వైయ‌స్ హ‌యాంలో అభివృద్ధి శిఖ‌రాన 'క‌డ‌ప‌'

కడప జిల్లా నిర్లక్ష్యపు నీడలో మగ్గుతుండేది. వైయస్‌ను  ఎదుర్కోలేక ఎంద‌రో ముఖ్య‌మంత్రులు క‌డ‌ప జిల్లాను దూరంగా పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆయ‌న‌కున్న పాపులారిటీని చూసి ఓర్వ‌లేక ఆయ‌న్నుంచి ప్ర‌జ‌ల‌ను దూరం చేయాలంటే క‌డ‌ప‌ను వెనుక‌బ‌డిన జిల్లాగా మార్చాల‌నే త‌లంపుతో ప‌నిచేసేవారు. అయితే వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి పరుగులు తీసింది. మూడు ద‌శాబ్దాలుగా జ‌ర‌గ‌ని అభివృద్ధిని ఆయ‌న సీఎం కాగానే ఐదేళ్ల‌లో అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టించారు. రాజకీయంగా అండగా నిలిచిన జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా పయనింపజేశారు. మున్సిపాలిటీగా ఉన్న కడపను అప్‌గ్రేడ్ చేశారు. ఐదు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు. ట్రిపుల్ ఐటీ, 21వ శతాబ్దం గురుకులం, జెఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్యవిద్యా కళాశాల, యోగివేమన యూనివర్శిటీ, యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల లాంటి విద్యాసంస్థలను నెలకొల్పారు.

=>యురేనియం కర్మాగారం
=>ఐజీ కార్ల్ పశు పరిశోధనా కేంద్రం
=>దాల్మియా సిమెంటు కర్మాగారం
=>గోవిందరాజ స్పిన్నింగ్ మిల్స్
=>భారతీ సిమెంట్ కర్మాగారం
=>సజ్జల పాలిమర్స్
వంటి పరిశ్రమలను నెలకొల్పి పారిశ్రామిక ప్రగతిని సాధించారు.
దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు.
=> గాలేరు నగరి సుజల స్రవంతి
=> గండికోట టన్నెల్
=> గండికోట కెనాల్
=> అవుకు వరద కాల్వ
=> గండికోట ఎత్తిపోతల పథకం
=> తెలుగుగంగ
=> వెలిగల్లు ప్రాజెక్టు
=> మైలవరం ఆధునీకరణ
=> సర్వరాయసాగర్
=> సీబీఆర్
ప్రాజెక్టులాంటి పనులను శరవేగంగా చేపట్టారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేసి కడప ప్రజల హృదయాల్లో చిరకాలం వుండిపోయారు.
ప్రదమంగా చెప్పుగోదగునవి వైయస్సార్ హయాం లో జరిగిన పనులు వాటి వివరాలు
పట్టణీకరణ:
*********
1)కడపకు నగరపాలిక హోదా
2)బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, యర్రగుంట్లలకు పురపాలిక హోదా
3)రాయచోటి పట్టణానికి వెలిగల్లు జలాశయం నుండి తాగునీటి సరఫరా కోసం పైప్ లైన్ ఏర్పాటు
4)రాయచోటి పట్టణంలో రహదారుల విస్తరణ
కడప, ప్రొద్దుటూరు, పులివెందులల్లో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ
కడప
******
1) రూ.200 కోట్లతో రిమ్స్‌వైద్యశాల
2) రూ.70 కోట్లతో కడపలో భూగర్బ డ్రైనెజీ వ్యవస్థ
౩) రూ.72 కోట్లతో బుగ్గ వంక సుందరీకరణ
4) రూ.45 కోట్లతో కొత్త కలెక్ట‌రేట్ నిర్మించారు
5) రూ.22 కోట్లతో దంత వైద్య కళాశాల
6) రూ.23.10 కోట్లతో చెన్నూరు చ‌క్కర ప్యాక్టరీని రెన్యువల్ చేసారు
7) రూ.18 కోట్లతో కోండపెట దగ్గర వంతెన నిర్మించారు
8: రూ.18 కోట్లతో క్రీడా పాఠశాల
9) రూ.5.10 కోట్లతో వైఎయ‌స్ ఆర్‌ ఇండోర్ స్టెడియం
10) రూ. 6 కోట్లతో శిల్పారామం కడపలో
11) రూ. 5 కోట్లతో కడప రింగురోడ్డు
12) 750 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
14) రూ.430 కోట్లతో కడపకు తాగునీరు కోసం సోమశిల జలాశ‌యం నుండి పైప్ లైన్ పనులు మొద‌లు పెట్టారు. కానీ రాజన్న చనిపోయాక మధ్య‌లోనే ఆగిపొయాయి.
15) సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్ (విశ్వవిద్యాలయాలకు అనుసంధానించడం)
16)వైయస్ఆర్ ఉద్యాన కళాశాల (Horticulture College), అనంతరాజుపేట (రాయలసీమలోని ఏకైక ఉద్యాన కళాశాల, 06/06/2007న ప్రారంభమైంది)
17)ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు – కమలాపురం, రాయచోటి, రాజంపేట, ఓబులవారిపల్లి (GO No MS 45, Dated 10/04/2008 & RT 405, Dated: 03/05/2008)
18)Govt. College for Men, Kadapa became autonomous (the first autonomous college in Rayalaseema)
19)పదికి పైగా ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి
20)కడప నగరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఏర్పాటు
21)కడప నగరంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు
వైయస్ వెంకటరెడ్డి మెమోరియల్ మహిళా జూనియర్ కళాశాల, పులివెందుల (ప్రయివేటు కళాశాలను ప్రభుత్వపరం చేసినారు) (GO No. MS 164, Dated: 14/08/2008, Dept of Higher Education)
22) సైనిక పాఠశాల ఏర్పాటుకు అనుమతి (వైఎస్ చనిపోయినాక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ దీనిని చిత్తూరు జిల్లాలోని కలికిరికి తరలించినారు)
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 11 ఆదర్శ పాఠశాలలు
23)కడప విమానాశ్రయం ఏర్పాటు
24)కడప రైల్వే స్టేషన్ ఆధునీకరణ
25) కడప – బెంగుళూరు రైల్వే లైను మంజూరు
26) కడప మీదుగా చెన్నై – హైదరాబాదుల నడుమ కాచిగూడ/ఎగ్మోర్ రైలు
27) కడప – పులివెందుల నాలుగు వరుసల రహదారి (జీవో నెం. MS 348, తేదీ: 03/12/2008, రోడ్లు మరియు భవనాల శాఖ)
28)కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (కోటిరెడ్డి మహిళా కళాశాల)కు అదనపు తరగతి గదులు, హాస్టల్ భవనాలు
జమ్మలమడుగు
*************
1) రూ.150 కోట్లతో మైలవరం కాలువలు మరమ్మతులు 
2) రూ.11 కోట్లతో హై లెవల్ వంతెన
3) రూ.320 కోట్లతో గండికోటలో పనులు
4) రూ.12.80 కోట్లతో జమ్మలమడుగులో నాలుగు ఒవర్ హెడ్ త్రాగునీరు ట్యాంకులు
5) రూ.1 కోటి రుపాయ‌లతో మునిసిపల్ భవనం
6) 120 గ్రామాలకు తాగునీరు సరపరా
7) 1800 ఇళ్లతో రాజీవ్ కాలనీ
8: గండికోటలో టూరిజం హోటల్
9) జమ్మలమడుగు పంచాయితీ నుండి మునిసిపాలిటీగా మార్చ‌డం 
10)మైలవరంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు (ఇది వాడుకలోకి రాలేదు)
ఎర్రగుంట్ల
********
1) రూ.140 కోట్లతో RTTP కి వాటర్ పైప్ లైన్ బ్రహ్మ‌ సాగర్ నుండి 68 km పైప్ లైన్
2) రూ.23 కోట్లతో ఎర్రగుంట్లలో రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జ్
3) ఏకకాలంలో జూనియర్ , డిగ్రీ కలాశాలతోపాటు ఐటీఐ కలాశాలలు మంజూరు చెసారు
4)కమలాపురం, యర్రగుంట్ల, రైల్వేకోడూరు, పెనగలూరు, నాయుడువారిపల్లి, ఓబిలి గ్రామాలలో ఉర్దూ ఘర్/షాదీఖానాల నిర్మాణం (GO nos: RT668,669 Dt: 12/11/2008 & RT 580, Dated: 29092008, మైనారిటీ సంక్షేమ శాఖ)
మైదుకూరు
**********
1) రూ.69 కోట్లతో మైదుకూరు పొద్దుటూరు నాలుగు లైన్ రోడ్డు
2) రూ.16 కోట్లతో కుందూనది వంతెనలలు
3) రూ.55 లక్షలతో చాపాడులొ కస్తూర్బా కాలెజీ
4) రూ.73 లక్షలతో అల్లడుపల్లె దెవలాలు పునర్నిర్మానం
5) మైదుకూరు పంచాయితి నుండి మునిసిపాలిటి చెయ్యటం
బద్వేల్
******
1) రూ.120 కోట్లతో తెలుగుగంగ ఎడమకాలువ
2) రూ.20 కోట్లతో కాసినాయన మండలంలో అందమైన రోడ్లు
3) రూ.8 కోట్లతో నరసాపురం సగిలెరు బ్రిడ్జి
4) రూ.6 కోట్లతో వడ్డమాను సగిలెరు బ్రిడ్జి
5) రూ.6 కోట్లతో అక్విడెక్ట్ నిర్మానం
6) రూ. 20 లక్షలతో కస్తూర్బా గురుకుల పాటసాల
7) రూ. 70 లక్షలతో కాసినాయనకు త్రాగునీరు
8; రూ. 70 లక్షలతో స్కూల్స్ మరమ్మత్తులు
9) బడ్వెల్ పంచాయితి నుండి మునిసిపాలిటి చెయ్యటం
10) బద్వేలు సమీపంలో తోళ్ళ శుద్ది కర్మాగారం
పొద్దుటూరు
**********
1) రూ.100 కోట్లతో పశువైద్యశాల
2) రూ.24 కోట్లతో ప్రాదన కాలువ మరమ్మతులు
3) రూ.26 qకోట్లతో త్రాగునీరు పైప్ లైన్ల్ను
4) రూ.24 కోట్లతో మూడు బారీ వంతెనలు
5) రూ.14 కోట్లతో పెద్దసుపత్రి అధునీకరణ
6) రూ.11 కోట్లతో రింగు రోడ్డు
7) రూ.4 కోట్లతో R&B అతిది గ్రుహం
8: రూ.4 కోట్లతో కోర్టు భవనం నిర్మాణం
వీటితోపాటు 
9) యోగివెమన యూనివర్సిటి
10) యోగి వేమన ఇంజనీరింగ్ కాలేజీ
11) గాంధీ రోడ్డు మునీసిపల్ కాంప్లెక్స్ నిర్మాణం
12)పొద్దుటూరు మునిసిపల్ కార్యాలయం నిర్మాణం
13) ప్రొద్దుటూరులో 5 ఎకరాల విస్తీర్ణంలో RTO కార్యాలయాల నిర్మాణం (GO No: RT 1552, Dated: 17/10/2008, Dept of Transports Roads & Buildings)
14)కుందు నదిపైన ప్రొద్దుటూరు-చాగలమర్రి (వెల్లాల వద్ద), గుండ్లకుంట్ల-సత్రం, పెద్దపసుపుల-నెమళ్లదిన్నె రోడ్ల పైన హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణం (జీవో నెంబర్లు RT 1756, 1643, 509 Dept of Transports Roads & Buildings)
రాజంపేట
********
1) రూ.20 కోట్లతో రైల్వె బ్రిడ్జి
2) రూ.7 కోట్లతో బాలరాచపల్లె వంతెన
3) రూ.100 కోట్లు ముంపుప్రాంత పరిహారం
4) రూ.40 కోట్ల వ్యయంతో అన్నమయ్య జలాసయం త్రాగునీరు
5) రూ.100 కోట్ల రూపాయలు రాజంపెట మునిసిపాలిటి రోడ్ల మరమ్మత్తులు, డ్రైనెజీ వ్యవస్తకి ఇచ్చారు.
6) 108 ఆడుగుల అన్నమయ్య విగ్రహం

తాజా వీడియోలు

Back to Top