నంద్యాలకు నవయుగ నాయకుడు

నంద్యాల నియోజకవర్గం. ఇప్పుడీ పేరు రాష్ట్రం మొత్తం మారుమోగుతోంది. వేడెక్కిన ఉప ఎన్నికల నేపథ్యమే ఇందుకు కారణం. అయితే నంద్యాలకు రాజకీయంగా ఎంతో ఉన్నతమైన చరిత్ర ఉంది. దేశానికి ఒక రాష్ట్రపతిని, ఒక ప్రధానిని అందించిన ఘనత నంద్యాల సొంతం. పివి.నరసింహారావు నంద్యాల నియోజిక వర్గం నుండే లోక్ సభకు పోటీ చేసి అత్యంతభారీ మెజారిటీతో గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. నంద్యాల పట్నం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఎంతో పేరుపొందింది. వ్యవసాయ, వాణిజ్యపంటలకు పెట్టింది పేరుగా ఉన్నాయి ఇక్కడి గ్రామాలు. వందకు పైగా పత్తి జిన్నింగ్ మిల్స్ ఇక్కడున్నాయి. అలాంటి అద్భుత ప్రాంతం నంద్యాల ఇప్పుడు రాజకీయ సమీకరణాలతో క్షణ క్షణం ఓ యుద్ధ వీక్షణంలా కనిపిస్తోంది.

నంద్యాల జనాభా 2లక్షల 20వేలకు పైగా ఉంటుంది. ఇందులో అత్యధికశాంతం అంటే 67.2 శాతం మంది నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉండగా, 20.5 శాతం మంది నంద్యాల మండల గ్రామాల్లో, 12.3 శాతం మంది గోస్పాడు మండలంలో ఉన్నారు. ఇదే సంఖ్యా పరంగా చూస్తే నంద్యాల పట్టణ జనాభా సంఖ్య 129486.  నంద్యాల మండలంలో 44960, గోస్పాడు మండల గ్రామాల్లో 26671 గా ఉంది. వీరిలో పురుషులు 98,016 కాగా స్త్రీలు అత్యధిక సంఖ్యలో 103101గా ఉన్నారు. వీరందరూ టిడిపి పాలనలో నిర్లక్ష్యానికి గురైనవారే. నిన్నటిదాకా చంద్రాబాబుకు వీరంతా ప్రజలుగా కూడా కనిపించలేదు. ఇప్పడు ఓటర్లుగా మాత్రం కనిపిస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చంద్రబాబు రుణమాఫీ మాటలను నమ్మి గత ఎన్నికల్లో ఓట్లు వేసారు. యధావిధిగా బాబు చేసిన మోసాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఈ సారి మాత్రం బాబు కపటనాటకాలని నమ్మేది లేదని వారు గట్టిగా నిర్ణయించుకున్నారు. పావలా వడ్డీ రుణాలను కూడా లేకుండా చేసి బ్యాంకు గడప తొక్కే పరిస్థితి లేకుండా చేసిన బాబుకి గుణపాఠం చెప్పేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. గడపకో ఉద్యోగం అని, కర్నూలులో ఉద్యోగాల వెల్లువని, పరిశ్రమలు, ఆసుపత్రులు, యూనివర్సిటీల ఏర్పాటని నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడిన బాబుకు గూబ గుయ్ మనే సమాధానం ఇవ్వాలని నంద్యాల యూత్ ఎప్పుడో డిసైడైపోయింది. 

నంద్యాల వివిధ సామాజిక వర్గాలతో సంఘీభావానికి అర్థంలా ఉంటుంది. ముస్లింలు, కాపులు, వైశ్యులు, యాదవులు ఇలా వివిధ సామాజిక వర్గాల వారు ఇక్కడ కలిసి కట్టుగా జీవిస్తున్నారు. ఉప ఎన్నికల నేపధ్యంలో వీరందరినీ విభజించి వారి మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు టిడిపి విఫల ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఆయా సామాజిక వర్గాలకు టిడిపి ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏ ఒక్క సాయమూ చేసింది లేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో బోలెడు వరాలు కురిపించేసిన చంద్రబాబు అవి ఎంత వరకూ నెరవేరుస్తాడో మాకామాత్రం తెలియదా అనుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు మంత్రి వర్గంలో ఒక్క ముస్లిం కూడా మంత్రిగా లేడు. ఎన్నికలు వచ్చేసరికి మైనారిటీలపై తనకెంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. ప్రధాన ఎన్నికలప్పుడు కాపులను బిసిల్లో చేరుస్తానన్న బాబు తర్వాత మంజునాధ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నాడు. కాపులు ఉద్యమించిన ప్రతిసారీ తన అధికార మదంతో వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడే ఆటలో వైశ్యుల జీవనాధారమైన షాపులను నిర్దాక్షిణ్యంగా కూలదోయించాడు బాబు. అభివృద్ధి అంటే షాపులు కూలదోయడం కాదు, కొందరి జీవనోపాధి కాల రాయడం కాదని బాబు తీరును ఎండగట్టారు.  వైశ్యుల తరఫున వైయస్ జగన్ నిలబడ్డారు. వారికి వైశ్యకార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు పనుల్లో నష్టపోయిన వారికి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నమ్మకాన్ని నిలబెట్టుకునే నాయకుడో, నయవంచనతో ముంచే నాయకుడో… నంద్యాలకు నవయుగ నేత ఎవరో సమీకరణాలన్నీ పక్కాగా సెట్ అయిపోయాయి. ఇక మిగిలింది ఫలితాలు తేల్చి జెండాలు ఎగరేయడమే.

తాజా వీడియోలు

Back to Top