కాంగ్రెస్‌, టిడిపి కుట్రలపై జనభేరి

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబమే లక్ష్యంగా కాంగ్రెస్, ‌టిడిపిలు పన్నుతున్న కుట్రలను ప్రజా కోర్టులో పటాపంచలు చేస్తూ రాజన్న బిడ్డ.. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహాయజ్ఞంలా సాగుతోంది. శ్రీమతి షర్మిలను ఇంటి ఆడపడుచులా ఆదరిస్తూ.. ఆమెలో మహానేత వైయస్‌ను, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చూసుకుంటున్న జనం హారతులు పడుతున్నారు. చీర, సారె పెట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

పెద్దలంతా శ్రీమతి షర్మిలను ‘విజయీభవ’ అని దీవిస్తున్నారు. ‘నేను.. మీ రాజన్న బిడ్డని.. జగనన్న చెల్లెలిని...’ అనే మాటల్ని విని ప్రతి హృదయం పులకిస్తోంది. అందరినీ పేరుపేరునా పలకరించే మహానేత వైయస్ ‌మాదిరిగానే ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. మాట తప్పని, మడమ తిప్పని నైజాన్ని తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బాటలో పయనిస్తూ.. తెలుగువాడి గుండెల్లో శ్రీమతి షర్మిల గూడు కట్టుకుంటున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం చాగల్లు మండలంలోని ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనా నగరం, కొవ్వూరు మండలం పంగిడి, కాపవరం, దొమ్మేరు మీదుగా కొనసాగింది.

కొవ్వూరు (ప.గో.జిల్లా) :

పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు, యువత.. అన్నివర్గాల ప్రజలు కిరణ్‌రెడ్డి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను గొంతెత్తి వినిపించారు. మహానేత వైయస్ కుటుంబమే లక్ష్యంగా కాంగ్రె‌స్, ‌టిడిపి చేస్తున్న కుట్రలపై ధ్వజమెత్తారు. పాదయాత్రలో శ్రీమతి షర్మిల వెంట కదం తొక్కుతూ జనభేరి మోగించారు. ఓటు ఆయుధంతో కాంగ్రెస్, ‌టిడిపిలను తరిమికొడతామని శపథం చేశారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో 23వ రోజైన సోమవా రం దిగ్విజయంగా కొనసాగింది. ఉదయం 9.10 గంటలకు కొవ్వూ రు నియోజకవర్గ పరిధిలోని చాగల్లు మండలం గరప్పాడు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనానగరం, కొవ్వూరు మండలం పంగిడి, కాపవరం మీదుగా దొమ్మేరు వరకు సాగింది. ఎ‌స్.ముప్పవరంలో‌ డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. జి.సత్యనారాయణ అనే వృద్ధుడిని పలకరించిన శ్రీమతి షర్మిల అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఎం.నాగరాజు అనే వికలాంగుడిని అన్నా.. ఎలా ఉన్నావని ఆప్యాయంగా శ్రీమతి షర్మిల పలకరించారు. మార్గమధ్యంలో శ్రీమతి షర్మిలను కలిసేందుకు వెంకట రమణ అనే వృద్ధుడు ప్రయత్నించాడు. జనం భారీగా ఉండటంతో వీలుకాలేదు. అతనని చూసిన శ్రీమతి షర్మిల రోప్‌ లోపలికి పంపించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు. సిబ్బంది అతనని తీసుకురాగా, శ్రీమతి షర్మిల అతని యోగ క్షేమాలు ఆరా తీశారు. ఊనగట్ల సమీపంలో పి.శ్రీను అనే వికలాంగుడు శ్రీమతి షర్మిలకు వినతిపత్రాన్ని అందజేశాడు. వికలాంగులకు మరింత చేయూత ఇవ్వాలని కోరాడు. చాగల్లులో వైద్య సిబ్బంది శ్రీమతి షర్మిలకు ఘన స్వాగతం పలికారు.

మీనానగరానికి చెందిన యు.రిబ్కా అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంకలో వేసుకుని రద్దీగా ఉన్నా.. శ్రీమతి షర్మిల వద్దకు తీసుకువచ్చి చిన్నారుల్ని ముద్దాడాలని కోరింది. శ్రీమతి షర్మిల వారిని ముద్దాడటంతో ఆమె పులకించిపోయింది. ధ్యాన రత్తయ్య అనే వృద్దుడిని ‘పెద్దయ్యా.. బాగున్నావా’ అని శ్రీమతి షర్మిల పలకరించారు. ఐ.పంగిడిలో ఎం.సత్యనారాయణ, కుమారి దంపతులు పుష్పవతి అయిన తమ పుత్రికను ఆశీర్వదించాలని కోరారు. అక్షింతలు వేసి ‘చల్లగా ఉండమ్మా’ అని శ్రీమతి షర్మిల దీవించారు.

పంగిడి శివారులో కొందరు రైతులు శ్రీమతి షర్మిలను కలిసి కొవ్వాడ అవుట్‌ఫాల్ స్లూయి‌జ్ పనుల పరిస్థితిని వివరించారు. కాపవరంలో‌ మహానేత డాక్టర్ వై‌యస్ విగ్రహానికి పూలమాల వేసిన ‌ఆమె నివాళులు అర్పించారు. కాపవరానికి చెందిన నాగిరెడ్డి సరస్వతి, రమ్య, జాన్సీ అనే మహిళలు శ్రీమతి షర్మిలకు స్వీట్లు తినిపించి, పసుపు కుంకుమలు, చీర అందించారు. దొమ్మేరు సెంటర్‌లో భారీగా జనం చేరటంతో వారిని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

Back to Top