<strong>() చంద్రబాబు లెక్కలపై సొంత ప్రభుత్వంలోనే సందేహం</strong><strong>() వృద్ది అంటూనే డబ్బులు లేవనటంలోని ఆంతర్యం</strong><strong>() ఉన్నతాధికారులు, మంత్రుల్లోనూ అంతర్మథనం</strong>హైదరాబాద్) రెండంకెల వృద్ది సాధించామని చెప్పటం, భారత దేశ సగటు వృద్ధి కన్నా ఎక్కువగా వృద్ధి సాధించామని గొప్పలు చెప్పటం మీద రాష్ట్రంలో చాలా మంది ఆశ్యర్య పోతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ మంత్రులు, ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం అంతు పట్టకుండా ఉంది. ఎందుకంటే ఆయా మంత్రిత్వ శాఖల నుంచి ఆర్థిక శాఖ కు నిధులు విడుదల చేయాలంటూ ఫైల్స్ పంపుతుంటారు. కానీ చాలినంతగా నిధులు లేవంటూ ఈ ఫైల్స్ తిరుగు ముఖం పడుతున్నాయి. దీంతో మంత్రులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకొంటున్నారు.ఒక వైపు దేశంలో ఏ రాష్ట్రం కూడా సాదించలేనంత అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ సాధించిందని గొప్పలు చెబుతుండటంపై మంత్రులు మండిపడుతున్నారు. నిజంగా అంత సీన్ ఉంటే, తమ తమ మంత్రిత్వ శాఖలకు ఎందుకు నిధులు విడుదల చేయటం లేదంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖను అడుగుదామంటే ముఖ్యమంత్రి కన్నా అందనంత ఎత్తులో ఆర్థిక మంత్రి ఉంటారు. చంద్రబాబుని అయినా అడిగితే సమాధానం వస్తుందేమో కానీ, యనమల నుంచి ఏమాత్రం సమాధానం రాదు అన్న సంగతి మంత్రుల్లో చాలా మందికి తెలుసు. చంద్రబాబు కి వ్యక్తిగతంగా బ్రాండింగ్ చేసేందుకు లేని వృద్దిని కాగితాల్లో చూపిస్తున్నారని చాలా మంది మంత్రులకు ఉన్న సందేహం.ఇటీవల శాసనసభ ప్రాంగణంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇదే విషయం మీద చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ను ఇదే విషయం మీద ఒక సీనియర్ మంత్రి ప్రశ్నించినప్పుడు ఇద్దరు,ముగ్గురు మంత్రులు జత కలిశారని తెలిసింది. అయిదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంకేతిక అంశాల వరకు చెప్పేసి అసలు విషయాన్ని వదిలేయటంతో మంత్రులు మాట్లాడలేకపోయారు. దీంతో చంద్రబాబు బ్రాండింగ్ సరదా గురించి మంత్రుల్లో కూడా జోకులు పేలుతున్నాయని రూఢీ అవుతోంది.