మోసం..మోసం.. మళ్లీ మళ్లీ మోసం

– ముస్లింలపై మళ్లీ మంత్రి పదవి వల
– 2014లో 15 మంది మైనారిటీలకు టిక్కెట్‌ ఇస్తామని మోసం 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ముస్లింలను పావులుగా వాడుకునేందుకు సిద్దమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు చెప్పిన అవే మాయ మాటలను మళ్లీ మళ్లీ వినిపించి వశ పరుచుకోవాలని చూస్తున్నాడు. ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న దగ్గర్నుంచి ఒక పద్దతి ప్రకారం నరేంద్రమోడీని విమర్శిస్తూ ముస్లింల ఓట్లకు గాలం వేస్తున్నాడు. ‘నారా హమారా.. టీడీపీ హమారా’ అంటూ మరోసారి తేనె పూసిన కత్తితో ముస్లింలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యాడు చంద్రబాబు. 
ఎన్నికలొస్తే ముస్లింలు గుర్తుకొస్తారు

నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఒక్కరినీ మంత్రిని చేయలేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు గుంజుకునేందుకు కొత్త కార్యక్రమానికి తెరలేపాడు. గడిచిన ఎన్నికల్లో ముస్లింలకు 15 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కరిద్దరితో సరిపెట్టారు.  కొడుకు లోకేష్‌ను పోటీ చేయకుండానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. కనీసం ఆ విధంగా కూడా ఒక్క ముస్లింను కూడా మంత్రిని చేయలేదు. తప్పినిసరి పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో ఫరూక్‌ను ఎమ్మెల్సీని చేశాడు. ముస్లింలకు మంత్రి పదవి ఇస్తానన్నాడు. నంద్యాల ఎన్నికలకు ముందు రంజాన్‌ రావడంతో రూ. 93 లక్షలు ఖర్చు చేసి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశాడు. ఎలాగైతేనేం.. నంద్యాల ఎన్నికల్లో గెలిచాడు. అంతే.. చెప్పినవన్నీ మరిచిపోయాడు. ముస్లింలకు మంత్రి పదవి లేదు. 15 మందికి ఎమ్మెల్యే టిక్కెట్‌లు ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. చివరికి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. పార్టీలో  చేరితే మంత్రి పదవులు దక్కుతాయన్న హామీతో టీడీపీలో చేరిన వారిద్దరికీ హామీ నెరవేర్చలేదు. ముస్లిం ఎమ్మెల్యేలను విస్మరించారు. భారతదేశంలో ఇప్పటి వరకు ముస్లింలు ప్రాతినిథ్యం లేని కేబినెట్‌ నడుపుతున్న ఒకే ఒక్క సీఎంగా చంద్రబాబు అపఖ్యాతి మూటగట్టుకున్నారు. 
Back to Top