చంద్రబాబువి చిల్లర రాజకీయాలు

ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక కుట్రలు..
నీ బెదిరింపులకు భయపడేది లేదు..
దమ్ముంటే ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం రా..

మచిలీపట్నంః
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు.  ప్రతిపక్ష పార్టీ నేతలపై పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించి
చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేతలను,
కార్యకర్తలను భయపెట్టాలన్న పిచ్చిభ్రమలో చంద్రబాబు బతుకుతున్నాడని నాని
విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే గుడివాడకు వచ్చి తనపై పోటీ
చేయాలని సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాష్ట్రం వీడిపోతానన్నారు.

ప్రజాస్వామ్యంలో
ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక
చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని నాని మండిపడ్డారు.  వైఎస్సార్సీపీని
బలహీన పర్చాలన్న కుట్రతో చంద్రబాబు..అధికారులు, పోలీసులను అఢ్డుపెట్టుకొని
వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే
నెపంతో పోలీసులను తనపై ఉసిగొల్పారని, వారి బెదిరింపులకు, దౌర్జన్యాలకు
భయపడేది లేదన్నారు.

మచిలీపట్నం పోర్టు భూ సేకరణ,
ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన వైఎస్సార్సీపీ నేత
పేర్ని నానిపై అక్రమంగా మూడు కేసులు బనాయించి, జైలుకు పంపించారన్నారని
కొడాలి నాని అన్నారు. ప్రతిపక్ష పార్టీపై ప్రభుత్వం చేస్తున్న
ప్రజావ్యతిరేక చర్యలపై రాబోయే రోజుల్లో తమ పోరాటం కొనసాగుతుందని కొడాలి
నాని తెలిపారు.
Back to Top