కృష్ణాతీరంలో కడగళ్లు

ప్రజా సంకల్ప
యాత్రలో వైఎస్ జగన్ గుంటూరు జిల్లా లోని 61 నియోజక వర్గాల గుండా పాదయాత్ర చేసారు. 102
మండలాల పరిధిలోని 904 గ్రామాల మీదుగా ప్రజా సంకల్పం సాగింది. బాపట్ల, పొన్నూరు, పత్తిపాడు,
చిలకలూరిపేట, నరసరావు పేట, తెనాలి, మంగళగిరి మొదలైన 11 చోట్ల బహిరంగ సభలు జరిగాయి.
ప్రతి సభలోనూ గుంటూరు ప్రజల గుండెచప్పుడు సముద్రంలా హోరెత్తింది. ప్రభుత్వ వ్యతిరేకతను
గొంతెత్తి వినిపించింది. ప్రజా సంకల్పయాత్రలో 136వ రోజున వైఎస్ జగన్ గుంటూరును దాటి
కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు.  ఆ యువనేతకు
స్వాగతం చెప్పేందుకు అశేషంగా తరలివచ్చిన జనులతో విజయవాడలోని వారధి మీద ప్రవాహం సాగుతోందన్నట్టుగా
మారిపోయింది. బెజవాడ కనకదుర్గ ఆశీశ్సులతో ప్రతిపక్షనేత కృష్ణా జిల్లా లో తన పాదయాత్రను
కొనసాగిస్తున్నారు.

బాబు కట్టిన
భ్రమరావతిపై జగన్ ఆగ్రహం

కృష్ణాజిల్లాలో
అడుగుపెట్టిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవాడ నడిబొడ్డున భారీ
బహిరంగ సభలో ప్రజకంటక విధానాలను ఎండగట్టింది. బాబు ఏదేశానికి వెళితే ఆ దేశం సినిమా
చూపించాడని, సినిమా సెట్టింగులు చూసి రాజధాని కడతానంటాడని, ఇంత వరకూ రాజధానికి శాశ్వత
నిర్మాణం ఒక్కటంటూ లేదని అనగానే కృష్ణా ప్రాంత ప్రజలంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.
రాజధాని తమ జిల్లాలో ఉందని, గొప్ప రాజధానిని చూడబోతున్నామని ఆశపడి, మోసపోయామంటూ విజయవాడ
వాసులు ఆవేదన చెందారు. బాబును నమ్మినందుకు నయవంచనే దక్కిందని యువనేత ముందు తమ గోడు
వెళ్లబోసుకున్నారు.

రాజధాని జిల్లా
సమస్యల ఖిల్లా

అభివృద్ధిలో
అంతరిక్షాన్ని చూపించడం చంద్రబాబు అలవాటు. అందుకే రాజధాని ఉన్న కృష్ణా జిల్లా అపర కుబేర
ప్రాంతం అని, అక్కడెవ్వరికీ కష్టాలే లేవని ముఖ్యమంత్రిగారు శెలవిస్తుంటారు. కానీ ప్రభుత్వం
కొలువుదీరిన ప్రాంతంలోనే అవినీతి రాజ్యమేలుతోందని, సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని
ప్రతిపక్ష నేతకు నేరుగా వివరించారు బాధితులు. విజయవాడను ఆనుకునే ఉన్న పల్లెల్లో తాగు,
సాగు నీరుకు కటకటగా ఉందని వైఎస్ జగన్ కు ఆ గ్రామాల వాసులు చెప్పుకొచ్చారు. స్వయంగా
నీటిపారుదల శాఖా మాత్యులు దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహించే ఈ ప్రాంతంలో కనీసం పశువులకు
నీరు కూడా దొరకని కరువు పరిస్థితి ఉందని వాపోయారా ప్రాంతవాసులు. అధికార టిడిపి నేతల
అవినీతి గ్రామాల్లో కుల వృత్తుల వారికి జీవనాధారాన్ని దూరం చేస్తోందని కొందరు ప్రతిపక్ష
నేత వద్ద వాపోయారు. కుమ్మర్లు కుండలు చేసుకునేందుకు చెరువు మట్టిని కూడా తీసుకోనీకుండా
అధికారపార్టీ నేతలు కబ్జాలు చేసి, ఇసుక మట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
రాజధాని రైతులు భూములు కోల్పోయి, పరిహారాలు అందక ఓపక్క దగా పడితే, మిగిలిన ప్రాంతాల
రైతులు గిట్టుబాటు ధరలేక విలవిల్లాడుతున్నారని కృష్ణా జిల్లా ప్రాంత రైతులు తమ సమస్యలను
వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. పాడిరైతుల కడుపు కొట్టిన పాపం కూడా బాబుదే అంటూ ఆవేదన
వ్యక్తం చేసారు తూర్పు కృష్ణాప్రాంతపు పాడి రైతులు. టిడిపి అధికారంలోకి వచ్చేవరకూ సక్రమంగా
నడిచిన కృష్ణవేణీ డైరీ, ఉన్నపళంగా నష్టాలకు గురై మూతపడిందని, ఆ డైరీ ఉద్యోగులు వైఎస్
జగన్ కు వివరించారు. సహకార డైరీలను నష్టాల్లోకి నెట్టి హెరిటేజ్ కంపెనీ ఆస్తులు పెంచుకుంటోందని
వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన అవినీతి చెప్పనలవి కాదని
కొందరు చెప్పగా, ఫెర్రీ బోటు ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అని, ఇంత వరకూ
బాధితులకు న్యాయం జరగలేదని మరి కొందరు వివరించారు.

హోదా కోసం ఎపి
బంద్

ఓ పక్క ప్రజా
సంకల్ప పాదయాత్ర సాగుతుండగానే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్
అధినేత వైఎస్ జగన్. తన పార్టీ ఎమ్.పిలతో పార్లమెంట్ లో చేయించిన పోరాటం, కేంద్రంపై
అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు, ఆమరణ నిరాహరదీక్షల అనంతరం, అఖిలపక్షం పిలుపునందుకుని
ఎపి బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హోదా కోసం జరిగే ఉద్యమానికి పూర్తి మద్దతు
ఉంటుందని ఆయన చెప్పిన మాటను నిజం చేసి చూపించారు. చంద్రబాబు చేసే దొంగ దీక్షలకు, ఉత్తుత్తి
సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతివ్వదని స్పష్టంగా చెప్పారు ప్రతిపక్షనేత. హోదా
కోసం జరిగే అసలైన ఉద్యమాలలో తప్పక భాగస్వాములౌతామని కూడా ఎన్నోసార్లు వివరించారు. ఆ
మాట ప్రకారమే వామపక్షాలు, హోదా సాధనా సమితి, కాంగ్రెస్ లతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ఎపి బంద్ లో పాల్గొంది. బంద్ సందర్భంగా విపక్షనేత ప్రజా సంకల్పయాత్రకు విరామం
ఇచ్చారు. పాదయాత్ర శిబిరం నుంచే బంద్ ను పర్యవేక్షించారు. బంద్ ను విఫలం చేసేందుకు
ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ భగ్నం అయ్యాయి. బంద్ లో పాల్గొన కూడదంటూ పోలీసులు ఇచ్చిన
నోటీసులను బేఖాతర్ చేస్తూ అన్ని వర్గాలు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వ్యాపార,
వాణిజ్య, విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్ ను పాటించి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై
తమ వ్యతిరేకతను తెలియజేసాయి.

  

Back to Top