నాలుగేళ్లు మాడ్చి.. ఏడాదిలో ఏమార్చాలని


– ఉత్తుత్తి పథకాలతో చంద్రబాబు హడావుడి
– ఎన్నికల ఏడాది పథకాల ప్రారంభోత్సవాలు
– నోటికేషన్‌కు మూడు నెలల ముందు నిరుద్యోగ భృతి
– జేబు నింపే పథకంగా అన్నక్యాంటీన్లు 



నాలుగేళ్లు ముగిసిపోయిన తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు చంద్రబాబుకు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. ఏ చెట్టు కింద కూర్చోని జ్ఞానోదయం అయ్యిందోకానీ 2019 ఎన్నికల కోసం జనాన్ని ఇంప్రెస్‌ చేయాలని మొక్కుబడి పథకాలు ప్రారంభిస్తున్నాడు. ఓడిపోతాననే భయం ఉన్నప్పుడల్లా చంద్రబాబు తన తీరుకి భిన్నంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ప్రజలు చంద్రబాబును తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఆయనలో మార్పొచ్చింది. ఊరూరా తిరిగి నేను మారిపోయానని ఢంకా భజాయిస్తూ వచ్చాడు. సుదీర్ఘ అనుభవం ఉన్న నన్ను గెలిపిస్తే ఆంధ్రాను అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని నక్క వినయాలు ప్రదర్శించి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చాడు. అయితే ఈ నాలుగేళ్లు జరిగింది మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం.

నీరుగారిపోతున్న ప్రజాదరణ పథకాలు
వైయస్‌ఆర్‌ హయాంలో ఏ పథకాలైతే విశేష ప్రజాదరణ పొందాయో వాటిని చంద్రబాబు ఒక్కొక్కటిగా పథకం ప్రకారం నీరుగారుస్తూ వచ్చాడు. గతంలోనే ఎన్‌టీఆర్‌ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన చరిత్ర ఉన్న బాబుకు.. వైయస్‌ఆర్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు చరమగీతం పాడాడు. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఐదు రూపాయలు చేసిన ఘనత కూడా ఆయనదే. రేషన్‌ దుకాణాల్లో రూ. 187లకే తొమ్మిది రకాల వస్తువులు ఇస్తుంటే బాబు రాకతో బియ్యం దొరకడమే గగనమైపోయింది. ఈపోస్‌ మిషన్లు ప్రవేశపెట్టి జనం సహనాన్ని పరీక్షించారు. చివరికి చంద్రబాబే గెలిచారు. పనులు మానుకుని సిగ్నళ్ల కోసం క్యూలైన్లలో నిలబడలేక జనం బియ్యం వద్దనుకునే పరిస్థితిని కల్పించారు. పండగల పేరుతో చంద్రన్న కానుకలు ఇస్తున్నా.. నాసిరకం సరుకులతో టీడీపీ నాయకుల జేబులు నింపుకున్నారు. పనికిమాలిన మజ్జిగ పథకం పేరుతో రూ. 39 కోట్లు కేటాయించి హెరిటేజ్‌లో పెరుగు, మజ్జిగ అమ్ముకున్నారు. 

నాలుగేళ్లు కడుపు మాడ్చి...
నాలుగేళ్లు జనం కడుపు మాడ్చి ఒక్కసారిగా రోజుకో పథకం ప్రారంభిస్తూ ఆర్భాటం ప్రదర్శిస్తున్నాడు. గెలిచిన నాటి నుంచీ ఆయన పాలనలో జరిగిన అవినీతి, చేసిన మోసాలు, సామాన్యులపై  చిన్నచూపు, మహిళలపై దాడులను, ఉద్యోగులపై వేధింపులను అన్న క్యాంటీన్లు, మూడు లక్షల గృహ ప్రవేశం, డప్పు కళాకారులకు నెలకు రూ. 1500 పింఛన్, హోంగార్డుల వేతనం పెంపు, తలసేమియా బాధితులకు రూ. 2 వేల పింఛన్‌ వంటి పథకాలతో జనాన్ని ఏమార్చాలని పగటి కలలు కంటున్నాడు. అలాగని ఆయా పథకాలేమైనా సరిగా అమలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఉదాహరణకు అన్న క్యాంటీన్ల పథకమే తీసుకుంటే భారీ అవినీతి కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. అన్న క్యాంటీన్‌ కట్టడానికి ఒక్కో క్యాంటీన్‌కు రూ. 38.65 లక్షలు వెచ్చిస్తున్నారు. వంట గది సామాగ్రి కొనేదానికి ఒక్కో క్యాంటీన్‌కు 78.47 లక్షలు. కేటరింగ్‌ సర్వీస్‌ కోసం మొత్తం 182.99 కోట్లు కేటాయించగా అందులో ప్రభుత్వ వాటా 110.38 కోట్లు ఉంది. చంద్రబాబుకు ఓట్లు కురిపించిన మరో ముఖ్యమైన పథకం నిరుద్యోగ భృతి. దాన్ని కూడా ఎన్నికలకు మూడు నెలల ముందు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. 
 
Back to Top