కరవు పేరుతో కుట్రలు..

రైతుల ప్రయోజనాలకు గండికొట్టేందుకే..!
రైతులపై చంద్రబాబు చిన్నచూపు..!

రైతులు అంటే చంద్రబాబుకి మొదట నుంచీ గిట్టదు. వ్యవసాయం అంటే దండగ అన్నది ఆయన అభిప్రాయం. దీన్ని ఆయన ఎప్పటికప్పుడు చాటుకొంటూ ఉంటారు. తాజాగా ప్రకటించిన కరవు మండలాల విషయంలో మరోసారి చంద్రబాబు నైజం బయటపడింది.రాష్ట్రమంతా తీవ్ర కరవుతో అల్లాడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ధాన్యాగారంగా పేరు తెచ్చుకొన్న క్రిష్ణా డెల్టా నే ఎండిపోతోంది. అక్కడ రైతులు విసిగిపోయి చరిత్రలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించారు. ఇక, రాయలసీమ గురించి చెప్పనే అక్కర లేదు. చుక్క నీరు లేక పొలాలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. రైతుల కళ్లలో కన్నీరు కూడా ఇంకిపోయింది. ఇటువంటి సందర్బాల్లో కరవు మండలాల్ని ప్రకటిస్తుండటం ఆనవాయితీ.

 చిత్తశుద్ధి లేని సర్కార్ ..!
అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా అంతటా పరిస్థితిని సమీక్షించి మొత్తం అన్ని మండలాల్లో కరవు ఉందని నివేదించారు. అలాగే అన్ని జిల్లా ల నుంచి గరిష్టస్తాయిలో వినతులు అందాయి. దీన్ని బట్టి దాదాపు 70..80 శాతం మండలాల్లో కరవు నెలకొందని అర్థం అవుతోంది. అంటే దాదాపు 700 మండలాల దాకా కరవు మండలాలు అవుతాయన్న మాట వ్యక్తం అయింది. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొంత మేర తగ్గించి 350 మండలాల దాకా కరవు బారిన పడ్డాయని ప్రకటించారు. కొన్ని వారాలు తిరగకుండానే ప్రభుత్వం నుంచి కరవు మండలాల ప్రకటన విడుదల అయింది.

ప్రయోజనాలు దక్కకుండా చేసేందుకే..!
రాష్ట్రం మొత్తం మీద ఈ రెండు నెలల్లో గట్టిగా వర్షాలు పడి పరిస్థితి కుదుట పడిన జాడ లేదు. సెప్టెంబర్ చివర్లో మాత్రం కొద్దిపాటి జల్లులు కురిశాయి. అంతమాత్రాన దాన్ని ప్రాతిపదికగా తీసుకొని కరవు మండలాల్ని తగ్గించేశారు. ఇందులోని అసలు కుట్ర ఏమిటి అంటే రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల్ని ఎగ్గొట్టడమే. ఇన్ పుట్ సబ్సిడీ వగైరా ప్రయోజనాలు రైతులకు ఇవ్వటం ఇష్టం లేని చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా కరవు మండలాల జాబితాను కుదించేసింది. 
Back to Top