చంద్రబాబు అడుగు జాడల్లోనే..!


() అవినీతిలో చంద్రబాబు వారసులు

() అవినీతి బయట
పడినా అదే బాట

() బుకాయించటమే
బాబు నేర్పిన విద్య

విజయవాడ)
రాజధాని ప్రాంతంలో చెలరేగిపోయి భూములు ఆక్రమించుకొన్న తెలుగుదేశం నాయకుల గుట్టు
రట్టయింది. దొడ్డిదారిన వందల ఎకరాలు గుప్పిట పెట్టుకొన్నారు. దోచుకోవటంలో
చంద్రబాబుని అనుసరించిన తెలుగు తమ్ముళ్లు.. అడ్డంగా దొరికిపోయాక కూడా ఆయన్నే
అనుసరిస్తున్నారు.

అంతా చంద్రబాబు
బాటలోనే..
!

       రాజధాని లో అవినీతి అంతా పూర్తిగా
చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో సాగుతోంది. ఆయన సూచనల మేరకు రాజధాని నూజివీడు
ప్రాంతంలో ఏర్పడుతుందని ప్రజల్ని నమ్మించారు. తెలివిగా చంద్రబాబు అనుచరులు మాత్రం
అమరావతి ప్రాంతంలో భూముల్ని చౌకగా దక్కించుకొన్నారు. తర్వాత రాజధానిని ప్రకటించాక
మరి కొందరు మంత్రులు అక్కడ ఉండే అసైన్డ్ భూముల్ని చౌకగా కొట్టేశారు. ఈ భూముల్ని
మొత్తంగా చూసుకొంటే దాదాపు పాతిక వేల ఎకరాలుగా తేలింది. అంటే రాజధాని కోసం
ప్రభుత్వం 33వేల ఎకరాలు లాక్కొంటే చుట్టూతా ఉన్న భూమిలో హెచ్చుశాతం బాబు బినామీల
చేతుల్లోనే ఉంది.

మంత్రుల బుకాయింపు..!       

ఇదంతా
ఇప్పుడు బయటకు రావటంతో భుజాలు తడుముకోవటం మంత్రుల వంతయింది. రోజంతా చంద్రబాబుతో
చర్చించుకొన్నాక బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. భూములు కొనలేదని కానీ, తమకు మట్టి
అంటుకోలేదని కానీ ఏ మాత్రం చెప్పటం లేదు. డబ్బు ఉన్న వాళ్లు భూములు కొనుక్కొంటారు
తప్పేముంది అంటూ దబాయించారు. అసలు ఇటువంటి వార్తలు రాస్తున్నందుకు సాక్షి టీవీ,
సాక్షి పత్రికల మీద కేసులు వేస్తామని బెదిరించారు. పత్రిక, టీవీ చానెల్స్
ఉన్నతోద్యోగుల మీద కూడా కేసులు పెడతామని హడావుడి చేశారు తప్పితే సూటిగా భూములు
తీసుకోలేదు లేదా భూములుకు మాకు సంబంధం లేదని ఒక్క మాటంటే ఒక్క మాట లేదు.

       అప్పట్లో చంద్రబాబు వేసిన మార్గమే..!

ఓటుకి
కోట్లు కుంభకోణం లో అడ్డగోలుగా దొరికిపోయిన చంద్రబాబుకూడా ఇలాగే తప్పుడు వాదనలు
వినిపించారు. తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదు. ముఖ్యమంత్రి ఫోన్ లు ఎలా ట్యాప్
చేస్తారు అని కాసేపు, హైదరాబాద్ లో భద్రత లేదని మరికాసేపు, సెక్షన్ 8 అమలు
చేయిస్తామని ఇంకాసేపు హడావుడి చేశారు తప్పితే సూటిగా ఖండించ లేక పోయారు. ఇప్పుడు
కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మంత్రులు అలాగే దబాయిస్తున్నారు. పైగా వార్తలు
ప్రచురించిన సంస్థల మీద కేసులు పెడతామని హడావుడి చేస్తున్నారు తప్పితే భుజాలు
తడుముకొంటూ బుకాయిస్తున్నారు.  

Back to Top