నాయకుడు V/s వంచకుడు

 పులి ఎక్కడైనా పులే. వైయస్ రాజశేఖర్
రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన హుందాతనం ఎప్పుడూ మారలేదు. అసెంబ్లీలో ఆయన గళం వాడి ఎప్పుడూ తగ్గలేదు. విపక్ష నేతగా
ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడంలోనూ, పాలక పక్షంలో ఉండి ప్రతిపక్షాన్ని
నిలువరించడంలోనూ ఆయనకు ఆయనేసాటి. అధికారంలో ఉన్నా లేకున్నా సభలో
వైరి పక్షాన్ని తనదైన శైలిలో ఎదుర్కోవడం వైయస్ఆర్ కు అలవాటు.

 హత్యా రాజకీయాలపై

 ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి
చంద్రబాబును అసెంబ్లీలో కడిగేసేవారు వైయస్ఆర్. తమ పార్టీ కార్యకర్తలపై నేతలపై,
అధికారపక్ష నేతలు చేసిన దౌర్జన్యాలు, చేయించిన
హత్యలపై ముక్కుసూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉండి కక్ష రాజకీయాలు
చేస్తున్న చంద్రబాబును తూర్పారపట్టారు. 
ప్రభుత్వం  దమన నీతి ప్రయోగించినా, తాము మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగానే  పోరాడతామని అసెంబ్లీ సాక్షిగా సగర్వంగా
ప్రకటించిన ఘనుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే వైఎస్ ముఖ్యమంత్రిగా
ఉన్నప్పుడు చంద్రబాబు హత్యారాజకీయాల అభియోగాన్ని వైయస్ఆర్ పై మోపినప్పుడు రిఫరెండమ్
కు తాను సిద్ధమే అని, డేట్లు కూడా ఇస్తాను అని అదే అసెంబ్లీలో
సవాల్ విసిరారు. ఇందులో ఎవ్వరు ఓడిపోయినా రాజకీయాలనుంచి బైటకు
పోదాం సిద్ధమా అంటూ చంద్రబాబును నేరుగా ప్రశ్నించారు. ఈ తెగువను
చంద్రబాబు ఏనాడూ చూపించలేకపోయారు.

 దర్యాప్తు విషయంలో

 ప్రతిపక్షంలో ఉన్నసమయంలో
ప్రజా సమస్యలపై వైయస్ఆర్ పోరాడిన తీరు అమోఘం. కరెంటు బిల్లుల విషయంలో,
ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం గురించి ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ
వేయమని కోరారు వైయస్ఆర్. ప్రైవేటు సంస్థలంటే మీకు ఎందుకంత ప్రేమ
అని ముక్కుసూటిగా ప్రశ్నించారు. నాడు అధికారంలో ఉన్న టిడిపి అందుకు
సిద్ధపడలేదు. బిల్లుల వ్యవహారం అంతా ఆ ప్రైవేటు యాజమాన్యాల స్వవిషయం
అని కప్పదాటు సమాధానాలు ఇచ్చింది. తమ ప్రభుత్వ నిర్ణయాలు,
చర్యలపై పారదర్శకత కోరినప్పుడల్లా చంద్రబాబు నోరు మెదపకపోవడం మామూలే.
కానీ వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వచ్చినా
దీటుగా ఎదుర్కున్నారు. విశ్వసనీయ పాలనను అందిస్తున్నామని చెప్పడమే
కాదు, అవసరమైతే దర్యాప్తులకు అయినా సిద్ధం అని ప్రకటించారు.

 వ్యక్తిత్వంలో

  ప్రాంతీయ పార్టీలతో పొత్తు విషయంలో పార్టీ అధిష్టానంతో  విబేధించి ఒంటరిగా ఎన్నికల బరిలోకి
దిగిన ధీరుడు వైఎస్సార్. తాను ఎంపిక చేసిన అభ్యర్థులందరినీ ఖరారు
చేయించుకుని రాజీలేని తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. ఇక
చంద్రబాబు తనపై ఉన్న కేసుల నుంచి బైటపడటానికి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న విషయం
ఎవ్వరికీ తెలియంది కాదు. ఇటీవల ఆ విషయాన్ని స్వయంగా చిదంబరమే
పార్లమెంటులో బైటపెట్టారు. ఓటుకు నోటు విషయంలో కేసిఆర్ కు భయపడి
విజయవాడకు పరిగెత్తి పారిపోయి వచ్చాడు చంద్రబాబు. రాజధాని భూములు,
ప్రాజెక్టుల అంచనాల పెంపు, కమీషన్ల దందా మొదలైన
కేసులన్నిటినీ కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకోవడంతో మోదీ ప్రభుత్వానికి సాగిల పడుతున్నాడు
బాబు. రాజీ రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు అయితే, రాజీలేని వ్యక్తిత్వానికి వైయస్ నిదర్శనం. 

 సంక్షేమ పథకాల్లో

ప్రజా సంక్షేమం అంటేనే చంద్రబాబుకు
చిన్నచూపు.
తానో హైటెక్ సిఎమ్ గా, హైదరాబాద్ ముఖ్యమంత్రిగా,
రాష్ట్రానికి సిఇఓగా పిలిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమ పాలన
జరపడంలో ఏమాత్రం చూపించలేదు చంద్రబాబు. అమెరికా అధ్యక్షులతో కలిసేందుకు
చంద్రబాబు ఉవ్విళ్లూరేవాడు. ప్రపంచబ్యాంకుకు రాష్ట్రాన్ని తాకట్టు
పెట్టాడు. అధికారులను అవమానిస్తూ, ఉద్యోగులను
పీడిస్తూ, ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ సాగిన చంద్రబాబు పాలనను
చీకటి రోజులుగా గుర్తుంచుకున్నారు తెలుగు ప్రజలు. చంద్రబాబు హయాంలో
భయంకరమైన కరువును తలుచుకుంటే బాబుది భస్మాసుర హస్తం అని నమ్మక తప్పదు అంటారు.
సంక్షేమ పథకాల విషయంలో వైయస్ కు చంద్రబాబుకు పోలికే లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు టైమ్ లో బడ్జెట్ లో 1200కోట్లు మాత్రమే కేటాయిస్తే, వైయస్ హయాంలో
10,000 కోట్ల నుంచి 14,000 కోట్ల కేటాయింపులు జరిగాయి.
ప్రజారోగ్యం, విద్య, మహిళా
సంక్షేమం, ఉపాధి, రైతు రుణాలు ఇలా ఎందులో
పోల్చి చూసినా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన మిన్నగా కనిపిస్తుంది. బడ్జెట్ కేటాయింపులు, పథకాల అమలు, అధికారులతో పని చేయించుకోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకోవడంలో
వైయస్ ను మించిన వారు లేరు.

ప్రజలు మెచ్చిన నాయకుడు, చట్ల సభల్లో
అసలైన రాజకీయవేత్త, వైరి పక్షానికి సింహస్వప్నం వైయస్ రాజశేఖర్
రెడ్డి. ఆయన చూపిన ధీరోదాత్తమైన బాటలో సాగుతున్నారు వైయస్ జగన్.
అనుకూల, ప్రతికూల సమయాల్లో చెదరని సంకల్పంతో విలువలు,
విశ్వసనీయత నిండిన రాజకీయాల కోసం పోరాడుతున్నారు. 

Back to Top