత మందిని చూడలేదు..’, ‘ఇక రాజకీయాలన్నీ మారిపోతాయి..’, ‘రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం దొరికినట్లే..’ వంటి ట్వీట్లు, పోస్టులతో నెటిజన్లు, అభిమానులు హోరెత్తించారు. ‘కింగ్ ఈజ్ కింగ్.. ఎవర్ అండ్ ఎవర్’, ‘ఓన్లీ ఒన్’, ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’ వంటి పోస్టులు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమయ్యాయి.

ఈ పోస్టులకు క్షణాల్లో లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్‌లు వచ్చాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఫేస్‌బుక్‌లో ఏ పేజీ క్లిక్‌చేసినా జనంలోకి జగన్ వచ్చాడనే వార్తే హైలెట్ అయింది. ఉదయం నుంచే ‘ఈ రోజు అన్న బయటకు వస్తాడు’ అంటూ మొదలైన హడావుడి సాయంత్రం అయ్యే సరికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రికి లోటస్‌పాండ్‌కు చేరుకున్న శ్రీ జగన్ కాన్వాయ్ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అభిమానులు వీటికి లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్ చేసి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ‘ఫేస్‌బుక్‌లో మేము ఈ రోజు షేర్ చేసుకున్న స్వీటెస్టు న్యూస్ ఇదే’ అని ఉద్విగ్నతకు లోనైనవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ‘కంగ్రాట్సు జగన్ సర్’ అని శుభాభినందనలను పంచుకున్న వారెందరో.

ఒక నెటిజెన్ అయితే శ్రీ జగన్మోహన్‌రెడ్డి అదృష్ట సంఖ్యను ఏడుగా లెక్కగట్టాడు. శ్రీ జగన్ జైలులో గడిపిన 484 రోజులను 4+8+4=16 అని, 16 నెలలు అంటే 1+6=7 అని, జగన్ దాఖలు చేసుకున్న ఏడవ బెయిల్ పిటిషన్‌కే వచ్చిందని గుర్తుచేశాడు.