మూడేళ్లు కాలేదు కానీ మూడిళ్లు మారిన ఘనత

() ఫైవ్ స్టార్ హోటల్ లో బస
చేస్తున్న చంద్రబాబు

() నెలకు రూ. 5లక్షల దాకా
బిల్లు

() ఇప్పటికే నివాసాలకు రూ.
92 కోట్ల ఖర్చు

() విజయవాడలోనూ అదే తీరు

() ప్రజల ఖర్చుతో బాబు
సోకులు

హైదరాబాద్) ముఖ్యమంత్రి
చంద్రబాబు విలాసాల తీరు నానాటికీ వివాదాస్పదం అవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని
పార్క్ హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నే నివాసంగా మార్చుకోవటం మీద విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం తగ్గటం లేదు.

          ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ చంద్రబాబు జూబ్లీ
హిల్స్ రోడ్ నెంబర్ 65 లో నివాసం ఉండేవారు. దీనికి రూ. 2 కోట్లు ఖర్చు పెట్టాక, ప్రభుత్వ
ఖర్చులతో భవంతి ఏర్పరచుకొనే ఆలోచన చేశారు. దీంతో ఆ ఇంటిని కూల్చివేస్తున్నట్లు
ప్రకటించి, అద్దె ఇంట్లోకి మారారు. ఎప్పటిలాగానే ప్రభుత్వ ఖర్చులతో ఈ భవంతికి
అన్ని రకాల హంగులు కల్పించారు. రెండు కోట్ల రూపాయిలతో సౌకర్యాలు కల్పించాక, అక్కడ
నుంచి మదీనా గూడ లోని ఫామ్ హౌస్ కు మకాం మార్చాలని సంకల్పించారు. ఇంకేముంది,
మరొక్కసారి కోట్ల రూపాయిలు కరిగిపోయాయి. దాన్ని పూర్తి స్థాయి నివాసంగా ప్రకటించి,
మరీ హంగులు కల్పించారు.

          ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉండే పార్క్
హయత్ హోటల్ లో మకాం చేయాలని సంకల్పించారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు, మంత్రులు
ఫైవ్ స్టార్ హోటల్ లో 2,3 రోజులు విడిది చేయటం చూశాం కానీ, ఏకంగా స్టార్ హోటల్ నే
క్యాంపు కార్యాలయంగా చేసేసుకొన్న ఘనత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే ఈ
ఖరీదైన నివాసానికి ఖర్చంతా ప్రజలదే అని గమనించాలి. లేదంటే అక్కడ మెనూ చూస్తేనే
అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. అటువంటి చోట బాబు నివాసానికి ఎన్నికోట్లు ఖర్చు
అవుతుందో వేరే లెక్కలు చెప్పనవసరం లేదు. దీనికి అద్దె రోజుకి రూ. 30వేల దాకా
అవుతుంది. ఆ లెక్కన చూసుకొంటే సగటున రూ. 5 లక్షల దాకా నెల బిల్లు వచ్చి పడుతుంది.
పన్నులు, ఆహారపు బిల్లులు దీనికి అదనం.         

          అటు రాజధాని ప్రాంతంలోనూ చంద్రబాబు నివాసం వివాదాస్పదం
అవుతోంది. విజయవాడ క్యాంపు కార్యాలయానికే ప్పటిదాకా 42 కోట్లు ఖర్చు పెట్టారు.
హైదరాబాద్ సచివాలయంలో 20 కోట్లు పైగా ఖర్చయింది. తాడేపల్లి లోని చంద్రబాబు
నివాసానికి రూ. 10 కోట్లు తగలేశారు. మొత్తం మీద ఇప్పటిదాకా చంద్రబాబు నివాసాలు,
సొంత కార్యాలయాలకు రూ. 92 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ప్రజల సొమ్ముల్ని
విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న చంద్రబాబు, పైకి మాత్రం చాలా నీతులు
వల్లిస్తున్నారు. ఉద్యోగులు త్యాగాలు చేయాలని, ప్రజలు పొదుపు చేయాలని సూక్తులు
చెబుతున్నారు. 

Back to Top