అఖిలాండ అబద్ధాల హరి

  • బాబు, మంత్రుల  చిల్లర రాజకీయాలు
  • ప్రతిపక్షాన్ని బద్నాం చేసేందుకు కుయుక్తులు
  • జగన్ కు వస్తున్న జనప్రవాహాన్ని చూసి ఓర్వలేకపోతున్న తమ్ముళ్లు
  • అఖిలప్రియను అడ్డుపెట్టుకొని రాజకీయాలు
  • పచ్చమీడియాతో అసత్యపు ప్రచారాలు
వైయస్‌ఆర్‌సీపీని బద్నాం చేయడానికి టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలకు తెరలేపింది. వైయస్ జగన్ కు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది.  అమరావతిలో అన్నదాతకు జననేత అండగా నిలవడంతో దావోస్ బాబు ఓర్వలేకపోయారు.  తాను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసేందుకు కట్టుకథలు అల్లుతున్నారు. పచ్చ మీడియాలో గ్రాఫిక్‌ వీడియోలతో దొంగ నాటకాలకు తెరతీశారు. వైయస్ జగన్ రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, రైతు కూలీలతో  రోడ్డంతా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈనేపథ్యంలోనే అదే దారిలో వస్తున్న ఎమ్మెల్యే అఖిల ప్రియ వెళ్లలేక వెనుదిరిగారు. ఇంకేముంది ప్రతిపక్ష పార్టీపై బండలు వేసేందుకు బాబు డైరక్షన్ లో పచ్చమంత్రులు కుట్రలకు పదును పెట్టారు. అఖిలప్రియ కారుపై దాడి చేశారంటూ  అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను ఉసిగొల్పి  వైయస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. అఖిలప్రియపై దాడిగా చిత్రీకరించేందుకు బాబు ఎల్లో మీడియా కిందా మీద పడుతోంది. ప్రతిపక్ష నేత ఎలుగెత్తిన రైతు సమస్యలను టెలికాస్ట్ చేయాల్సిన పచ్చమీడియా అది వదిలేసి అఖిలప్రియపై దాడి అంటూ బ్రేకింగులు కొట్టడం సిగ్గుచేటు.  చంద్రబాబు పాలన, జీవితమంతా కుట్ర రాజకీయాలతోనే నడుస్తోందనడానికి మచ్చుతునకలెన్నో.  

మహిళల మీద దాడులన్నీ టీడీపీ పుణ్యమే... 
టీడీపీ అధికారం వెలగబెట్టడం మొదలైన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పచ్చ కామాంధుల వికృత చేష్టలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో ఏ మూలన మహిళల మీద దాడి జరిగినా అందులో టీడీపీ పాత్ర లేకుండా లేదు. ఒక వివరాల్లోకి వెళితే... దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మహిళా తహశీల్దార్‌ వనజాక్షిని జట్టుపట్టి ఈడ్చి కొట్టినా ఆమె కూడా ఒక మహిళ అన్న సంగతి మరిచిపోయినట్టున్నారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరులో మొదటి ర్యాంకు ఇచ్చి సత్కరించాడు. చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా ఆడియో వేదికపై మహిళల గురించి కడుపుల చేయాలి అని అసభ్యంగా మాట్లాడింది గుర్తులేదు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సెల్‌టవర్‌ తీసేయాలని నిలదీసిన మహిళపై మైకు విసిరింది మరిచిపోయారు. అనకాపల్లిలో టీడీపీ నాయకులు కారుతో ఢీకొట్టి ఓ మహిళ నిండు ప్రాణాల్ని బలిగొంటే అధినాయకుడే రంగంలోకి దిగి పంచాయతీ చేస్తే ఈ ఛానళ్లన్నీ నోట్లో మట్టి గడ్డలు కుక్కుకున్నాయి. ఏఎన్‌యూలో ర్యాగింగ్‌ భూతానికి రిషితేశ్వరి అనే విద్యార్థిని బలైపోతే ఆమె ప్రాణాన్ని ఒక ప్లాటుతో వెలకట్టారు. నిందితుడు బాబూరావును ఇటీవల తిరుపతిలో జరిగిన జాతీయ సైన్సు కాంగ్రెస్‌లో సత్కారాలు చేశారు. 

టీడీపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు హైదరాబాద్‌లో ఓ ముస్లిం మహిళను చేయి పట్టి లాగి కుక్క కథ చెప్పి తప్పించుకున్నారు. రావెల కిశోర్‌బాబు, ఆయన అనుచరుల ఆగడాలను తట్టుకోలేకపోతున్నామంటూ రెండు సార్లు మీడియా ముందుకొచ్చి టీడీపీ నాయకురాలు జానీమూన్‌ అరిచి గీపెట్టినా... వారి నుంచి ప్రాణహాని ఉందని గగ్గోలు పెట్టినా పట్టించుకున్న మీడియా లేదు. మీడియా సమావేశాన్ని లైవ్‌ కవరేజీ ఇచ్చేసి చేతులు కడిగేసుకుంది పచ్చ మీడియా. పార్టీలో తోటి నాయకుల వేధింపులకు తాళలేక మాచర్ల జడ్పీ చైర్‌ పర్సన్‌ శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్నా చలనం లేదు. సాక్షాత్తు చంద్రబాబు పుత్ర రత్నం లోకేష్‌కు చెప్పుకున్నా ఆమెకు న్యాయం జరగకపోగా నిండు ప్రాణం తీసుకుంది. అది మరవక మందే బాపట్ల విజేతమ్మను పదవుల కోసం తెలుగు గుంటూరు జిల్లా అధ్యక్షుడు బెదిరించిన విషయం బయటకొచ్చింది. తోటి ఎమ్మెల్యే రోజాను మహిళ అని కూడా చూడకుండా అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు తాగుబోతుల్లా పిచ్చి కూతలు కూసిన బోండా ఉమపై ఎలాంటి క్రమశిక్షన చర్యలు ఉండవు. సెక్స్‌ రాకెట్‌లో అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చంద్రబాబు అండదండలు. ఇలా ఒకటేమిటి రాష్ట్రం నలుమూలల మహిళల మీద ఏ అఘాయిత్యం జరిగినా మొదట వినిపించేది టీడీపీ నాయకులు, కార్యకర్తల పేర్లే. 

అఖిల నోట నిన్నొక మాటా.. నేడొక మాట
ఇక భూమా అఖిల ప్రియ విషయానికొస్తే దాడి జరిగిందని ప్రచారం చేసుకుంటున్న రోజున చెప్పిన మాటలకు.. ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుంది. తొలి రోజు కారును అడ్డుకున్నారని చెప్పుకొచ్చిన అఖిలమ్మ ఇప్పుడు ఉన్నట్టుండి మాట మార్చేసింది. ఎకాఎకిన తనపై వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ మైలేజీ కోసం నక్కల గుంపులో చేరి దొంగ ఏడుపులు ఏడుస్తుంది. నిరసన తెలియజేసిన విషయాన్ని దాడిగా చిత్రీకరించేందుకు ఉడికీ ఉడకని కథనాలు వండి వడ్డిస్తున్న పచ్చ మీడియా అండ చూసుకుని ఎగిసి పడుతున్న అఖిల ప్రియ ఒకసారి గతంలోకి వెళ్లి చూసుకుంటే మంచిదని సొంత నియోజకవర్గ ప్రజలు సూచిస్తున్నారు . అండగా నిలిచింది ఎవరో, అంతు చూస్తామని బెదిరించింది ఎవరో తెలుసుకుని మెసులుకోవాలని హెచ్చరిస్తున్నారు. 
Back to Top