– మూడేళ్లలో జరగని అభివృద్ధిని.. మూన్నెళ్ల మంత్రి చేస్తాడంట
– కోతల్లో తండ్రిని మించిపోతున్న లోకేష్ నాయుడు
అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు.. అడ్డంగా పడుకున్నా అభివృద్ధి జరిగి తీరుతుంది.. రాబోయే రెండేళ్లలో పది లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం.. రాష్ట్రాన్ని తాగునీటి సమస్య లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతాం.. ఇదంతా ఏమనుకుంటున్నారా. మన మాన్య మంత్రి వర్యులు లోకేష్ నాయుడు చేసిన ప్రతిజ్ఞలు. మంత్రి పదవి చేపట్టి ఇప్పటికి కనీసం గట్టిగా మూడు నెలలు కూడా గడవలేదు కానీ మాటల్లో మాత్రం చంద్రబాబును మించిపోయాడు. మంత్రి పదవిలో కూర్చోగానే చేతికి మంత్రదండం వచ్చేసినట్టు రాష్ట్రాన్ని మొత్తం రాబోయే రెండేళ్లలో మార్చేస్తానని దంచేస్తున్నాడు. ఇదంతా తండ్రి దగ్గర్నుంచి పుణికిపుచ్చుకున్న ఆరంభ శూరత్యం తప్ప ఆయన గారొచ్చి ఇరగదీసేది ఏమీ ఉండదనేది పార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్లతో సహా ఏపీ ప్రజలని ఎవర్నడిగా లోకేష్ గురించి చెబుతారు. పైన లోకేష్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తే నవ్వకుండా ఉండకపోరు. లోకేష్‌పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం అదే. కొడుకు దేవాన్ష్‌తోపాటు లోకేష్ కూడా ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాడు.
మూడేళ్ల పాలనలో ఏం చేశారో..
రాబోయే రెండేళ్లలో ఉద్యోగాలిస్తాం.. పదేళ్లలో అమరావతిని అమెరికా చేస్తాం.. యాభై ఏళ్లలో ప్రపంచంలో పెద్ద నగరం చేస్తాం.. ఎప్పుడూ ఈ పనికి మాలిని నస తప్పించి గడిచిన మూడేళ్లలో ఏం చేశారో చెప్పుకునే ధైర్యం లేదు. నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభం ఉంది. దేశంలోకెళ్లా సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిని అని జబ్బలు చరుచుకునే చంద్రబాబుకే మూడేళ్ల పాలనపై మాట్లాడే ధైర్యం లేదు. ఈయనగారొచ్చి రెండేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తారంట. జనాల్లోకి వస్తే ఏం మాట్లాడతారో తెలీదు..ఏ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థంకాదు. ఠపీమని అడిగితే దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి.. రాష్ట్రంలో ఎన్ని దేశాలున్నాయో కూడా చెబుతాడో లేడోనని చాలా మందికి అనుమానం. ఆయన మీద ఇప్పటికీ చంద్రబాబుకే నమ్మకం కలగలేదు కానీ ఆయనొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంటే నమ్మడానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకుని సిద్ధంగా లేరన్నది వాస్తవం.
ఎప్పుడూ పాత పాటే...
అప్పుడు ప్రధాని పదవిని వదులుకున్నాను.. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశాను.. సెల్‌ఫోన్ కనిపెట్టాను.. మీ మరుగుదొడ్లో నా ఇంటి నుంచి లైట్లు ఆన్ ఆఫ్ చేస్తాను.. ఇదే పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి సొల్లు తప్ప మరొకటి లేదు. సింగపూర్, జపాన్ అంటూ కాలక్షేపం చేస్తూ చివరకు అమరావతిలో మూడేళ్లలో రెండు మూడు తాత్కాలిక భవనాలు నిర్మించిన ఘనుడు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తిచేస్తామని చెప్పినా దానిని రాయపాటి దిక్కుమాలిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకిచ్చి ఎంత నాశనం చేశాడో మర్చిపోలేం. పైగా పట్టిసీమ కాలువను నది అని... దానికే స్పిల్ వేలు, కాపర్ డ్యామ్‌లు కట్టి చేసిన కంపు అంతా ఇంతా కాదు. పబ్లిసిటీ కోసం గుర్తొచ్చినప్పుడల్లా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన శంకుస్థాపనలకైతే లెక్కేలేదు. ఇదంతా పక్కనపెడితే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు, నిధులు దక్కించుకునే పోరాటం ఒక్కటీ చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి నోరు మెదపరు. విశాఖకు రైల్వే జోన్ వంటి హామీలు హక్కుగా రావాల్సి ఉన్నా ఓటుకు నోటు కేసులకు భయపడి కేంద్రానికి దాసోహమైపోయాడు. రాజకీయ చాణక్యంలో నాకంటే మించినోడు దేశంలోనే లేడని గప్పాలు కొట్టుకునే చంద్రబాబునే మించిపోయాడు లోకేష్ నాయుడు. రెండేళ్లలో అద్భుతాలు చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతూ మాయల పకీర్ లా మాట్లాడుతున్నారు.