కక్ష సాధింపుపై చంద్రబాబు సానుభూతి

 

ఎపి సిఎమ్ చంద్రబాబు
అప్పుడప్పుడూ అపర జ్ఞానావతారాన్ని ఎత్తుతుంటారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కేంద్రం కుట్రలు చేస్తోందనే
సత్యాన్ని బాబు గుర్తించారట.ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు
పాల్పడుతోందని కన్నీరు మున్నీరౌతున్నారు. పరోక్షంగా రేవంత్ రెడ్డి గురించే ఈ మాటలని ఎవ్వరికైనా
అర్థం అవుతుంది. అయితే,  మామూలుగానే మతిగతితప్పి తానన్నమాటలు
తానే మర్చిపోయే జబ్బు ఉన్న ఆయన, తాను చేసిన పనులు కూడా అంతే అలవోకగా మర్చిపోతుంటారు.

గతం మరిచిన బాబు

2014 ఎన్నికల ముందు వైఎస్ జగన్ పై అప్పటి కేంద్ర నాయకత్వం
కుట్రలు చేసినప్పుడు చంద్రబాబు నోరు మెదపలేదు. పైగా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో చేతులు కలిపి
కుట్రలు చేయడంలో తన వంతు భాత్యను పోషించాడు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్
హవాను తుడిచిపెట్టేందుకు, వైఎస్ జగన్ పై అన్యాయంగా, అక్రమంగా, ఆధారాలు లేని కేసులు
బనాయింపు కుట్రలకు సోనియాతో చీకట్లో చేతులు కలిపాడు చంద్రబాబు. లక్ష కోట్ల అవినీతి
అంటూ వైఎస్ జగన్ పై అసత్య ప్రచారాల కుట్రలకు పచ్చ మీడియాను పావుగా వాడుకున్నాడు. అలవి కాని హామీలు ఇచ్చి, కులాభిమానాన్ని ఉపయోగించుకుని 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి
వచ్చిన బాబు ఇప్పుడు ఎన్నికల ముందు కుట్రల గురించి మాట్లాడటం విడ్డూరమే.

నేటికీ మారని వైఖరి

మళ్లీ 2018 వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. చంద్రబాబు పొత్తుల కథ
ఓ కొలిక్కి వచ్చింది. వాడిన పార్టీని వాడకుండా వాడేసే బాబు 2014లో బిజెపిని వాడుకుని, 2018 రాగానే కాంగ్రెస్ వైపు
సైకిల్ ను తిప్పాడు. బిజెపిపై విమర్శలు మొదలెట్టాడు. తనకు అనుకూలమైన వారిని పొగడటం, వద్దనుకుని వదిలించుకునేవారిని తిట్టడం చంద్రబాబు
నైజం. ఒకప్పుడు తిట్టిన మోదీని తర్వాత నెత్తిన పెట్టుకున్న బాబు, రాష్ట్ర విభజన పాపం
కాంగ్రెస్ దే అని తిట్టిన నోటితోనే కాంగ్రెస్ తో పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుందని
అంటున్నాడు. కేంద్రంలో ఏ ఉన్నది ఏ ప్రభుత్వమైనా సరే తనకు అనుకూలంగా, తన అవసరాలకు ఉపయోగకరంగా
ఉండేలా ఒప్పందాలు చేసుకోవడమే చంద్రబాబుకు అలవాటు. కేంద్ర మంత్రి భర్తని సలహాదారుగా పెట్టుకోవడం, కేంద్ర దర్యాప్తు సంస్థల్లో
సమాచారాన్ని చేరవేసే వేగులని, చెప్పినట్టల్లా చేసే కోటరీని ఏర్పాటు చేసుకోవడం, న్యాయ వ్యవస్థలోని పెద్ద
తలకాయలను విందులతో మచ్చిక చేసుకోవడం బాబుకు తెలిసిన మేనేజ్ మెంట్ విద్యలు. ఈ విద్యలతోనే ఎన్నికలు
దగ్గర పడుతుండగా ప్రతిప నాయకుడు వైఎస్ జగన్, అతడి భార్య వైఎస్ భారతిపై మరోసారి బురదను చల్లే కుతంత్రాలకు
తెరతీసారు. కొత్త ఛార్జ్ షీట్ లంటూ విష ప్రచారం మొదలెట్టారు. ప్రజా సంకల్ప పాదయాత్ర
ఆరంభం లో పనామా పేపర్లంటూ, పేరడైజ్ పత్రాలంటూ ప్రజలను నమ్మించ బోయారు. కానీ ఈ సారి ఎన్నికలముందు
ఇలాంటి కుట్రలు కుతంత్రాలను ప్రజలే తిప్పి కొట్టారు. చంద్రబాబు ఎన్నికల ముందు నాటకాలకు కాలం చెల్లిందని
ఆ యువనేతకు తమ మద్దతను తెలుపుతూ ప్రకటించారు.

కుట్రల సంస్కృతి, వెన్నుపోటు చరిత్ర , అవినీతి అలవాటు, కుల దురహంకారం, అవకాశవాద రాజకీయంఇవన్నీ చంద్రబాబు పంచప్రాణాలు. చంద్ర బాబు జీవితంలో
ఈ ఐదూ లేని ఒక్క క్షణాన్నైనా చూపించలేము. అధికార దుర్వినియోగం, అవినీతిని వ్యవస్థీకృతం
చేయడం బాబు జమానాతోనే మొదలైంది. అలాంటి చంద్రబాబు నేడు కేంద్రం ఏదో కుట్రలు చేస్తోందంటూ
సన్నాయి నొక్కులు నొక్కడం దొంగే దొంగా దొంగా అని అరవడం లా ఉంది. హంతకుడే హత్యా అంటూ
వాపోవడం లా ఉంది. 

Back to Top