జననేత సోదరికి నల్గొండ జనాభిమానం

మిర్యాలగూడ (నల్గొండజిల్లా) : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్గొండ జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. జిల్లాలో తొమ్మిదవ రోజుకు చేరిన శ్రీమతి షర్మిల పాదయాత్రకు అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. తమ వద్దకే వస్తున్న మహానేత వైయస్‌ తనయ, జననేత శ్రీ జగన్‌ సోదరికి ప్రజలు అడుగడుగునా అఖండ స్వాగతం పలుకుతున్నారు.

భారీవర్షం కారణంగా శ్రీమతి షర్మిల శనివారం మధ్యాహ్నం తన పాదయాత్రను 12.35 గంటలకు ప్రారంభించారు. నిడమనూరు మండలం ముకుందాపురం శివారు నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర మిర్యాలగూడ మండలం తుంగపాడు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్ వరకు కొనసాగింది. పాదయాత్ర ప్రారంభం కాగానే త్రిపురారానికి చెందిన మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీశారు.

మహానేత డాక్టర్‌ రాజన్నబిడ్డను చూసేందుకు త్రిపురారం మండల కేంద్రంలో భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు, విద్యార్థులు నిలబడి స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు ఉండటం వల్ల వారికి అభివాదం చేయడానికి శ్రీమతి షర్మిల వాహనంపైకి ఎక్కాల్సి వచ్చింది. దారి పొడవునా ఎదురు చూస్తున్న అభిమానులను శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరించారు. పాదయాత్ర మిర్యాలగూడ మండలంలోని తుంగపాడుకు చేరుకోగానే పూలవర్షం కురిపించిన ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తుంగపాడులో దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి‌ శ్రీమతి షర్మిల పూలమాలలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మూడవ వ్యక్తి, మూడవ పార్టీని లేకుండా చేసేందుకే కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై జగనన్నను జైల్లో పెట్టాయని ఆరోపించారు. జగనన్న త్వరలో బయటకు వస్తారని, కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపే రోజులు దగ్గర‌ పడ్డాయని అన్నారు. జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం స్థాపిస్తారని పేర్కొన్నారు.

రైతులు, విద్యార్థులు, మహిళలకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మాత్రం అండగా ఉంటోందని శ్రీమతి షర్మిల విమర్శించారు. పాదయాత్రలో ప్రజలు చెప్పే కష్టాలు బాబుకు పట్టడం లేదని, ఆయన కేవలం సీఎం కుర్చీ కోసమే పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం పీఠం కోసం సొంత మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. శ్రీమతి షర్మిల ప్రసంగానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. కేరింతలు కొడుతూ జై జగన్ అంటూ‌ వారు నినాదాలు చేశారు.

అనంతరం తుంగపాడు శివారులో సామ్యా తండాకు చెందిన గిరిజన మహిళలు శ్రీమతి షర్మిలకు గిరిజన సంప్రదాయ వస్త్రాలను బహూకరించి నృత్యం చేశారు. పాదయాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీనివాసనగర్ సమీపంలోని సెయింట్ రేమాండ్సు హైస్కూల్ వద్దకు చేరింది. శనివారం రాత్రికి అక్కడే శ్రీమతి షర్మిల బస చేశారు. అనంతరం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేశారు.

తాజా వీడియోలు

Back to Top