హైదరాబాద్) ఐటీని తానే తెచ్చానని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ఘనత ప్రస్తుతం చర్చనీయాంశం గా మారింది. చంద్రబాబు నిర్వాకాన్ని మీడియా సాక్షిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజా ఉతికి ఆరేశారు. దీంతో దీని మీద మరోసారి చర్చ ఊపందుకొంది. చరిత్ర పరిణామ క్రమంలో ఐటీ పరిశ్రమ దక్షిణాది నగరాల్లో వేళ్లూనుకొంటే అదేదో తన ఘనత లా చంద్రబాబు చెప్పుకోవటం మీద చర్చ నడుస్తోంది. భారతదేశంలో ఐటీ రంగం ఎక్కువగా బెంగుళూరు నుంచి 38 శాతం కాంట్రీబ్యూషన్ ఉండేది. తర్వాత తమిళనాడు నుంచి 14 శాతం, ఢిల్లీ నుంచి 14 శాతం, ముంబాయి–పూణే నుంచి 16 శాతం కాంట్రీబ్యూషన్ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 8 శాతానికి పరిమితమైంది. అంతెందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 3వ స్థానంలో ఉన్న ఐటీ 9 సంవత్సరాల పదవికాలం అయిపోయేసరికి దేశంలోనే 5వ స్థానానికి పడిపోయింది. అయినా సరే, దీని మీద మాత్రం నోరు విప్పటం లేదు. మరో వైపు ఐటీ రంగం ప్రగతికి తానే కారణం అయినట్లు చంద్రబాబు చెబుతుంటారు. కానీ, సౌత్ ఇండియాలో క్రమక్రమంగా ఐటీ సెక్టార్ పెరుగుతూ వచ్చింది. ఎందకంటే మన దగ్గర ఆంగ్ల భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో పెరిగుతూ వచ్చిందని చెప్పారు. మనకు ఇంజనీరింగ్ కళాశాలలు, విద్యార్థులు ఇంజనీరింగ్‌కు ఎక్కువగా ఆసక్తి కనబర్చడంతో పెరుగుతూ వచ్చింది. వాస్తవం ఇలా ఉంటే ప్రతీదీ తన ఖాతాలో వేసుకోవటం అలవాటు ఉన్న చంద్రబాబు ఈ విషయంలో కూడా అలాగే కక్కుర్తి పడుతుంటారు. వాస్తవానికి బెంగళూరు లో కర్నాటక ప్రభుత్వం చొరవ తీసుకోవటం ప్రగతి సాధ్యం అయింది. ఐటీ స్థాపితంలో పబ్లిక్ సెక్టార్ సంస్థలు కంప్యూటరైజేషన్ స్టార్ అవ్వడంతో కర్ణాటకలో ప్యాకేజీ మాదిరిగా టెండరింగ్‌లు చేసి ఉద్యోగులను తీసుకుంది. కానీ, అదే టైంలో చంద్రబాబు చిన్న చిన్న యూనిట్‌లని పెద్దదిగా చేసి పట్టిసీమ తరహాలో నచ్చిన వారికి ఇచ్చారు. కోటి రూపాయల యూనిట్‌ను ఐదింటితో కలిపి మొత్తం ఐదు కోట్లను ఒక్కరికే వచ్చేటట్లు చేశారు. కంపెనీలో స్థాపించేటప్పుడు సాప్ట్‌వేర్ టెక్నాలజీ పార్కు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీకల్ సర్వీస్ సర్టిఫికేట్లు పెట్టి నచ్చిన వారికి ఇస్తూ ఈ రంగాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు.