కేటాయింపులే... ఖ‌ర్చు లేదు

ప్ర‌భుత్వం బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల కోసం వేల కోట్లు ఖ‌ర్చు కేటాయించింద‌ని గొప్ప‌లు చెబుతున్న చంద్ర‌బాబు ఆ డ‌బ్బుల‌ను మాత్రం ఖ‌ర్చు పెట్ట‌డం లేద‌నడానికి కాగ్ నివేదిక ఒక ఉదార‌హ‌ణ‌. బ‌డ్జెట్‌లో అనేక ప‌ద్దుల‌కు కేటాయింపులే త‌ప్ప వ్య‌యం మాత్రం శూన్యంగా ఉంద‌ని కంప్ట్రోల‌ర్ అండ్ అడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) నివేదిక రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టింది. 
అధికారంలోకి రాక‌ముందు రైతుల‌కు రుణామాఫీ, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు డ్వాక్రారుణాలు మాఫీ.... కొత్త రుణాలు మంజూరు, ఇంటికో ఉద్యోగం... నిరుద్య‌గో భృతి, కాపుల సంక్షేమానికి ప్ర‌త్యేక నిధులు రైతుల‌కు తిరిగి వ‌డ్డీలేని రుణాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్ద‌ది. అధికారం వ‌చ్చిన త‌ర్వాత రైతుల‌కు రుణామాఫీ చేస్తున్న‌ట్లు ఏకంగా సంత‌కం సైతం చేశారు చంద్ర‌బాబు. మ‌రి ఆ సంత‌కంతో రుణామాఫీ జ‌రిగిందా అంటే మాత్రం శూన్యం క‌నీసం ఆ రుణాల వ‌డ్డీకి సైతం స‌రిపోని నిధుల‌ను కేటాయించారు. 
రైతు రుణామాఫీ పేర 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో మూడు ప‌ద్దుల కింద రూ. 4,000 కోట్లు, 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో రైతుల రెండో విడ‌త రుణామాఫీ కోసం రూ. 4,300 కోట్లు బాబు కేటాయించారు.  కానీ రైతుల రుణామాఫీ నిమిత్తం మాత్రం ఒక రూపాయి కూడా వ్య‌యం చేయ‌లేదు. దీంతో ఆ మొత్తం నిధులు తిరిగి ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. 
ఇలా మొత్తం ఎన్ని కోట్లు...
రైతుల వ్య‌వ‌సాయ రుణామాఫీ, వైద్య విధాన ప‌రిష‌త్‌, రైతుల‌కు వ‌డ్డీలేని రుణాలు, పంట‌ల భీమా, ఎస్టీ విద్యార్థుల కోసం ప్ర‌త్యేక నిధులు, కాపుల సంక్షేమ నిధులు, మైనార్టీ స్కాల‌ర్‌షిఫ్‌లు, వ్య‌వ‌సాయ వ‌ర్సీటీలు, ఆస్ప‌త్రుల స్థాయి పెంచే నిధులు ఇలా 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్‌లో వివిధ రంగాల‌కు రూ. 8,082.67 కోట్లు కేటాయించిన టీడీపీ అందులో ఒక్క పైసా కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని కాగ్ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. కొన్ని నిధులు స‌రెండ‌ర్ చేయ‌డానికి ప‌రిపాల‌న అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చిన‌ప్ప‌టికీ, మ‌రికొన్ని నిధులు స‌రెండ‌ర్ చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం వివ‌రించ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. 
Back to Top