అమ్మలా మారిన షర్మిలమ్మ

శ్రీమతి షర్మిల... దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ గారాల పట్టి. సంక్షేమ పథకాలను తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికీ, దానికి వంత పాడుతున్న టీడీపీ వైఖరికీ వ్యతిరేకంగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె కూడా కొన్ని సందర్భాలలో అమ్మగా మారిపోయారు. తమ బిడ్డల కష్టాలు చెప్పుకునే తల్లులను చూసినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు.

అమ్మ... అమ్మే..

 అమ్మ.. అమ్మే.. బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకుంటే ఆమె కంట్లో నీరు తిరుగుతుంది. కేరింతలు కొడితే ఆనందబాష్పాలు వర్షిస్తాయి. సత్తెనపల్లి సమీపంలోని ధూళిపాళ గ్రామంలో ఇద్దరు బిడ్డల పరిస్థితి విన్న శ్రీమతి షర్మిల అమ్మలా మారిపోయారు. వారిని అక్కున చేర్చుకుని వెక్కివెక్కి ఏడ్చారు. అనారోగ్యంతో తొలుత తల్లి, తదుపరి తండ్రి మరణించారు. ఆ ఇద్దరు పిల్లల భారం అమ్మమ్మ మరియమ్మపై పడింది. వృద్ధురాలైన తనకు వారిని సాకడం తన వల్ల కావడంలేదని రాజన్న తనయకు మొరపెట్టుకుంది. పిల్లలను తన వె ంట పంపిస్తే చదివించి వారిని ప్రయోజకులను చేస్తానని శ్రీమతి షర్మిల ఆమెకు భరోసా ఇచ్చారు.
 
 జన్మనిచ్చింది మేమైనా.. ప్రాణం పోసింది మీరే
 యడ్లపాడు మండలం సొలస గ్రామంలో నారాయణమ్మ అనే మహిళ శ్రీమతి షర్మిలను కలిసి కన్నీటి పర్యంతమైంది. తన బిడ్డకు రాజన్నే ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారని తెలిపి భోరుమంది. నా కుమారుడు జితేంద్ర శివప్రసాద్‌కు గుండెలో మూడు రంధ్రాలున్నాయనీ, వెంటనే ఆపరేషన్ చేయాలనీ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నా బిడ్డకు ఉచితంగా హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేశారు. మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నా కొడుకు బతికాడు. కన్నది మేమైనా ప్రాణం పోసింది మీరేనమ్మా అని చెప్పారు. వాడికి మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారనీ, అందకు 4లక్షలు ఖర్చవుతుందనీ తెలిపారనీ, జగనన్న ముఖ్యమంత్రయితేనే నా కొడుక్కి వైద్య సాయం అందుతుందనీ చెప్పారు. ఆమె వేదనను చూసిన శ్రీమతి షర్మిల కనులు చెమర్చాయి.

తాజా వీడియోలు

Back to Top