చంద్రబాబు ఇలాగేనా పాలన..

వైఎస్.రాజశేఖర్ పాలన చూసైనా నేర్చుకో..!
బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు..!

నెల్లూరుః వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను  ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ జగన్ ఎన్నో దీక్షలు చేశారని, ఎక్కడా ఎలాంటి ఆందోళన జరగలేదని అన్నారు. అలాంటిది దీక్షను అడ్డుకోవాల్సిన అవసరమేముందని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.  ముఖ్యమంత్రి అయి ఉండి కేంద్రాన్ని ప్రత్యేకహోదా డిమాండ్ చేయాల్సింది పోయి...అందుకోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత దీక్షకు  ఆంటంకాలు సృష్టించడాన్ని తప్పుబట్టారు. 

తగిన గుణపాఠం తప్పదు..!
ఐదేళ్ల ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్, కాదు పదేళ్లు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టి రాష్ట్రాన్ని విడగొట్టాయని మేకపాటి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని త్వరలోనే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని మేకపాటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుంది. వైఎస్ జగన్  కచ్చితంగా దీక్ష చేసి తీరుతారని మేకపాటి స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

పట్టిసీమ శుద్ధ దండగ..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్హులైన పేదలందరికీ సంక్షేమపథకాలు అందించారని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు అసలు పేద ప్రజల బాగోగులే పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి పాలన చూసైనా చంద్రబాబు నేర్చుకోవాలని..అందరికీ సమన్యాయం చేయాలన్నారు. పట్టిసీమ శుద్ధ దండగని, ముందుగా పోలవరం ప్రాజెక్ట్ ను  పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని మేకపాటి డిమాండ్ చేశారు. 
Back to Top