వైఎస్ జగన్ టాప్ టెన్ పవర్ ఫుల్ కామెంట్లువరంగల్ ) వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన హన్మకొండ
లోని హయగ్రీవాచారి స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. పవర్ ఫుల్ గా సాగిన
ఆయనప్రసంగంలోని ముఖ్యాంశాలు...

1.   తనకు నచ్చిన వ్యక్తికి మంత్రిపదవి ఇచ్చి కేసీయార్ గారు మోజు
తీర్చుకొనేందుకు ఎన్నికలు వచ్చాయి. ఇదే జిల్లాలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉంటే
వారిని  ఉపయోగించుకోలేదు. అప్పటి దాకా డిప్యూటీ
సీఎం గా ఉన్న వ్యక్తిని పదవిలోంచి తీసేసి తన మోజు కోసం ఈ ఎన్నికలు తెచ్చిపెట్టారు.

2.     పొరపాటున అయినా ఓటు వేస్తే కేసీయార్ గారు
అనుకొంటారు. ఇప్పటికే ప్రజల్ని ఆయన పట్టించుకోవటం లేదు, ఓటు వేసి గెలిపిస్తే
మాత్రం అస్సలు పట్టించుకోవద్దని అనుకొంటారు. అందుచేత జాగ్రత్త పడండి.

3.   పత్తి రైతుకి కనీస మద్దతు ధర రూ. 4,100 అంటున్నారు. కానీ
కారణాలుచూపుతూ రైతులకు రూ. 3,500 కూడా గిట్టని పరిస్థితిలో  పంట నడుస్తోంది. కానీ, దివంగత మహానేత వైఎస్సార్
పరిపాలన కాలంలో పత్తి కి క్వింటాల్ కు రూ. 6,700 ధర పలికేది. ఇప్పుడు పత్తిరైతుకి
సరైన రేటు పలక్కపోతే పట్టించుకొనే వారు లేకపోయారు.

4.   ఎన్నికల ముందు రుణమాఫీ అన్నారు. కానీ ఇప్పుడు 4 దఫాలుగా, 5
దఫాలుగా మాఫీ చేస్తానంటున్నారు ఆరోజు మాత్రం ఈ మాట చెప్పలేదు. అదే మాట అప్పుడు
ఎందుకు జరగలేదు అనిఅడగండి. అదే బ్యాంకులు 14 శాతం అపరాధ వడ్డీ వేసే పరిస్థితి.

5.          
 ఎన్నికలకు ముందు ప్రతీ పేదవాడికి రెండు బెడ్
రూమ్ లు ఉన్న ఇళ్లు కట్టిస్తామన్నారు. 18 నెలలు గడిచిపోయాయి.   రాష్ట్రం మొత్తం మీద 396 ఇళ్లు కట్టించారు.  కానీ, దివంగత నేత వైఎస్సార్ గారి పరిపాలన గుర్తు
తెచ్చుకోండి. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే మన రాష్ట్రంలోనే 48 లక్షల
ఇళ్లు అంటే సంవత్సరానికి 10 లక్షల ఇళ్లు.

6.          
  రేట్లు
చూస్తే షాక్ కొడుతున్నాయి. కందిపప్పు కిలో 230, మినపప్పు కిలో 170 పలుకుతున్నాయి.
గత ఏడాదిలో కందిపప్పు కిలో రూ. 90 , మినపప్పు రూ. 80 ఉండేవి.  టమాటా చూస్తే 50, 60 రూపాయిల ధర పలుకుతోంది.

7.   కాంగ్రెస్ కు  నిజాయతీ లేదు. నాయకులు అవసరం అయితే దండలు
వేస్తారు, లేదంటే మాత్రం బండలు వేస్తారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మనకు విలువ,
విశ్వసనీయత లేనట్లే అన్నమాట.

8.   తెలుగుదేశం పాలన అంతా అబద్దాలు,  మోసాలు,   వెన్నుపోట్లు మయం. ఆ పార్టీని అస్సలు
నమ్మవద్దు.

9.   . విభజించేటప్పుడు బీజేపీ ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.
ఒక్కటైనా నెరవేర్చారా అని అడగాలి.

10.                       
తెలుగువారందరి
గుండెచప్పుడులోనూ వైఎస్ ఆర్ ఉన్నారు.   అదే స్ఫూర్తి, అదే దైర్యంతో అడుగుతున్నాం. ఓట్లు
అడిగే హక్కు  ఉంది. ప్రతీ మనిషికి, ప్రతీ
కుటుంబానికి మేలు చేసిన వ్యక్తి ఆయన మాత్రమే. 

Back to Top