శ్రామికులనూ వంచించిన బాబు

నేడు
ప్రపంచ కార్మిక దినోత్సవం. కార్మికుల హక్కుల దినోత్సవం. శ్రమకు సరైన విలువ కట్టాలని
కార్మికులు ఏక కంఠంతో నినదించిన రోజు. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్వేదాశ్రువులతో
కార్మికులు కదం తొక్కిన రోజు. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో కార్మికుల స్థితి గతులను ఓ
సారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అసంఘటిత రంగ కార్మికుల
సంఖ్య రెండు కోట్లపైనే ఉంటుంది. వారి శ్రమే రాష్ట్ర మూలధన కల్పనకు ఆధారం. భవన మరియు ఇతర నిర్మాణ రంగాలోని
పనివారు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో పనిచేసేవారు, చేతివృత్తులు చేసుకునే వారు,
నెలకు 15000 లోపు వేతనం పొందుతున్న వారందరూ ఈ కోవలోకి వస్తారు. దేశ ఆర్థికాభివృద్ధిలో
భాగస్వాములు అయిన అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే బాధ్యత కేంద్ర,రాష్ట్ర
ప్రభుత్వాలదే.

బాబు
బీమా లేదు ధీమా

చంద్రన్న
బీమా పేరుతో చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. ఇంతకీ చంద్రన్న బీమా రాష్ట్ర ప్రభుత్వ
పథకం కాదు. అది కేంద్రప్రభుత్వ పథకంలో భాగం. కానీ బాబు దానికి చంద్రన్న బీమా అంటూ భీభత్సమైన
ప్రచారం చేసుకున్నాడు. పైగా ఆ ప్రచార ఆర్భాట ఖర్చంతా భవన నిర్మాణ కార్మికుల నిధుల్లోంచి
ఖర్చుపెట్టాడు. అంటే ఏ శ్రామికులకైతే ప్రయోజనకరమైన పథకం అని ఊదరగొట్టారో…వారి ప్రయోజనాలకే
గండి కొడుతున్నారన్నమాట. ఇక కేంద్రం పథకాలకు బాబు పచ్చరంగు పులుముకోవడాన్ని చూసి చిర్రెత్తుకొచ్చిన
బిజెపి బాబు సర్కార్ కు అల్టిమేట్టం కూడా ఇచ్చింది. దాంతో ముఖ్యమంత్రి నాలుక్కరుచుకుని
చంద్రన్న బీమాను కాస్తా ప్రధానమంత్రి చంద్రన్న బీమాగా మార్చారు.

దగా
చేసిన బాబు బీమా

బీమా
పథకం కోసం ఇంటింటి సర్వే చేపట్టారు. అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ కూడా నిర్వహించారు.
ఇంతా చేస్తే రెండు కోట్లమందిగా ఉన్న శ్రామికుల్లో కనీసం సగం మంది పేర్లను కూడా నమోదు
చేయలేకపోయారు. ఇక నమోదు చేసుకుని, బీమా తీసుకుని, ప్రీమియంలు కట్టిన వారికి సైతం బీమా
ఫలాలు అందలేదు. కొన్ని చోట్ల బీమా ప్రీమియంలను వసూలు చేసిన సిబ్బంది ఆ డబ్బును సకాలంలో
సంబంధిత శాఖలకు చెల్లించకపోవడంతో  బీమా ప్రయోజనాలు
లబ్దిదారులకు అందకుండా పోయాయి. ఇక క్లెయిముల విషయంలో ప్రైవేటు బీమా సంస్థలు లబ్దిదారులను
నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రకరకాల కొర్రీలు పెట్టి క్లెయిము మీకు
వర్తించందంటూ బుకాయిస్తున్నాయి. చంద్రబాబు చిత్త శుద్ధి ఏమిటో ఈ బీమాలో లొసుగుల చూస్తేనే
అర్థం అవుతుంది. సహజ మరణాలు 50 ఏళ్ల లోపు జరిగితేనే వారికి 2లక్షల బీమా అందుతుందట.
అంటే ఏభైఏళ్లు పైబడ్డ వాళ్లు మరణిస్తే ఈ బీమా వల్ల పైసా ప్రయోజనం ఉండదు. అలాగే వారి
పిల్లలకు వచ్చే స్కాలర్ షిప్ కూడా ఉండదు. అసంఘటిత కార్మిక రంగానికి ధీమా చంద్రన్న బీమా
అంటూ బీరాలు పోయిన టిడిపి ఈ పథకాన్ని వారి ప్రయోజనాలకు కాకుండా, ప్రచారానికి, ప్రైవేటు
బీమా సంస్థల లాభాలకోసం ఏర్పాటు చేసినట్టు అర్థం అవుతోంది.

శ్రామికులకు
ఒరిగిందేమిటి?

బాబు
హయాంలో చిన్న, పెద్ద పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వాటి పనిచేసే కార్మికులకు ఆధారం పోయింది.
వ్యవసాయం దండగ అంటూ బాబు వ్యవసాయాధారిత రంగంలో ఉన్న లక్షలాది మంది శ్రామికుల కడుపు
కొట్టాడు. ప్రభుత్వ సంస్థలను దివాళా తీయించడం ద్వారా వేలాది మందిని రోడ్డుపాలు చేసాడు.
చేతి వృత్తుల నడ్డి విరిచాడు. ఉపాధి లేకుండా చేసాడు.

వైఎస్సార్
చేయూత

నాడు
వైఎస్సార్ హయాంలో పరిశ్రమల అభివృద్ధికి రాయల్టీని తగ్గించారు..కార్మికుల కోసం ప్రాధమిక
ఆరోగ్య కేంద్రాలను మెరుగు పరిచారు. వైఎస్ ముందు పాలకులెవ్వరూ సఫాయీ, చర్మకారుల, పారిశుద్ధ్య
కార్మికుల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదు. వారికి జీతాలు మూడు నాలుగు నెలకోసారి
అందేవి. అది తెలుసుకున్న వైఎస్సార్ వారికీ ప్రభుత్వోద్యోగులకు ఇచ్చినట్టే ట్రెజరీ ద్వారా
జీతాలు చెల్లించే ఏర్పాటు చేసారు. భవన నిర్మాణ కార్మికుల కోసం బిల్డింగ్ కనస్ట్రక్షన్
బోర్డు ఏర్పాటు చేసి చట్టం చేసారు. వారందరికీ గుర్తింపు కార్డులిచ్చి, ఇళ్లు కట్టించి,
వారి భవిష్యత్ కు భద్రత కల్పించే విధంగా చట్ట పరిధిలోకి తెచ్చారు.

వైఎస్
ఆశయాలకు, సంక్షేమ పాలనకూ వారసుడిగా నిలుస్తానని చెప్పే వైఎస్ జగన్ సైతం ఆదే బాటలో ముందుకు
సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించారు.
చేనేతలకు రాయితీలు పెంచుతామని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.  అసంఘటిత రంగ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని
హామీ ఇచ్చారు.

 

 

 

Back to Top